పీకే కథ ఇంకా వుంది ..

Publish Date:Apr 29, 2022

Advertisement

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, కాంగ్రెస్ పార్టీకి కటీఫ్ చెప్పేశారు. కాంగ్రెస్‌ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ తనకు తానుగానే పునర్‌వైభవం పొందగలదని, చెప్పవలసింది ఏదో చెప్పానని, చేయవలసింది చేస్తే సరిపోతుందని,  తన అవసరం మాత్రం ఇప్పుడు కాంగ్రెస్’కు లేదని స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ అవసరం ఉందా లేదా అనే విషయాన్ని పక్కన పెట్టి, నిజంగానే ప్రశాంత్ కిశోర్’ కాంగ్రెస్ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకున్నారా?   భవిష్యత్’ లోనూ మళ్ళీ కాంగ్రెస్’ సంబందాలు పెట్టుకోరా? అంటే, లేదు. “పీకే తలుపులు కాంగ్రెస్ కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయి” అంటున్నారు ఆయనకు అత్యంత సన్నిహితుదుడు, పొలిటికల్ అనలిస్ట్, రాజ్య సభ మాజీ ఎంపీ పవన్ వర్మ. అయితే  అది ఎప్పుడు అంటే, ఎప్పుడైనా కావచ్చని,చింతన్ శిభిర్ (మే 13-14) తర్వతనైనా కావచ్చును లేదంటే గుజరాత్, హిమచాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతనైనా కావచ్చిని, వర్మ, ‘వైర్’ చానల్’ కరుణ థాపర్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  స్పష్టం చేశారు అంతే కాదు,జాతీయ స్థాయిలో అధికార బీజేపేకి శక్తివంతమైన ప్రతిపక్షాన్ని నిర్మాణం చేయడమే ప్రశాంత్ కిశోర్ ప్రధాన లక్ష్యమని, అది కాంగ్రెస్ లేకుండా అయ్యే పని కాదని, కాబట్టి కాంగ్రెస్’కు సహకరించేందుకు ప్రశాంత్ కిశోర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని వర్మ వివరించారు. అలాగే, కాంగ్రెస్ ఐడియాలజీ గతంలోకంటే ఇప్పుడే దేశానికి అవసరమని ప్రశాంత్ కిశోర్ భావిస్తున్నారని కూడా వర్మ కొత్త విషయం చెప్పారు. ఇంతవరకు ప్రశాంత్ కిశోర్’ అంటే ఒక తెలివైన వ్యాపార వేత్తగానే అందరికీ తెలుసు. ఆయనకు రాజకీయ ఐడియాలజీ, కమిట్మెంట్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. ఆయన కూడా ఎప్పుడూ అలాంటి అభిప్రాయం వ్యక్తపరచలేదు. ఒక విధంగా వర్మ కాంగ్రెస్, పీకే సంబంధాలు సజీవంగా ఉంచేందుకు, వర్మ ‘వైర్’  ఇంటర్వ్యూ ను ఉపయోగించుకున్నారు. ఈ నేపధ్యంలోనే, ఐడిలాజికల్, సిద్ధాంత బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేశారు, అనుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. 
సో ... ఆ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహిత బంధం దృష్ట్యా  పవన్ వర్మ చెప్పిన విషయాలు, వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం, అటు నుంచి పిలుపువస్తే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చెయ్యిచ్చేందుకు ప్రశాంత్ కిశోర్ సిద్ధంగా ఉన్నారు. నిజానికి, కాంగ్రెస్, ప్రశాంత్ కిశోర్’ల మధ్య చర్చలు జరగడం, అర్ధాంతరంగా ఆగి పోవడం ఇదే మొదటి సారి కాదు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో విస్తృతంగా చర్చలు జరిపారు. అంతే కాదు, ఆతర్వాత కాంగ్రెస్’తో బ్రేకప్’ అయినా,ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా వాద్రా ప్రచార వ్యూహంలో ప్రశాంత్ కిశోర్’ ‘మేథస్సు’ మిళితమై ఉందని అంటారు.మహిళలకు 40 శాతం టికెట్లు ఇవ్వాలనే ఆలోచన, ఎన్నికలకు ముందు ఉన్నావ్ వెళుతూ ప్రియాంక అరెస్ట్ కావడం , ఆమె చీపురు పట్టుకుని గది చిమ్ముకునే వీడియో/ ఫోటో వైరల్ చేయడం, అన్నిటినీ మించి, ‘లడ్కీహూ ఔర్ లడ్’సక్తీ హూ’ నినాదం ఇవ్వన్నీ కూడా ప్రశాంత్ కిశోర్ మానస పుత్రికలే అనే ప్రచారం జరిగింది. నిజానికి. అందుకే కావచ్చును ప్రశాంత్ కిశోర్’ పక్కా బిజినెస్ మ్యాన్ అయినా ఎక్కడో ఆయనలో కాసింత కాంగ్రెస్ బ్లడ్ మిగిలుందేమో అని అనుమానాలు కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతున్నాయి. 
అదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రశాంత్ కిశోర్’ తలుపు తడుతుందా ? అలాంటి అవసరం వస్తుందా అంటే, అందుకు  ప్రశాంత్ కిశోరే ... ఒకటికి రెండు సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్’ కు బ్రేకప్ చెప్పిన సందర్భంలో చేసిన ట్వీట్’ లో పీకే, ‘కాంగ్రెస్ పార్టీకి తన కంటే, నిర్మాణాత్మకమైన సమస్యలను పరివర్తనాత్మకమైన సంస్కరణల ద్వారా మార్చే నాయకత్వం, సమిష్టి పట్టుదల అవసరం’ అని పేర్కొనారు. అంటే కాంగ్రెస్ పార్టీకి కావలసింది, వ్యూహాలు కాదు. నాయకత్వమని, అది ఇప్పుడు పార్టీకి లేదని చెప్పకనే చెప్పారు. అలాగే, కాంగ్రెస్ పార్టీలో పాతుకుపోయిన సంస్థాగత బలహీనతలు ఏమిటో, ఎవరికీ తెలియంది కాదు. ఇంచుమించుగా రెండు సంవత్సరాలకు పైగా జీ 21 నేతలు నోటితో చేపుతున్న మాటలనే పీకే స్లైడ్స్ ‘లో చూపించారు. నిజానికి, ఈ విషయంలోనూ పీకేను తప్పు పట్టవలసిన అవసరం లేదు. బ్రేకప్ తర్వాత ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే అదే విషయం చెప్పారు. ప్రెజెంటేషన్’ కు ముందు మాటగానే, “ఇందులో చెప్పే విషయాలు ఏవీ కొత్తవి కాదు. ఇంతకు ముందు ఎవరూ చెప్పకే చెప్పారు.  అయితే, ఆయనే ఉంటే ... క్షురకునితో పనేమిటి’ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య నాయకత్వ సమస్య. జీ 23 నేతలు చెప్పింది అదే. పీకే చెప్పింది అదే. సో .. కాంగ్రెస్ సమస్యకు పరిష్కారం కాంగ్రెస్’లోనే వుంది. కాంగ్రెస్ పార్టీ బలం బలహీనత రెండూ’ నెహ్రూ గాంధీ కుటుంబమే .. అదే అసలు సమస్య.

