కమలంలో చేరికలు కానరావేమి?..బండి పాదయాత్ర ప్రచారార్భాటమేనా?

Publish Date:May 3, 2022

Advertisement

బండి సంజయ్ పాదయాత్ర ప్రచారార్భాటమే తప్ప.. ప్రజాదరణ విషయంలో పెద్ద ప్లాప్ అని బీజేపీ శ్రేణుల్లోనే నిరాశ ఎదురౌతున్నది. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజలలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని వచ్చే ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే లక్ష్యం అని చెప్పుకుంటూ బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేర చేపట్టిన పాదయాత్రకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం పెద్ద హైప్ ఇచ్చింది. అయితే వాస్తవంగా ప్రజాదరణ, ప్రజాస్పందన విషయంలో బండి పాదయాత్ర సాధించిందేమీ లేదని కమలం శ్రేణులే అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. బండి యాత్రలో ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా తెరాస నుంచి పెద్ద ఎత్తున నేతలు కమల తీర్ధం పుచ్చుకోనున్నారంటూ బీజేపీ ప్రచారం చేసుకుంది. అయితే అలా చేరిన దాఖలాలు లేవు సరికదా, బీజేపీలో చేరతారంటూ కమలం ప్రచారం చేసుకున్న నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరేందుకు ఆ పార్టీతో మంతనాలు జరుపుకుంటున్నారు. 
కమలం తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరిగిన వాళ్లలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. అయితే ఆయన కమలం వైపు కన్నెత్తి కూడా చూడలేదు సరికదా.. సొంత గూటికి అంటే కాంగ్రెస్ లో చేరుందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగే పలమూరులో కూడా తెరాస నుంచి బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరిగిన నేతలు కూడా ఇప్పుడు కాదు మరోసారి చూద్దామంటూ మొహం చాటేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో తెరాసకు దీటుగా ఎదిగామని చెప్పుకుంటున్న కమలనాథులకు ఈ పరిణామం మింగుడు పడటం లేదు. రాష్ట్రంలో రెండు ఉప ఎన్నికల విజయంతో తమ బలాన్ని అతిగా ఊహించుకుని చేరికలపై ప్రచారం చేసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు భిన్నంగా రాష్ట్రంలో ఉనికే లేదనుకున్న కాంగ్రెస్ చాపకింద నీరులా బలోపేతం అవుతోందనీ, ఎన్ని అంతర్గత విభేదాలున్నా, పీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు చేపట్టాకా ఆ పార్టీకి కొత్త ఊపు వచ్చిందనీ అంటున్నారు. ఈ కారణంగానే బీజేపీలో చేరికలకు బ్రేక్ పడిందనీ, తెరాసలో అసమ్మతి  వాదులు బీజేపీ కంటే కాంగ్రెస్ లో చేరేందుకే మొగ్గు చూపుతున్నారనీ వారంటున్నారు. 

By
en-us Political News

  
బీఆర్‌ఎస్ కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు.
బిజెపి ఏపీలో తన బలాన్ని మరింత పెంచుకోవడానికి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపింది. అందులో భాగంగానే వైసిపికి చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులతో బిజెపి అగ్రనాయకత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.