హోంమంత్రి బాధ్యతా రాహిత్యం.. శాంతి భద్రతలు ఎక్కడ తానేటి వనితా మేడం
Publish Date:May 3, 2022
Advertisement
పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత వైఖరి. రాష్ట్రంలో ఏం చట్టాలు చేశామని చెప్పుకుంటే సరిపోదు. అవి సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఎపిలో చోటు చేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలను మహిళలు బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది. ఆంధప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా మంత్రుల స్థాయిలో ఉన్న వారు కూడా నేరస్తులకు వత్తాసు పలుకుతున్నట్లుగా మాట్లాడటం వారిని ప్రోత్సహించడం తప్ప మరొకటి కాదు. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించడం కూడా ప్రభుత్వ వైఫల్యమే. ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు వేయాలి. అలా కాకుండా సర్కార్ ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో నేరాలు పెట్రేగిపోతున్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. కొన్ని సంఘటనల్లో అధికార పార్టీ వారి జోక్యం వల్ల పోలీసులు నిందితులను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో నేర సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా విస్తరించడానికి కారణమౌతున్నది. ఈ వాస్తవాలన్నిటినీ పట్టించుకోకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ విపక్షమే కారణమంటూ హోంమంత్రి నిర్ధారణకు వచ్చేయడం బాధ్యతా రాహిత్యం కాక మరొకటి కాదు. ఖజానా నింపడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్టాలు, ఆ మత్తులో జరిగే నేరాలకు బాధ్యత వహించి తీరాలి. ఆ నేరాల్ని పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు 2019 మార్చిలో తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో నిందితులు చేసే నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత అంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. అంటే మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే కాదు.. ఆ కారణంగా అకృత్యాలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకుం టున్న అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు. అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకున్న తండ్రిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన తల్లిని బండరాయితో వెూది చంపేశాడు. అనంతపురం జిల్లాలో 33 ఏళ్ల యువకుడు కన్నతల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎంత వారించినా వినకపోవటంతో తల్లిదండ్రులు అతడిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.లారీ డ్రైవర్ మద్యం మత్తులో కన్న కుమార్తెపైనే అత్యాచారయత్నం చేసిన ఘటన కొన్నాళ్ల కిందట ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. ఇక అంతకుముందు స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో నెల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం జగన్ నివాసానికి అత్యంత సవిూపంలో ఉన్న సీతానగరం పుష్కర్ ఘాట్‌కు.. కాబోయే భర్తతో కలిసి విహారానికి వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘దిశ’ ఏమైందో, ఎక్కడుందో తెలియడం లేదు. నేరాల నియంత్రణ విషయంలో శాంతి భద్రతలను నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ దిశ, దశ లేక నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోయింది. పోలీసుల విధి నిర్వహణలో ప్రభుత్వ మితిమీరిన జోక్యమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో పులివెందుల రాజ్ నడుస్తోందన్న విపక్షాల విమర్శలు వరుసగా జరుగుతున్న అకృత్యాలు వాస్తవమే అనిపించేలా ఉన్నాయనడంలో సందేహం లేదు.
జరిగినా అది విపక్ష తెలుగుదేశం పనే అంటున్నారామె. రాష్ట్రంలో రోజూ మూడు మర్డర్లు, ఆరు రేపులు అన్నట్లుగా నేర సామ్రాజ్యం వర్ధిల్లుతుంటే.. నేరలను అరికట్టి నేరగాళ్ల పీచమణచాల్సిన పదవిలో ఉన్న తానేటి వనిత విపక్షాలపై నెపం మోపి బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం దారుణం. ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. అత్యాచార ఘటనలపై సహజంగానే విపక్షాలు విమర్శలు సంధిస్తాయి. నేరాలు వరుసగా అదుపులేకుండా జరుగుతున్నాయంటే అది కచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమే. శాంతి భద్రతల పరిరక్షణకు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాల్సిన హోంమంత్రి విపక్ష టిడిపి వాళ్ల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యం తప్ప మరొటి కాదు. రేపల్లె సామూహిత అత్యాచారం సంఘటనకు మద్యం మత్తే కారణమంటూ తేలిగ్గా తీసుకోవడం హోంమంత్రికి అందునా ఒక మహిళకు ఎంత మాత్రం తగదు. ఇటువంటి సంఘటనలు ఏపీలో నిత్యకృత్యంగా మారిపోవడం అన్నది రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి.
http://www.teluguone.com/news/content/no-law-and-orfer-in-ap-25-135394.html





