బల పరీక్షలో గెలిచిన నితీష్

Publish Date:Aug 25, 2022

Advertisement

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీ విశ్వాసాన్ని చూరగొన్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆర్జేడీ తదితర పార్టీల మద్దతుతో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత మొదటి  అసెంబ్లీ సమావేశం బుధవారం జరిగింది. ఆ సమావేశంలో నితీష్ కుమార్ సభలో తన బలాన్ని నిరూపించుకున్నారు. అయితే బల పరీక్సకు ముందు నితీష్ మాట్లాడుతూ రెండేళ్ల కిందట బీజేపీ కన్నా చాలా తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూకే సీఎం పదవి దక్కడానికి గల కారణాలను వివరించారు. 2020 ఎన్నికల అనంతరం బీజేపీ తనపై తీవ్ర ఒత్తడి తీసుకువచ్చి తాను సీఎం పదవిని చేపట్టేలా ఒప్పించిందని వెల్లడించారు. బీజేపీ కంటే తక్కువ స్థానాలు వచ్చిన జేడీయూ నుంచి తనకు సీఎం పదవి వస్తుందని తానసలు ఊహించలేదనీ, బీజేపీ నుంచి రేసులో ఉన్న ఉన్న సుశీల్ కుమార్ మోడీయే బీహార్ సీఎంగా బాధ్యతలు చేపడతారని తాను భావించినట్లు చెప్పారు. అయితే బీజేపీ తనపై ఒత్తిడి తీసుకు వచ్చి సీఎం పదవి చేపట్టేలా ఒప్పించిందని వివరించారు. అయితే ఆ మరుక్షణం నుంచీ అన్ని వైపుల నుంచీ తన కాళ్లూ చేతులూ కట్టేయడానికే ప్రయత్నించిందని నితీష్ ఇప్పుడు ఆరోపించారు.

స్పీకర్ విషయంలో కూడా అప్పట్లో తన మాట నెగ్గలేదని వివరించారు. అలా రెండేళ్ల పాటు ఒత్తిడుల మధ్య సీఎంగా కొనసాగిన తాను చివరకు ఆ బంధాన్ని తెంచుకున్నానని వివరించారు. తాజాగా మహాఘట్ బంధన్ ప్రభుత్వం కొలువుదీరి, సభలో బల పరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు నిర్వహించడం ఎంతమాత్రం యాధృచ్ఛికం కాదని సీఎం నితీష్ కుమార్ ఆరోపించారు. రైల్వే ఉద్యోగాల కోసం భూములను లంచంగా తీసుకున్న కేసులో భాగంగా సీబీఐ బీహార్ లో దాడులు నిర్వహించింది.

2004-09  మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో  జరిగిన రిక్రూట్‌మెంట్లలో పలువురు అభ్యర్థులకు గ్రూప్‌ డీ ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ భూములను లంచంగా తీసుకున్నారని అభియోగాలు ఉన్న సంగతి విదితమే.

ఆ కేసుకు సంబంధించి సీబీఐ బుధవారం ఆర్జేడీ ఎంపీ అహ్మద్ కరీం, ఎమ్మెల్సీ సునీల్ సింగ్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతల ఇళ్ళలో సోదా నిర్వహించింది. అయితే ఈ దాడుల వెనుక ఉన్నది రాజకీయ కారణమేనని నితీష్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని అస్ధిర పరిచే లక్ష్యంతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. ఇటువంటి దాడులకు బెదిరేది లేదని స్పష్టం చేశారు. 

By
en-us Political News

  
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.
రేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు. దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి 8932 రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా మోడీ కొత్త రికార్డు సృష్టించారు.
దేశ చరిత్రలో ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ. ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి.
బుజ్జగింపు ప్రయత్నాలు ఫలించలేదు. ఇంత వరకూ వచ్చిన తరువాత పార్టీలో కొనసాగితే.. తన గౌరవానికి భంగం అని జీవన్ రెడ్డి తనను బుజ్జగించడానికి వచ్చిన నేతలతో అన్నట్లు సమాచారం. వాస్తవానికి గత కొంతకాలంగా పార్టీ అంతర్గత పరిణామాలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నజీవన్ రెడ్డి.. బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.
రిజర్వుడు నియోజకవర్గాల నుంచి పార్టీ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు 15వేల రూపాయలు, జనరల్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న వారు పాతిక వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇలా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి నిర్దిష్ట తేదీ, నిర్దిష్ట సమయం కేటాయించి ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
తెలుగువన్ వాస్తవ వేదిక తాజా సంచికలో వివేక హత్య కేసుపై విస్తృత చర్చ జరిగింది
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కలిసి ఇటీవల ఒకే ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.
చంద్రబాబు కూడా పలు సందర్భాలలో కొందరు మంత్రుల పనితీరు బాగా లేదనీ, వారు తమ తీరు మార్చుకోవాలని పలుమార్లు సూచించిన విషయం తెలసిందే. అయితే ఏ సందర్భంలోనూ కూడా ఆయన పని తీరు బాగా లేని మంత్రుల పేర్లు వెల్లడించలేదు. ఇక బాబు తనదైన శైలిలో ఎప్పటికప్పుడు మంత్రుల పని తీరును సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.
తనకు కాంగ్రెస్ తో ఉన్న అనుబంధానికి తెగతెంపులు చేసుకోవడం ఖాయమైపోయినట్లేనని పరిశీలకులు అంటున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరినప్పటి నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.
పుట్టా మహూష్ ఇచ్చిన వివరణ ఆధారంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులోతెలుగుదేశం పార్టీ నాయకుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఈ వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ గా స్పందించి.. పుట్టా మహేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పార్టీ హైకమాండ్ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసి ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాని ఆదేశించింది.
ఆమె పోరాటం ప్రధానంగా తన తండ్రి కేసీఆర్, ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలపైనేనని విస్పష్ట సంకేతాలిచ్చేశాయి. డాడీ అంటే తన తండ్రి కేసీఆర్ అని, చిన్న మోదీ అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పరోక్షంగా అయినా స్పష్టంగా చెప్పారు.
ఒకప్పుడు అంటే జగన్ అధికారంలో ఉన్న సమయంలో వైసీపీలో కీలక నేతగా, ఆ పార్టీ అధినేత జగన్ కు సన్నిహితుడిగా, ఆయన కుటుంబ బంధువుగా బాలినేని శ్రీనివాసరెడ్డి చక్రం తిప్పారు. అయితే గత ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో బాలినేని పరిస్థితి పొమ్మనలేక పొగపెట్టిన చందంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.