విజయవాడలో ఉగ్ర గుట్టురట్టు.. ఎన్‌ఐఏ మెగా దాడులు.!

Publish Date:Jul 8, 2026

Advertisement

విజయవాడ నగరంలో  ఎన్ఐఏ దాడులు కలకలం రేపాయి. బుధవారం (జూలై 8) ఉదయం జాతీయ దర్యాప్తు సంస్థ  ఎన్‌ఐఏ  విస్తృత దాడులు చేపట్టాయి. విజయవాడలోని వించిపేట పరిసర ప్రాంతాల్లోని నిందితుల ఇళ్లు, వారు నివసించిన రహస్య స్థావరాలపై ఏకకాలంలో ఈ  సోదాలు జరిగాయి.  విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఎన్‌ఐఏకు బదిలీ అయిన ఉగ్రవాద ముఠా లింకుల కేసు విచారణలో భాగంగా ఈ  తనిఖీలు జరిగాయి.  ఈ సోదాలతో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, అల్ ఖైదా నెట్‌వర్క్‌ల ప్రమాదకరమైన దేశద్రోహ కుట్రల గుట్టు రట్టయింది.

ఈ భారీ నెట్‌వర్క్‌ విషయంలో..  మొదట ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు సోషల్ మీడియా వేదికలపై నిరంతరం నిఘా ఉంచి ఛేదించారు. ఈ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటివరకు ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారిలో విజయవాడకు చెందిన 23 ఏళ్ల  మహ్మద్ రహ్మతుల్లా షరీఫ్, 27 ఏళ్ల ఎండీ డానిష్, 23ఏళ్ల  మీర్జా సోహైల్ బేగ్‌లతో పాటు, హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం, కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌లో కేవలం తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఢిల్లీ, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి 8 రాష్ట్రాలకు చెందిన మొత్తం 12 మంది నిందితుల పేర్లను చేర్చారు.

వీరంతా కలిసి  అల్-మాలిక్ ఇస్లామిక్ యూత్' అనే ఒక రహస్య గ్రూపుగా ఏర్పడ్డారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. విదేశీ హ్యాండ్లర్ అయిన అల్-హకీమ్ షుకూర్ నిర్దేశకత్వంలో వీరంతా భారత్‌లో ఐసిస్, అల్-ఖైదా నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించడానికి ప్రణాళికలు వేశారు. నిందితులను విచారించిన అధికారులకు దిగ్భ్రాంతికరమైన కుట్ర కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాను ఇస్లామిక్ దేశంగా మార్చడం..   జాతీయ జెండా స్థానంలో ఐసిస్ నల్ల జెండాను ఎగురవేయడం, అలాగే 'గజ్వా-ఎ-హింద్  కోసం పనిచేయడమే తమ ముఖ్య లక్ష్యాలని నిందితులు అంగీకరించారు. ఇందుకోసం వారు ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలుగా బెనెక్స్.కామ్ అనే  రహస్య గ్రూపులను క్రియేట్ చేశారు.

ఈ డిజిటల్ గ్రూపులలో కొందరు పాక్ జాతీయులు కూడా సభ్యులుగా చేరి ఉగ్ర కార్యకలాపాలను నడిపించేవారని సమాచారం. ఈ గ్రూపుల ద్వారా జిహాద్ పేరిట ప్రాణాలర్పించడానికి    యువతను బ్రెయిన్ వాష్ చేసి చేర్చుకునేవారు. వారిని ఆత్మాహుతి దాడులకు   ప్రేరేపించేవారు. విదేశీ హ్యాండ్లర్ షుకూర్ ఆదేశాల మేరకు   యువతను ఆకర్షించి, వారిని పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లకు పంపి అక్కడ స్నైపర్ రైఫిళ్లు, గన్స్, బ్లాక్ పౌడర్ బాంబులు, ఐఈడీ  పేలుడు పదార్థాల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడానికి ప్రమాదకరమైన స్కెచ్ వేశారు.

వీరికి అవసరమైన అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలను పాకిస్థాన్ లోని సభ్యుల ద్వారా సరిహద్దుల నుండి సరఫరా చేస్తామని షుకూర్ హామీ ఇచ్చినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇంతటితో ఆగకుండా,  సయీదా బేగం నాయకత్వంలో ప్రత్యేకంగా ఒక మహిళా వింగ్ ను కూడా ఏర్పాటు చేసి దేశంలో తీవ్రవాదాన్ని మరింత విస్తరించాలని కుట్ర పన్నారు. ప్రశాంతంగా ఉండే నగరాల్లో స్లీపర్ సెల్స్ గా ఉంటూ ఇంతటి భారీ వినాశనానికి ప్లాన్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం నిందితులపై కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం , , ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఎన్‌ఐఏ   లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ISIS Al Qaeda India network, Al Malik Islamic Youth, Vijayawada terror links case, UAPA cases Andhra Pradesh, BENX COM telegram group, Teluguone

