బుక్ చేసిన 24 గంటల్లో ఆర్టీసు బస్సుల్లో రాఖీలు డెలివరీ
Publish Date:Aug 10, 2024
Advertisement
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఆఫర్ ఇచ్చింది. తాజాగా మహిళలను మరో మారు ఆకట్టుకుంది.
ఈ నెల 19వ తేదీన రాఖీ పండుగ నేపథ్యంలో మహిళలకు టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. దూర ప్రాంతాల్లో ఉన్న తమ సోదరులకు సోదరీమణులు రాఖీలు పంపేందుకు వీలుగా పండుగకు నాలుగైదు రోజుల ముందుగానే కార్గో కేంద్రాలలో ప్రత్యేక కౌంటర్లు తెరవాలని నిర్ణయించింది. ఇందుకోసం అన్ని బస్టాండ్లలోని కార్గో సెంటర్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
రాఖీలతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు కూడా పంపే అవకాశం కల్పించింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఏపీ, కర్ణాటక తదితర రాష్ట్రాలకు రాఖీలను పంపించుకోవచ్చని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కార్గో సెంటర్లలో బుక్ చేసిన 24 గంటల్లోనే రాఖీలను డెలివరీ చేసే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అయితే, రాఖీల రవాణా ధర ఇంకా ఖరారు కాలేదు. ధరల విషయంలో సోమవారం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/delivery-of-rakhis-in-artisu-buses-within-24-hours-of-booking-25-182696.html





