గజమాలలు.. లోకేష్ పాదయాత్రలో కొత్త ఒరవడి!

Publish Date:Sep 5, 2023

Advertisement

అడుగడుగునా అభిమానుల పలకరింపులు.. వారితో కుశల ప్రశ్నలు, యువతీయువకులతో భవిష్యత్తుపై చర్చ, అవ్వతాతలతో క్షేమం.. సంక్షేమంపై ప్రశ్నలు, అంకుల్ ఆంటీలతో మాట మంతి, యువతీయువకులతో సెల్పీలు, చిన్నారులకు చాకెట్లు, సభలు, సమావేశాలు వీటికి పోటెత్తుతోన్న జనం..ప్రభంజనం.. గజమాలలతో స్వాగతం.., పూల వర్షంతో సుస్వాగతం.. అక్కడక్కడా శాలువాలతో సత్కారం, మహిళా లోకం ఇస్తున్న హరతులు టోటల్‌గా నారా లోకేశ్‌ పాదయాత్ర  ప్రారంభమైన  ఉమ్మడి చిత్తూరు జిల్లా మొదలుకొని.. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల మీదుగా ప్రస్తుత పాదయాత్ర జరుగుతోన్న పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం అడుగడుగునా కనిపిస్తున్న దృశ్యాలు.  

అయితే ఈ పాదయాత్రలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకొంటున్నది. నారా లోకేశ్ పాదయాత్రలో వివిధ ప్రాంతాల్లో ఆయనకు గజమాలలతో పార్టీ శ్రేణులు, ప్రజలు  స్వాగతం పలుకున్నారు.  అది కూడా చాలా వెరైటీల గజమాలలు రూపొందించి.. వాటితో లోకేశ్‌కు స్వాగతం పలుకుతుండడం.. పార్టీ శ్రేణులనే కాదు.. ప్రజలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. 

సాధారణంగా.. బంతిపూల గజమాలలో.. లేదా గులాబీల గజమాలలు ఉంటాయి. కానీ కూరగాయాలు, టమాటాలు, ఎండు మిర్చి, కూరగాయాల్లో కూడా ఆల్ వెరైటీలు, చేపలు, అరటి కాయలు, కొబ్బరి బొండాలు, అరిసెలు, పంపరపనస కాయలు.. అలాగే నారా లోకేశ్ యువగళం పేరుతో చిన్న సైజ్ కార్డులతో రూపొందించిన గజమాలలతో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలకో.. పార్టీ శ్రేణులకో వస్తున్న ఆలోచనలకు ఓ కార్యరూపం ఇస్తూ.. వివిధ రకాల వస్తువులు, పదార్ధాలతో గజమాలలు తయారు చేసి వాటితో లోకేష్ కు స్వాగతం పలుకుతున్నారు. దీంతో వివిధ రకాల గజమాలలు లోకేశ్ పాదయాత్రలో అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు.. ఇటువంటి... ఇలాంటి.. ఈ తరహా వెరైటీ గజమాలలు.. గతంలో రాష్ట్రంలో పాదయాత్ర చేసిన ఏ రాజకీయ నాయకుడికి వేయలేదని.. ఆ  గౌరవం  తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మాత్రమే దక్కింది.

జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రిగా  ఆయన తీసుకొన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనడమే కాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధోగతి పాలైంది. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు తెలుసుకొనేందుకు, తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రజా సమస్యలు తీరుస్తామంటూ ప్రజలకు నారా లోకేశ్ స్పష్టమైన భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో ఆయన చేపట్టిన పాదయాత్ర 2 వందల రోజులు దాటగా... దాదాపు 3 వేల కిలోమీటర్ల చేరువలో ఉంది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఈ పాదయాత్ర ప్రారంభమైన సంగతి తెలిసిందే. లక్ష్యసాధన దిశగా.. నారా లోకేశ్ అడుగులు వడి వడిగా దూసుకు వెళ్తున్నాయి.

By
en-us Political News

  
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.