ఫేక్ న్యూస్ పై కొత్త చ‌ట్టం కాదు.. కొత్త సిస్టం తేవాలి!?

Publish Date:Sep 5, 2025

Advertisement

ఫేక్ న్యూస్ మీద చంద్ర‌బాబు పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వంపై వైసీపీ సోష‌ల్ మీడియా పెద్ద ఎత్తున దుష్ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఇది క‌రెక్టు కాదు త‌ప్పు.. ఫేక్ కాదు రియ‌ల్ అంటూ మ‌నం వాళ్ల‌కు ఫోటోలు పెట్టుకుంటూ కూర్చోవాలా? లేక ప‌ని చేయాలా? అని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారాయ‌న‌. ఇక ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే సుగాలీ ప్రీతికి మ‌ద్ద‌తుగా నిలిచినందుకు త‌న‌ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ కేసు సీబీఐకి అప్ప‌గించిన‌ట్టు గుర్తు చేశారు చంద్ర‌బాబు. ఈ విష‌యంపై అధికారులు సైతం స్పందించాల్సి ఉంద‌ని.. వీరి నుంచి స‌రైన స్పంద‌న లేక పోవ‌డం వ‌ల్ల కూడా జ‌నం పెద్ద ఎత్తున క‌న్ ఫ్యూజ్ అవుతున్నారని చెప్పారు.

ఇటీవ‌లి కేబినేట్ భేటీ అనంత‌రం మంత్రుల‌తో మాట్లాడిన బాబు.. ఈ విష‌యంపై విస్తృతంగా చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఫేక్ న్యూస్ ని అరి క‌ట్ట‌డానికి ఒక కొత్త చ‌ట్టం తేవాల‌ని భావిస్తున్న‌ట్టు చెప్పారు. అంతే కాదు ఈ విష‌యంపై ఒక మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం సైతం ఏర్పాటు చేశారు  చంద్ర‌బాబు. ఈ స‌బ్ క‌మిటీలో మంత్రులు అనిత‌, నాదెండ్ల‌, అన‌గాని, పార్ధ‌సార‌ధి ఉన్నారు. వీరి ఆలోచ‌న ఏంటంటే ఇక‌పై సోష‌ల్ మీడియాకు ఆధార్ లింక‌య్యేలా ఒక అకౌంట‌బిలిటీ ఏర్పాటు చేయ‌నున్నారు. ఎవ‌రైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తారో వార్ని వెంట‌నే ప‌ట్టుకుని క‌ట్ట‌డి చేసేలా ఈ కొత్త‌ చ‌ట్టం రానుంది. ఈ దిశ‌గా కొన్ని నిబంధ‌న‌లతో కూడిన కార్యాచ‌ర‌ణ రూపొందించ‌నుంది మంత్రివ‌ర్గ ఉప‌సంఘం.

అయితే ఇలాంటి చ‌ట్టాలు చాలానే వ‌స్తుంటాయ్. పోతుంటాయ్.  ఇందుకంటూ నాన్ స్టాప్ గా ప‌ని చేసే సిస్ట‌మ్ ఒక‌టి ఇంప్రూవ్ చేయాల్సి ఉంద‌ని అంటున్నారు ఐటీ రంగ నిపుణులు. ఉదాహ‌ర‌ణ‌కు ఒక యాప్ త‌యారు చేసి అందులో ఒక వార్త నిజ‌మా కాదాని టెస్ట్ చేసుకోవ‌డం. ఆపై ఒక యూట్యూబ్ చానెల్ నిర్వ‌హించి.. త‌ద్వారా ఈ ఫేక్ న్యూస్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌ప్పు అంటూ ప్రెజంటేష‌న్లు ఇవ్వ‌డం వంటివి చేయాల్సి ఉంద‌ని అంటున్నారు వీరంతా. ఇప్పుడు చూడండి ఇదే చంద్ర‌బాబు పై జ‌గ‌న్ ఒక ఉల్లి బాంబు విసిరేశారు. ఉల్లి రైతుల‌కు ఇక్క‌డ గిట్టుబాటు ధ‌ర లేక అల్లాడుతుంటే ఆయ‌న హెరిటేజ్  లో మాత్రం కిలో 35 రూపాయ‌ల‌కు అమ్ముతున్న‌ట్టు ఆరోపించారు. దీనిపై చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. అస‌లు హెరిటేజ్ కి రీటైల్ అవుట్ లెట్స్ లేవంటుంటే.. మ‌ధ్య‌లో ఈ కిలో బేరాలు ఎక్క‌డివ‌ని ఆవేద‌న వ్య‌క్తం  చేశారు చంద్ర‌బాబు.

