స్పీడ్ న్యూస్- 4

Publish Date:Jun 29, 2023

Advertisement

31.బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు నేడు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారు.బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలతో ప్రజలకు అసౌకర్యం కలగకూడదని లక్నో ఈద్గా ఇమామ్ స్కాలర్, మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలి   ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. 

32.ఉమ్మడి పౌరస్మృతి ఈ దేశానికి అవసరం అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలుపై కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. మోదీ చెపుతున్న ఉమ్మడి ఎంతవరకు ఉమ్మడిగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

33.కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభ ఖమ్మంలో జులై 2న జరగనుందని, ఇదే సభలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ పార్టీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. మార్చి 16న అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుండి భట్టి పాదయాత్ర ప్రారంభమైంది.

34.టీమిండియా కోచ్‌లపై భారత మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. కోచ్‌ల పేరు ప్రతిష్ఠలకు క్రికెటర్లే కారణం అన్నాడు.

35.బక్రీద్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గొర్రెలకు డిమాండ్ పెరిగింది. తాజాగా రాజస్థాన్‌లో చూరూ జిల్లాలో ఓ పొట్టేలు ఏకంగా రూ.కోటి ధర పలికింది.

36.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీని  కర్టాటకలో     కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది.  ఉచిత బియ్యానికి బదులు నగదును అందిస్తామని సిద్ద రామయ్య ప్రభుత్వం  తెలిపింది.

37.బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు.

38.కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నేడు రైతులకు సంబంధించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ప్రణామ్, యూరియో గోల్డ్ స్కీమ్ ల కొనసాగింపునకు పచ్చజెండా ఊపింది.

39.కాంతి కిరణాల సాయంతో ఇంటర్నెట్ డేటాను ప్రసారం చేసే సరికొత్త లేజర్ టెక్నాలజీ కాలిఫోర్నియాలోని ఇన్నోవేషన్ ల్యాబ్ లో ఆవిష్కరించారు. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ లేజర్ ఆధారిత ఇంటర్నెట్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. 

40.అమెరికాలో ఓ వ్యక్తికి అద్భుతమైన ఆఫర్ లభించింది. విమానంలో ఫస్ట్ క్లాస్ లో, అది కూడా ఉచితంగా ప్రయాణించే అవకాశం దక్కింది. 

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.