విజయనగరం ఐసిస్ ఉగ్రకుట్ర కేసు.. ఎన్ఐఏ అనుబంధ చార్జిషీట్

Publish Date:Feb 20, 2026

Advertisement

విజయనగరం జిల్లాలో వెలుగుచూసిన ఐసిస్‌ ఉగ్ర  కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ  ఎన్‌ఐఏ  దర్యాప్తును   వేగవంతం చేసింది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడితో పాటు మరో వ్యక్తిపై ఎన్‌ఐఏ అనుబంధ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ అనుబంధ చార్జ్ షీట్ లో కీలక ఆధారాలను   కోర్టుకు నివేదించింది. విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో ఎన్ఐఏ శుక్రవారం (ఫిబ్రవరి 20) ఈ చార్జిషీట్‌ను దాఖలు చేసింది. 

ఈ కేసులో   అబు తాలిబ్ అలియాస్ ఆరిఫ్ హుస్సేన్, ఇమ్రాన్ అక్రమ్‌లపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం , ఆయుధాల చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. వీరిలో ఇమ్రాన్ అక్రమ్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆరిఫ్ హుస్సేన్‌ను గత ఏడాది ఆగస్టు 27న న్యూఢిల్లీ విమానాశ్రయంలో  ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసు మొదట విజయనగరం పోలీస్ స్టేషన్‌లో నమోదైంది. సిరాజ్ ఉర్ రహిమాన్, సయ్యద్ సమీర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఎన్ఐఏ దర్యాప్తుచేపట్టింది. గత ఏడాది  నవంబర్ 2025లో ఈ ఇద్దరిపై మొదటి చార్జిషీట్ దాఖలు చేసింది.

కాగా తాజాగా ఎన్ఐఏ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్ లో కీలక, సంచలన విషయాలు బయటపడ్డాయి. పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్ ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. పేలుడు పదార్థాల సేకరణ కోసం సిరాజ్ ఉర్ రహిమాన్, సయ్యద్ సమీర్‌లకు నిధులు అందించినట్లు ఆధారాలున్నాయని  పేర్కొంది. మరోవైపు బీహార్‌కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ ఉగ్రకుట్రలో భాగస్వామిగా మారి ఆయుధాల సరఫరా కోసం సిరాజ్‌తో కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. అంతేకాదు సరిహద్దుల గుండా ఆయుధాలను అక్రమంగా తరలించడంలో  కీలకంగా వ్యవహరించినట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

సోషల్ మీడియా వేదికలను వినియోగించి తీవ్రవాద జిహాదీ భావజాలాన్ని ప్రచారం చేసినట్లు  తమ దర్యాప్తులో నిర్ధారణ  అయ్యిందనీ, దేశ భద్రతకు ముప్పుగా మారేలా ఈ కుట్రను విస్తరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు ఎన్‌ఐఏ అధికారులు కోర్టుకు సమర్పించిన అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

 పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్ కోసం దేశవ్యాప్తంగా గాలింపు కొనసాగుతోందని, ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని ఎన్‌ఐఏ వర్గాలు వెల్లడించాయి. ఉగ్రవాద నెట్ వర్క్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఆయుధాల సరఫరా మార్గాలు, సోషల్ మీడియా ద్వారా నిర్వహించిన రహస్య కమ్యూనికేషన్‌పై దర్యాప్తు కొనసాగుతోంది.

విజయనగరం జిల్లాలో వెలుగుచూసిన ఈ కేసు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎన్‌ఐఏ దర్యాప్తు పురోగతితో ఉగ్రవాద ముఠా కార్యకలాపాలపై మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.