ఇక కుప్పంకి కృష్ణ‌మ్మ నీళ్ల వ్య‌వ‌హారం. ఈ విష‌యంలోనూ వైసీపీ సోష‌ల్ మీడియా శ్రేణులు.. పెద్ద ఎత్తున దుమారం చెల‌రేగేలా చేస్తున్నాయి. ఆ నీళ్లు కృష్ణ  నీళ్లు కావ‌ని.. ట్యాంక‌ర్ల‌లో తోలిన‌వ‌ని సోష‌ల్ మీడియాలో ఈ వార్త తెగ ట్రోల‌వుతోంది. ఇలాంటి విష‌యాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం ఒక నిర్ణ‌యానికి రావ‌ల్సి ఉంది. ఎవ‌రైనా ఔట్ సోర్సింగ్ కి కానీ, లేదంటే స్వ‌యంగా ఐ అండ్ పీఆర్ ద్వారా గానీ ఒక యాక్టివ్ సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ని రెడీ చేసి దాని ద్వారా ఈ ఫేక్ న్యూస్ పై ఫైట్ చేయాల్సి ఉంది.

ఇప్ప‌టికే ఏపీడీసీ, ఆపై ఇత‌ర సోష‌ల్ మీడియా వింగుల కోసం పెద్ద ఎత్తున సిబ్బంది నియామ‌కాలు జ‌రిగాయి. కానీ ఫేక్ న్యూస్ మీద ఈ స్థాయిలో ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటైతే లేదు. కేవ‌లం చ‌ట్టం త‌యారు చేయ‌డం వ‌ల్ల ఎలాంటి యూజ్ లేదు. ఖ‌చ్చితంగా ఇందుకంటూ ఒక సిస్ట‌మ్ ఉండి తీరాల్సిన అవ‌శ్య‌క‌త అయితే క‌నిపిస్తోంద‌ని అంచ‌నా వేస్తున్నారు సోష‌ల్ మీడియా వ్య‌వ‌హారాల నిపుణులు. ప్ర‌స్తుతం కేబినేట్ భేటీ ముగిశాక‌.. అంద‌రూ క‌ల‌సి నిర్ణ‌యించింది ఏంటంటే, టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ ఎవ‌రిపై విమ‌ర్శ‌లు వ‌చ్చినా మూకుమ్మ‌డిగా ఒక్క‌టై.. ఈ దాడుల‌ను తిప్పి కొట్టాలని.  ఉదాహ‌ర‌ణ‌కు రాహుల్, మోడీ త‌ల్లిపై చేసిన కామెంట్ల లాంటి వాటిని అస్స‌లు ఉపేక్షించ‌రాద‌ని వీరంతా నిర్ణయించారు.

కానీ ఇక్క‌డ ఏం జ‌రుగుతోందంటే.. నిజం ఒక అడుగు వేసే లోప‌ల, అబ‌ద్ధం వంద‌డుగులు వేసేస్తోంది. ఈ విష‌యంపైనా మంత్రి వ‌ర్గం మొత్తం సీరియ‌స్ గా చ‌ర్చించింది. మ‌నం రియాక్ట్ అయ్యే లోప‌ల అబ‌ద్ధాన్ని నిజమ‌న్నంత గ‌ట్టిగా దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని అంద‌రూ క‌ల‌సి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌న ప‌నిలో మ‌నం ఉంటే- వారి ప‌నిలో వారుంటున్నార‌నీ వీరంతా అభిప్రాయ ప‌డ్డారు. కానీ, ఇక్క‌డ ఇందుకంటూ ఒక వ్య‌వ‌స్త లేక పోవ‌డ‌మే అస‌లు స‌మ‌స్య‌గా క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా దుష్ర‌చారాన్ని ఢీ కొట్ట‌డానికి యాంటీ  వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ ని ఏర్పాటు చేసి ఎప్ప‌టిక‌ప్పుడు కూట‌మి శ్రేణులు రివ‌ర్స్ అటాక్ చేయ‌డానికంటూ ఒక వ్య‌వ‌స్థ లేక పోతే.. వ‌చ్చే రోజుల్లో చాలా చాలా క‌ష్ట‌మ‌న్న‌ది నిపుణుల మాట‌. మ‌రి చూడాలి.. కూట‌మి ఈ దిశ‌గా ఏదైనా కొత్త చ‌ట్టంతో పాటు, మ‌రేదైనా కొత్త సిస్ట‌మ్ త‌యారు చేయాల‌న్న‌ ఆలోచ‌న చేస్తుందా లేదా? 

