Publish Date:Apr 10, 2026
బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పిన నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా శుక్రవారం (ఏప్రిల్ 10) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో ఆయన ఇకపై పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలకే పరిమితం కానున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ ప్రమాణ స్వీకారంతో నితీశ్ కుమార్ భారత రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. శాసనసభ , శాసనమండలి , లోక్‌సభ, రాజ్యసభ లలోనూ సభ్యుడిగా పనిచేసిన అతికొద్ది మంది నాయకుల జాబితాలో నితీశ్ చేరారు. ఇది ఆయన సుదీర్ఘ, వైవిధ్యభరితమైన రాజకీయ అనుభవానికి అద్దంపడుతోంది.
గత నెలలో జరిగిన ఎన్నికల్లో నితీశ్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన గత నెల 30న తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా సమర్పించారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నందున, ముఖ్యమంత్రి హోదాలో కొనసాగేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బీహార్ అభివృద్ధి కోసం తాను ఇన్నేళ్లుగా పని చేశాననీ, రాష్ట్ర ప్రగతికి అవసరమైన పునాదులు వేశాననీ చెప్పుకొచ్చారు. ఇక నుంచీ జాతీయ స్థాయిలో సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. 2005 నుండి బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా కొనసాగుతూ వచ్చిన ఆయన, దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nitish-sworn-in-as-rajya-sabha-member-25-217066.html
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.
జగన్‌లో మార్పు వుంటుందా, వుండదా అన్న అయోమయంలో వైసీపీ నేతలు.. ఆయనలో మార్పు వుండదన్న నిశ్చయానికి వచ్చేస్తున్నారు.