శివాలయంలో పూజ చేస్తున్న బాలికపై అసభ్య ప్రవర్తన.!

Publish Date:Oct 14, 2026

Advertisement

మహారాష్ట్రలోని పూణే నగరంలో తీవ్ర కలకలం రేపిన ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలోనే దైవదర్శనానికి వచ్చిన ఒక పదేళ్ల చిన్నారిపై కామాంధుడు అఘాయిత్యానికి యత్నించిన వైనం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. పూణే పరిధిలోని పింప్రి-చించ్‌వాడ్ ప్రాంతంలోని నిగడి యమునా నగర్ సమీపంలో ఉన్న ఒక శివాలయంలో ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉదయం సుమారు 11:07 గంటల సమయంలో ఆ చిన్నారి ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఆలయానికి వచ్చి తన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. ఆలయంలో ఆమె ఒక్కటే ఉండటాన్ని గమనించిన నిందితుడు ఒక్కసారిగా కాటేయడానికి కుట్ర పన్నాడు. మెట్రో నిర్మాణ పనుల్లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న విశాల్ సింగ్ అనే నిందితుడు ఆ సమయంలో ఆరెంజ్ కలర్ వర్క్ జాకెట్ ధరించి ఆలయంలోకి ప్రవేశించాడు. 

చిన్నారి ప్రార్థనలు ముగించుకుని బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఆమె ఒంటరిగా ఉన్న విషయాన్ని ఆసరాగా చేసుకుని సమీపంలోకి దూసుకొచ్చాడు. అకస్మాత్తుగా ఆ పాప చెయ్యి పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడేందుకు తెగబడ్డాడు. ఈ ఊహించని పరిణామానికి మొదట తీవ్ర భయాందోళనకు గురైన ఆ చిన్నారి తేరుకుని ధైర్యంగా ప్రతిఘటించింది. కొన్ని సెకన్ల పాటు నిందితుడితో పోరాడిన ఆ పాప, ఎంతో కష్టపడి అతన్ని గట్టిగా తోసివేసి అక్కడి నుంచి తప్పించుకుంది. భయంతో వణికిపోయిన ఆ చిన్నారి కన్నీటిపర్యంతమైంది. ఈ లోపు స్థానికంగా అలికిడి కావడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ మొత్తం దుర్మార్గపు చర్య ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. కొద్దిసేపటి తర్వాత ఈ సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ప్రజల నుంచి  స్థానిక నివాసితుల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. 

భక్తులు దేవుని దర్శనానికి వచ్చే పవిత్ర స్థలాల్లోనే చిన్నారులకు రక్షణ లేకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న నిగడి పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితుడిని గుర్తించి సోమవారం ఉదయం నాటికి అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ దృశ్యాలే ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారంగా మారాయి. నిందితుడు విశాల్ సింగ్‌పై  భారతీయ న్యాయ సంహిత (BNS) సంబంధిత సెక్షన్లతో పాటు, చిన్నారులపై లైంగిక వేధింపులను అరికట్టే కఠినమైన పోక్సో (POCSO) చట్టంలోని సెక్షన్ 8  సెక్షన్ 12 కింద కేసులు నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ మహేష్ బన్సోడే వెల్లడించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి చట్టపరంగా కఠినమైన శిక్ష పడాలని ప్రజలు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

 

 

 [ Pune temple assault, Minor girl harassment cctv, Nigdi police station, Posco act arrest, Vishal singh arrested, Maharashtra crime news,  Telugu One,Telugu News ]
 

By
en-us Political News

  
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
దసరా, దీపావళి పండగ సీజన్‌ సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం దేశంలోని లక్షలాది మంది రైల్వే సిబ్బందికి అదిరిపోయే శుభవార్త అందించింది.
చంద్రబాబుతో భేటీలో  ప్రధానంగా చెన్నై నగర తాగునీటి అవసరాలు,  తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా అదనపు నీటి కేటాయింపులపై చర్చ జరిగింది.  
హైదరాబాద్ నగరంలో రోడ్డు భద్రతను విస్మరిస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ఆటో డ్రైవర్ ఉదంతం ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసులలో విచారణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సీబీఐ ప్రత్యేక కోర్టు నిర్ణయించింది.  సీబీఐ నమోదు చేసిన కేసులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పరిధిలోని కేసులన్నింటినీ కూడా  రోజు వారీగా విచారణ చేపట్టాలని కోర్టు నిర్ణయించింది. 
 వివేకా హత్య కేసులో  మనీలాండరింగ్ అంశంపై జరుగుతున్న విచారణలో భాగంగా  కడప ఎంపీ, వైసీపీ సీనియర్ నేత  వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.  
గతంలో ప్రజారాజ్యం పార్టీలో పవన్ కల్యాణ్‌తో కలిసి రాధ పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆయన జనసేన చేరికపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  
తనపై నమోదైన   పరువునష్ట కేసును కొట్టివేయాలని కోరుతూ రాహుల్‌ గాంధీ గతంలో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఆయన చే పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కేసును కొట్టివేయలేమని స్పష్టం చేస్తూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
సరే పలు కేసులలో అరెస్టై కొన్ని నెలల పాటు జైలులో గడిపి బయటకు వచ్చారు. ఆ తరువాత అయితే పూర్తిగా అజ్ణాత వాసంలో ఉన్నారా అన్నట్లుగా వంశీ పూర్తిగా మౌనం వహించారు. ఇంత సుదీర్ఘ విరామం తరువాత ఏమైందో ఏమో కానీ.. ఒక్కసారిగా తాను రాజకీయంగా యాక్టివ్ అవుతున్నట్లు ప్రకటించారు.
కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఇప్పటికీ లాంగ్ కొవిడ్ తీవ్ర దుష్ప్రభావాలతో సతమతమవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.