By
en-us Political News

  
వరద ఉధృతికి స్పిల్‌ చానల్‌ మధ్య 902 హిల్‌ నుంచి మహానందీశ్వరస్వామి టెంపుల్ వరకు ఉన్న మట్టి, రాతి రవాణా కాజ్‌వేకు గండిపడింది. ప్రాజెక్టు పనుల కోసం వాహనాలు తిరిగేలా నిర్మించిన ఈ కాజ్‌వే వరద తాకిడికి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అయితే.. ఇటీవలి కాలంలో యాత్ర ప్రారంభమైన కొద్ది రోజులకే మంచు శివలింగం పూర్తిగా కరిగిపోతుండటం భక్తులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
భారతీయ పర్యాటకుల కోసం సౌదీ అరేబియా సరికొత్త ప్యాకేజీ వీసా విధానాన్ని తెచ్చింది. ఫ్లైట్, హోటల్ రూమ్స్ మరియు వీసా ఒకే క్లిక్‌తో బుక్ చేసుకునే పూర్తి ప్రాసెస్, అర్హతల వివరాలు ఇక్కడ చూడండి.
అహ్మదాబాద్‌కు చెందిన ప్యాకేజింగ్ దిగ్గజం న్యాక్ ప్యాకేజింగ్ Knack Packaging 83 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌తో స్టాక్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. పటేల్ ఫ్యామిలీ సక్సెస్ స్టోరీ మరియు ఐపీఓ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి పేరుతో వచ్చిన నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటన నమ్మి రూ.85 లక్షలు పోగొట్టుకున్న ప్రముఖ డాక్టర్. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు వివరాలు మీకోసం.
భారత్,ఇంగ్లాండ్ 3వ టీ20 మ్యాచ్‌లో తిలక్ వర్మ స్టంపింగ్ వివాదంపై థర్డ్ అంపైర్ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఐసీసీ క్రికెట్ నిబంధనలు మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొలంబియాపై పెనాల్టీ షూటౌట్‌లో 4,3 తేడాతో స్విట్జ‌ర్లాండ్ చారిత్రక విజయం సాధించింది. రూబెన్ వ‌ర్గాస్ నిర్ణయాత్మక గోల్‌తో 1954 తర్వాత తొలిసారి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన స్విస్ జట్టు, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
భారీ వర్షాలు మరియు కొండచరియలు విరిగిపడటంతో ముంబై,పుణే రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. హైదరాబాద్, విశాఖ రైళ్లు దారి మళ్లించారు. పూర్తి వివరాలు, టికెట్ రీఫండ్ రూల్స్ మరియు లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చూడండి.
పాత ఇల్లు అమ్మి కొత్త ఇల్లు కట్టేటప్పుడు కోవిడ్ లేదా ఇతర కారణాల వల్ల ఆలస్యమైతే సెక్షన్ 54 కింద లభించే ఆదాయపు పన్ను మినహాయింపు రద్దవుతుందా చెన్నై ఐటీఏటీ పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు మరియు పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
మోబిక్విక్ (MobiKwik) యాప్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లించి 1% నుండి 5% వరకు భారీ క్యాష్‌బ్యాక్ ఎలా పొందాలో తెలుసుకోండి. జీమెయిల్ బిల్ఫెచ్ ఫీచర్, నియమ నిబంధనలు మరియు గరిష్ట పొదుపు చిట్కాలు ఇక్కడ చూడండి.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని సూచించారు.
అయితే బ్యాటరీ ఛార్జ్ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందనడానికి ఈ ఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఎలక్ట్రిక్ మెర్సిడెస్-బెంజ్ కారు బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ కావడంతో నడి రోడ్డులో నిలిచిపోయి.. తీవ్రమైన ట్రాఫిక్ సమస్యకు కారణమైంది.
రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్సార్టియం నుంచి తీసుకున్న రుణ నిధులను రుణ ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా మధ్యవర్తి సంస్థలు, అనుబంధ కంపెనీల ద్వారా రిలయన్స్ ఏడీఏ గ్రూప్‌లోని ఇతర సంస్థలకు మళ్లించి నట్లు దర్యాప్తులో భాగంగా సీబీఐ గుర్తించింది. ఈ చర్యల వల్ల బ్యాంకులకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లగా.. సంబంధిత సంస్థలు, నిందితులకు అక్రమ లాభం చేకూరినట్లు సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.