By
en-us Political News

  
డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వైసీపీ విమర్శలను  కూడా శ్రావణ్ తప్పుబట్టారు. ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయో ప్రభుత్వం ఇప్పటికే పూర్తి వివరణతో క్లారిటీ ఇచ్చిందనీ,  పరీక్ష రాసిన లక్షలాది మందిలో ఎంపిక కాని వారి అసంతృప్తిని ఆసరాగా చేసుకుని, ఎలాంటి రుజువులు లేకుండా పత్రికా సమావేశాలు పెట్టి మాట్లాడటం వల్ల అభాసుపాలయ్యేది వైసీపీయేనని చెప్పారు. 
ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని, వారికి తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని లోకేష్ వివరించారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవకు లబ్ధిదారులుగా ఉన్న అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తూ, పెనమలూరు పర్యటనలో తనకు ధన్యవాదాలు తెలిపేందుకే పెద్ద ఎత్తున తరలివచ్చారని వివరంచారు.
సీసీటీవీ ఫుటేజీల ఆధారంతో వాస్తవాలను తేల్చుకున్న పోలీసులు ప్రమాదానికి కరాణమైన సిదిరి అప్పలరాజు కుమారుడిని అరెస్టు చేయడంతో పాటు.. కేసును తప్పుతోవ పట్టించేందుకు ప్రయత్నించారనీ, అలాగే ఆధారాలు తారుమారు చేసే యత్నాలు చేశారనీ పేర్కొంటూ సిదిరి అప్పల రాజును కేసులో ఏ3గా చేర్చి ఆయనను కూడా అరెస్టు చేశారు.
మనీశ్ సిసోడియా సవాల్ ను స్వీకరించిన కాంగ్రెస్, బిజెపి, శిరోమణి అకాలీదళ్ పార్టీలు పంజాబ్‌లో ఆప్ పాలనలో గత నాలుగున్నరేళ్లలో కనీసం 6 ప్రధాన పోటీ పరీక్షల్లో అక్రమాలు, లీకేజీలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య వాగ్బాణాలు పతాక స్థాయికి చేరాయి.
తాజాగా బోండా ఉమ.. గుంటూరులో జరిగిన కాపు ఉద్యమ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు హాజరై వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో వేదిక పంచుకోవడం, ఆ వేదికపై నుంచి బోండా ఉమ చేసిన వ్యాఖ్యలు.. ఆ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి
కాక్రోచ్ ఉద్యమం ప్రారంభం అయిన నాటి నుంచీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకుంటూ వచ్చిన మోడీ చివరకు దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడటమే ఇందుకు కారణం. అందులోనూ ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా విద్యార్థి నాయకుడు. విద్యార్థి నాయకుడి నుంచి రాజకీయ వేత్తగా అక్కడ నుంచి విద్యాశాఖ మంత్రిగా ఎదిగారు.
వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా క్రీడా పరికరాల కొనుగోల విషయంలో భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి.
అంబటితో వేదిక పంచుకోవడంపై కలకలం..! కాపు ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు.   ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆమె స్పీడీ రికవరీ ఆకాంక్షిస్తూ పోస్టు షేర్ చేశారు. రాజకీయంగా, సిద్ధాంతపరంగా విభేదాలు పక్కన పెట్టి ప్రజాస్వామ్య విలువలను  పాటించారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంచలన నిర్ణయం తీసుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్ కోసం సాగిస్తున్న ప్రయత్నాలు
అయితే 2014 ఎన్నికలలో పార్టీ ఘోర పరాజయానికి ఫైర్ బ్రాండ్ నేతల నోటి దురుసు కూడా ఒక ప్రధాన కారణం అయ్యిందని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. అయితే పరాజయం తరువాత కూడా వైసీపీ తీర మారలేదు. అప్పట్లో నోరున్నది దూషించడానికే అన్నట్లుగా వ్యవహరించిన కొడాలి నాని వంటి వారు ఓటమి తరువాత సైలెంట్ అయిపోయినా.. వారి స్థానంలోకి అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి వారు వచ్చి చేరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.