By
en-us Political News

  
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తరువాత గంటల వ్యవధిలో రష్యా మాజీ ప్రధాని మెద్వెదేవ్ ఇరాన్ అణ్వస్త్ర పరీక్ష నిర్వహించిందన్న బాంబు లాంటి వార్తను వెల్లడించారు. ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ అణ్వాయుధ పరీక్ష నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం యనమల రామకృష్ణుడుకు గుండెలో బ్లాకులు ఉన్నట్లు గుర్తించిన ఉవైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, ఒక స్టెంట్‌ను అమర్చారు.
అంతర్జాతీయ సమాజం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే నెతన్యాహు ఒక అడుగు దిగి వచ్చారని అంటున్నారు. అదే సమయంలో పైచేయి మాదేనని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు.
ఇరాన్, అమెరికాల మధ్య శాంతి నెలకొల్పే చర్చలకు పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక కానున్న నేపథ్యంలో అమెరికా రంగంలోకి దిగింది. ఈ చర్చలకు వేదిక అయిన ఇస్లామాబాద్ లో అమెరికా అసాధారణ భద్రతా ఏర్పాట్లకు ఉపక్రమించింది.
ఇరాన్, అమెరికా మధ్య శాంతి కోసం పాకిస్థాన్ మధ్యవర్తిత్వాన్ని స్వాగతిస్తూనే ఇజ్రాయెల్ పాక్ నమ్మదగిన దేశం కాదని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇజ్రాయెల్ లెబనాన్ పై తన దాడులను సమర్ధించుకుంటూ చేసిన వ్యాఖ్యలవి. దీనిపై పాక్ రక్షణ మంత్రి ఒకింత అతిగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇజ్రాయెల్‌ను క్యాన్సర్ తో పోల్చారు.
దౌత్యపరమైన ప్రయత్నాలు బలహీనంగా ఉండగా, మాటల యుద్ధం మరియు సైనిక చర్యలు తీవ్రతరం అవుతూనే ఉన్నాయి.
ప్రపంచ చమురు రవాణాలో హెర్మూజ్‌ జలసంధి ద్వారా జరిగే వాణిజ్యంపై అనేక ఐరోపా దేశాలు మరియు ఆసియా దేశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే.. ఇక్కడ నౌకల రాకపోకలకు భద్రత కల్పించేందుకు అమెరికా తన నౌకాదళాన్ని, యుద్ధ విమానాలను మోహరించి భారీగా ఖర్చు చేస్తుంటే.. నాటో దేశాలు ఈ బాధ్యత పంచుకోవలసింది పోయి చోద్యం చూస్తున్నాయని ట్రంప్ రుసరుసలాడారు.
సరిగ్గా ఆ సమయంలో క్రీజ్ లోకి వచ్చాడు ముకుల్ చౌదరి. ఓటమి అంచుల్లో ఉన్న లక్నో జయింట్స్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. 27 బంతుల్లోనే 2 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టును గెలిపించాడు.
భూ రికార్డుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీని, క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రెవెన్యూ వ్యవస్థలో పెనుమార్పులకు ఈ పట్టాదార్ పాసుపుస్తకాల ద్వారా శ్రీకారం చుట్టారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి విరామం ప్రకటించి, ఇరాన్ పది సూత్రాల శాంతి ప్రతిపాదనను భేష్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. గంటల వ్యవధిలోనే ఇరాన్ తో శాంతి ఒప్పందానికి, ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులకూ సంబంధం లేదంటూ ఇజ్రాయెల్ కు వంత పాడారు.
అంతటా ఆర్థిక వృద్ధి మందగిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం ప్రధాన చోదక శక్తిగా నిలుస్తూనే ఉంది; విస్తృత ఆర్థిక దృక్పథం అనిశ్చితంగా ఉన్న ప్రస్తుత తరుణంలో, ఇది ఒక రకమైన స్థిరత్వాన్ని అందిస్తోంది.
యుద్ధం ప్రారంభమైన తర్వాత జేఎన్‌పీఏ పోర్టుకు చేరుకున్న తొలి భారతీయ ఎల్పీజీ నౌక ఇదే కావడం గమనార్హం.ఈ నౌక ప్రయాణం ఆద్యంతం ఉద్రిక్తతల మధ్య, ప్రమాదాల మధ్యా సాగింది. హోర్ముజ్ జలసంధిలో నియంత్రణను కఠినతరం చేసిన ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ భారత్ ఈ రవాణాను సుసాధ్యం చేసింది.
నియోజకవర్గంలోని ఒక 40 మంది లబ్ధిదారుల జాబితా పంపిస్తే, వారికి వెంటనే లోన్లు మంజూరు చేయిస్తామంటూ నమ్మబలికాడు. దరఖాస్తు చేసుకోవడానికి అదే చివరి రోజని, ఒక్కొక్కరికి రూ. 2,500 చొప్పున మొత్తం 40 మందికి కలిపి రూ. 1 లక్ష ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని చెప్పాడు. ఎమ్మెల్యే పల్లా ఆ వ్యక్తి మాటలను పూర్తిగా నమ్మేసి.. తన నియోజకవర్గ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే ఆ మొత్తాన్ని ఫోన్ పే ద్వారా సదరు వ్యక్తికి పంపించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.