తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌చార్జ్.. రేసులో సీనియర్ నేత డాక్టర్ ఎ. చెల్లకుమార్..!

Publish Date:Sep 16, 2026

Advertisement

తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత వ్యవస్థను మరింత పటిష్టం చేయడంపై దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. పలు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లను నియమించే ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో ఐదారు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే అంశంపైనా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఈ మార్పుల్లో భాగంగానే తెలంగాణకు కూడా కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు వెళ్లనున్నారు. సుమారు పది నెలల పాటు ఆమె లండన్‌లో ఉండనున్న నేపథ్యంలో తెలంగాణ వంటి క్రియాశీలక రాష్ట్ర బాధ్యతలను మరో సీనియర్ నేతకు అప్పగించాలని అధిష్ఠానం భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు పార్టీ వ్యవహారాలపై ఉన్న అనుభవం, వివిధ రాష్ట్రాల్లో పనిచేసిన నేపథ్యం తెలంగాణ బాధ్యతలకు ఉపయోగపడుతుందని అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.డాక్టర్ ఎ. చెల్లకుమార్ తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కాంగ్రెస్ నేత. 1991లో అన్నా నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1996లో టి.నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్ వర్గం) తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2011లో టి.నగర్ నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురైంది. అనంతరం జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన చెల్లకుమార్.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు.

పార్టీలోనూ ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేసిన చెల్లకుమార్.. గోవా రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర స్థాయి రాజకీయాలతో పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయనకు ఉన్న అనుభవం ఇప్పుడు తెలంగాణకు ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో పార్టీ వ్యవహారాలను సమర్థవంతంగా పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేడర్‌తో సన్నిహితంగా పనిచేసే స్వభావం, పార్టీ వ్యవహారాలపై అనుభవం ఉన్న సీనియర్ నేతను తెలంగాణ ఇన్‌చార్జ్‌గా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే డాక్టర్ ఎ. చెల్లకుమార్ పేరు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అప్పటివరకు చెల్లకుమార్ పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానే కొనసాగనుంది.

 

 

 

[ New in-charge for Telangana Congress, Dr. A. Chellakumar, Telangana Congress Party,  CM Revanth reddy, Meenakshi Natarajan, Telangana Congress Incharge, AICC, Congress Party, Telangana Politics, PCC Chief Mahesh Kumar Goud ]
 

By
en-us Political News

  
ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, కొండా సురేఖ అడుగులు బీజేపీ వైపు పడుతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఆమెకు బీజేపీనుంచి ఆహ్వానం అందిందని కూడా చెబుతున్నారు. కొండా సురేఖ బీజేపీ గూటికి వస్తే తమకు  అభ్యంతరం లేదని ఆ పార్టీ రాష్ట్ర నాయకుల నుంచి ఆమెకు స్పష్టమైన సంకేతాలు అందాయని చెబుతున్నారు.  
జగన్  ఢిల్లీ పర్యటన కేంద్రం పెద్దల ఆశీస్సులతో.. కేసుల నుంచి రక్షణ పొందేందుకేనన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే జగన్ హస్తిన పర్యటన వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి వారాలు గడిచిపోయినా ఆయన బెంగళూరు, తాడేపల్లి ప్యాలెస్ మధ్య తిరగడం తప్ప హస్తిన  ఫ్లైట్ ఎక్కలేదు.
కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలన్న డిమాండ్  ఎవరి స్వార్థం కోసం చేసిన రచ్చ కాదు, పార్టీ క్రమశిక్షణను కాపాడేందుకు తీసుకున్న చర్య అని  వివరించారు. కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రభుత్వంని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన వీరేషం..  క్రమశిక్షణ రాహిత్యంగా ఎవరు మాట్లాడినా సరే సహించేది లేదు అని వీరేషం స్పష్టం చేశారు.
ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తే రాదనీ, జనం అందుకు అవసరమైనంత మంది సభ్యులను గెలిపించి సభకు పంపాల్పి ఉంటుందనీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.  
ఇటీవలి కాలంలో హిమాన్షు రావు  తన  ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరించి, హిందుత్వ వ్యవహారంలో బీజేపీని మించి మరీ గుర్తింపు పొందిన రాజాసింగ్ ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందుత్వ అజెండాను ఎత్తుకున్న పవన్ దృష్టి రాజాసింగ్ పై పడిందని అంటున్నారు.
వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా జరుగుతాయనీ, మావిగన్ కు మద్దతు ఇచ్చే వారు వైసీపీకి, అమరావతి కావాలనుకునే వారు తెలుగుదేశం కూటమికి ఓటు వేస్తారనీ, ఎవరు గెలుస్తారో చూద్దామనీ సవాళ్లు విసురుతుంటే.. ఆర్కే రోజా మాత్రం మావిగన్, అమరావతీ ఒక్కటేననీ, ఏమీ తేడాలేదనీ చెబుతూ జగన్ గాలి తీసేశారు.
ఇందుకు ఆయన మాటలు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల ఒక వేడుకలో పాల్గొన్న చామకూర మల్లారెడ్డి.. తాను బీఆర్‌ఎస్ పార్టీకి క్రమంగా దూరమవున్నానని బాహాటంగానే అఅంగీకరించారు. తాను పార్టీకి కాస్త దూరం కాగానే, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, సొంత మద్దతుదారులు తనను నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారన్న ఆవేదనను ఆ సందర్భంగా వ్యక్త పరిచారు.
రాష్ట్ర రాజకీయాలలో హోంమంత్రిగా పవన్ కల్యాణ్ అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రానున్న రోజులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నారన్న సమాచారం నేపథ్యంలో హోంమంత్రి మార్పు తథ్యమన్న చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది.
తాజాగా వికారాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిర్వహించిన ఒక భారీ ర్యాలీలో బీఆర్ఎస్ గులాబీ జెండాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనమిచ్చాయి. కేటీఆర్ పర్యటన వేదిక వద్ద కేటీఆర్, వైఎస్ జగన్ ఇద్దరి చిత్రాలు పక్కపక్కనే ఉన్న కటౌట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
అనుదీప్ కటికల, రఫీక్ వంటి వ్యక్తులు కామెడీ ముసుగులో చేస్తున్న వ్యాఖ్యలు కేవలం హాస్యం కోసం మాత్రమే కాకుండా, ఒక పథకం ప్రకారం జరుగుతున్న రాజకీయ కుట్రగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు, అనుదీప్, రఫీక్ వంటి వారు స్టాండప్ కామెడీ ముసుగులో చేస్తున్న వికృత వ్యాఖ్యల వెనుక ప్రత్యర్థి రాజకీయ పార్టీల ప్రోత్సాహం ఉందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.