బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి? కిషన్ రెడ్డికి ఉద్వాసన ఎప్పుడు?

Publish Date:Aug 10, 2024

Advertisement

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? కిషన్ రెడ్డి స్థానంలో మరో వ్యక్తి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రానున్నారని గత కొంత కాలంగా ఆ పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పార్టీ అధిష్ఠానం రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించే ఉద్దేశంలో ఉందని చెప్పకనే చెప్పారు. కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి ముందు వరకూ ఆ పదవిలో బండి సంజయ్ ఉన్నారు.

గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ హైకమాండ్ బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్రపగ్గాలు అప్పగించడంపై అప్పట్లోనే పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్షణం నుంచే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు కిషన్ రెడ్డి చేజారడం ఖయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. 
తెలంగాణలో బీజేపీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించిన బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీలో అందరినీ కలుపుకుని పోయే వ్యక్తికే పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలన్న భావనతో ఉంది.

సాధారణంగా బీజేపీలో గ్రూపు తగాదాలు ఉండవు అని అంటుంటారు. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవలన్న లక్ష్యంతో బీజేపీ గత నాలుగైదేళ్లుగా పార్టీ గేట్లు బార్లా తెరిచేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. గతంలోలా పార్టీ సిద్ధాంతాలు, నిబద్ధత, విలువలు వంటి అంశాల కంటే నాలుగు ఓట్లు, రెండు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని భావిస్తే చాలు ఎవరికైనా బీజీపీ తీర్థం ఇచ్చేసి పార్టీ కండువా కప్సేయడానికి బీజేపీ హైకమాండ్ వెనుకాడలేదు. అందుకే వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్  వంటి వారిని పార్టీలో చేర్చుకుని కీలక పదవులు ఇచ్చింది. ఈటలకు చేరికల  కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టి పార్టీలోకి చేరికలను ప్రోత్సహించేందుకు కూడా వెనుకాడ లేదు.

అయితే కమలనాథుల పాచికలు, వ్యూహాలు ఈ విషయంలో పెద్దగా ఫలించలేదు. రాష్ట్ర బీజేపీలో కొత్తగా వచ్చిన వారి పట్ల తొలి నుంచీ పార్టీలో ఉన్న వారిలో తీవ్ర అంసతృప్తి మొదలైంది. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా పార్టీ హైకమాండ్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే  ఈసారైనా అందరినీ కలుపుకుని పోయి, పార్టీలో గ్రూపు తగాదాలను రూపుమాపి పార్టీని ఏకతాటిపైనడిపించే వ్యక్తి కోసం బీజేపీ హైకమాండ్ గాలిస్తోంది. 

ఎందుకంటే.. బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర పగ్టాలు చేపట్టిన సందర్భంగా అప్పట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు బాహాటంగా కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడాన్ని నిరసించారు. దాంతో అప్పట్లో కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన సభ బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది.  ఆ సభలో మాట్లాడిన పలువురు బీజేపీ నేతలు బండి సంజయ్ ను పొగడ్తలలో ముంచేశారు. ప్రశసంల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. 

బండి సంజయ్ స్థానంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే  కిషన్ రెడ్డికి పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. ఆ సెగ కారణంగానే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ డబుల్ డిజిట్ కు చేరుకోవడంలో విఫలమైందని పార్టీ వర్గాల్లో అప్పట్లోనే గట్టిగా వినిపించింది. ఆ తరువాత లోక్ సభ ఎన్నికలలో బీజేపీ మెరుగ్గానే పెర్ఫార్మ్ చేసినా ఆ క్రెడిట్ కిషన్ రెడ్డి ఖాతాలో పడలేదు. లోక్ సభ ఎన్నికలలో ఈటల రాజేందర్ మల్లాజ్ గిరి స్ధానం నుంచి భారీ మెజారిటీతో గెలవడంతో ఒక దశలో ఆయనకే పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందన్నభావన బీజేపీ శ్రేణులలోనే వ్యక్తమైంది. రాష్ట్ర పార్టీలో విభేదాలను రూపు మాపి.. పాత, కొత్త నేతలందరినీ ఏకతాటిపై నడిపించగలిగిన నాయకుడి కోసం బీజేపీ  అధిష్ఠానం గాలిస్తోంది.  అయితే ఆ ఎంపిక కసరత్తు మాత్రం దీర్ఘ కాలంగా సాగుతోంది. తాజాగా బండి సంజయ్, కిషన్ రెడ్డిల మాటలతో త్వరలోనే కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఖాయమని తేలిపోయింది. దీంతో బీజేపీ అధిష్ఠానం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేదెవరిన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈటల రజేందర్, డీకే అరుణ రేసులో ముందున్నారని అంటున్నారు.  

By
en-us Political News

  
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.