By
en-us Political News

  
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
తెలుగు సమాజం మీద తెలుగేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ముద్ర ఎన్నటికి చెరిగిపోనిది. నటుడిగా అయన కృషి అజరామరం. రాజకీయ నాయకుడిగా అయన 14 ఏళ్ల ప్రస్థానంలో అయన ప్రభావం మహత్తరం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయడంతో పాటు, తెలుగు సమాజంలో ఫ్యూడల్ వ్యవస్థలను నిర్మూలించి, అట్టడుగు వర్గాల సామాజిక, రాజకీయ ఉన్నతికి తోడ్పడం లో ఎన్టీఆర్ చూపించిన చొరవ నభూతో నభవిష్యతి.
ఈ తీర్మానంలో ప్రధానంగా ప్ర‌స్తావించిన సెక్ష‌న్ 5 స‌వ‌ర‌ణ అత్యంత కీల‌కం. 2014 ఏపీ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ ఐదు ప్ర‌కారం.. హైద‌రాబాద్ ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉంది. ఆ త‌ర్వాత ఏపీకి కొత్త రాజ‌ధాని ఉండాల‌ని ఉంది. కానీ, దాని పేరు అమ‌రావ‌తి అని ఎక్క‌డా స్ప‌ష్టంగా లేదు. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అనే ద‌గ్గ‌ర అమ‌రావ‌తి అనే ప‌దాన్ని చేర్చాల‌ని.. కేంద్రాన్ని కోరుతూ.. అసెంబ్లీ శనివారం తీర్మానం చేసింది.
శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ, దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత కొన్నేళ్లుగా రాజధాని విషయంలో నెలకొన్న గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజాగా కాకినాడ జిల్లాలో లోన్ యాప్ నిర్వాహకుల వేధింపుల కారణంగా ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివకాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా వడ్డాదిమాడుగుల గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహమ్మద్ బషీర్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి సెంటిమెంట్లు బాగా ఎక్కువ‌. ఎందుకంటే ఆ కుటుంబం ఎదిగిందే ఇలాంటి సెంటిమెంట్ల ద్వారా.
తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు.
కేంద్రమంత్రి పెమ్మ‌సాని, అంబ‌టి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది
భేటీ అనంతరం అంబటి రాంబాబు ముద్రగడపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన పట్టుదల, రాజకీయాలలో నిజాయితీ, విలువలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యతను ప్రస్తుతించారు. తమ మధ్య జరిగిన ఈ భేటీలో పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చ జరిగిందని తెలిపారు.
తెలుగువన్ వాస్తవ వేదిక సంచికలో ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
ఈ నేపథ్యంలో జరగనున్న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
2026 తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఈసారి ఎవరికీ అంత సులువుగా కనిపించడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.