LATEST NEWS
జగన్ కాన్వాయ్‌ వద్ద దస్తగిరి హల్‌చల్‌.! ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ వేళ.. కడప జిల్లా పులివెందులలో రాజకీయ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికే వాహన దహనం, కర్రలు, రాళ్ల ఘటనలతో వార్తల్లో నిలిచిన పులివెందులలో.. తాజాగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరి.. జగన్ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ పరిణామంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. కాన్వాయ్‌ వద్దకు దస్తగిరి రావడం, అక్కడ చోటుచేసుకున్న పరిణామాలపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా రాజకీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కాన్వాయ్‌ను అడ్డుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల అధికారిక వివరణ తెలియాల్సి ఉంది. పోలింగ్ కేంద్రం వద్ద మహిళలు, పోలీసుల మధ్య వాగ్వాదం.! మరోవైపు పులివెందుల ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగం విషయంలో వివాదం తలెత్తింది. కొందరు మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఉండేందుకు కట్టెలతో వచ్చిన మహిళలను అడ్డుకున్నామని డీఎస్పీ మురళీ నాయక్ వెల్లడించినట్లు సమాచారం. అయితే, తాము ఎలాంటి కట్టెలతో రాలేదని మహిళలు వాదించారు. ఓటు వేసేందుకు వచ్చిన తమను పోలీసులు అనవసరంగా అడ్డుకోవడమే కాకుండా దాడి చేశారని ఆరోపించారు. ఒకవైపు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతుండగా.. మరోవైపు ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పులివెందులలో రాజకీయ వేడి.! వరుస ఘటనలతో పులివెందులలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. జగన్ కాన్వాయ్‌ వద్ద దస్తగిరి వ్యవహారం, పోలింగ్ కేంద్రం వద్ద మహిళలు చేసిన ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారితీశాయి.ఎన్నికల సమయంలో ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.     [ Pulivendula Tensions, YS Jagan Mohan Reddy, Jagan Convoy Incident, Dastagiri, Viveka Murder Case, Kadapa Politics, AP Municipal Elections, Pulivendula Election Tensions, Andhra Pradesh Politics, YSRCP, TDP, Police Controversy, Pulivendula Polling, Women Voters Protest, Polling Booth Tensions, DSP Murali Naik, AP Political News ]
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల్లో చైర్‌పర్సన్లు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  దీంతో మిగిలిన 13 కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కలిపి మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల్లో పోలింగ్ జరుగుతోంది.ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 11,705 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మొత్తం 99,36,014 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం నుంచే ఓటర్ల సందడి.! రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు అందిన వివరాల ప్రకారం.. తెనాలి, వినుకొండల్లో 9 శాతం, చీరాలలో 12 శాతం, పులివెందులలో 11.1 శాతం పోలింగ్ నమోదైంది. నెల్లూరు కార్పొరేషన్‌లో 5.89 శాతం, కడప కార్పొరేషన్‌లో 7.7 శాతం, విశాఖపట్నంలో 3.34 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నగర పంచాయతీలో 12 శాతం, తిరుపతి జిల్లాలో 11.06 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం. ఒకవైపు ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటుండగా.. మరోవైపు కడప జిల్లాలోని పులివెందుల, కడప నగరాల్లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. పులివెందులలో అర్ధరాత్రి వాహన దహనం.! పులివెందులలో పోలింగ్‌కు కొన్ని గంటల ముందు వాహనాలకు నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శిల్పారామం సమీపంలో ఉలిమెల గ్రామానికి చెందిన మధుసూదన్‌రెడ్డికి చెందిన నివాసం వద్ద నిలిపి ఉంచిన బైకులు, కార్లు, ట్రాక్టర్ ట్రాలీకి నిప్పంటించినట్లు సమాచారం. మంటలు భారీగా వ్యాపించడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు మంటలను అదుపులోకి తీసుకువచ్చేలోపే సుమారు ఎనిమిది వాహనాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కర్రలు, రాళ్ల ఘటనలతో ఉద్రిక్తత.! పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పులివెందులలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరస్వతి విద్యామందిర్ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు వ్యక్తులు ముఖాలకు మాస్కులు ధరించి కర్రలతో తిరిగినట్లు సమాచారం. రాళ్లు విసిరిన ఘటన కూడా చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్లను అనుమతించే విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ పరిణామాలతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. మరోవైపు, పులివెందులలో టీడీపీ శ్రేణులు స్థానిక ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. 13వ వార్డు పరిధిలో కొందరు వ్యక్తులు కర్రలు పంచుకుంటున్న దృశ్యాలంటూ పార్టీ శ్రేణులు కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాయి. అయితే, ఈ ఆరోపణలపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది. మహిళా ఏజెంట్‌పై దాడి జరిగిందని వైసీపీ ఆరోపణ. పులివెందులలోని 31వ వార్డుకు చెందిన వైఎస్సార్‌సీపీ ఏజెంట్ సునందపై టీడీపీ శ్రేణులు దాడి చేశాయని ఆ పార్టీ ఆరోపించింది. పోలింగ్‌కు సంబంధించిన పత్రాలను తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పేర్కొంది. దాడి కారణంగా అస్వస్థతకు గురైన బాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం తరలించినట్లు సమాచారం. ఎన్నికలు నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధ్యులపై పోలీసుల అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కడపలో మాజీ మేయర్ల అరెస్టుతో కలకలం.! కడప నగరంలోని 61, 62వ డివిజన్ల పరిధిలో తమ పార్టీ ఏజెంట్లకు భద్రత లేకుండా పోయిందని వైఎస్సార్‌సీపీ వర్గాలు ఆరోపించాయి. ఏజెంట్లపై దాడులు జరిగాయని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మాజీ మేయర్ పాకా సురేష్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదేవిధంగా, నగరంలో జనరల్ ఏజెంట్‌గా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వెళ్తున్న మరో మాజీ మేయర్ సురేష్‌బాబును పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసినట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలపై ఆ పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, అరెస్టులకు సంబంధించి పోలీసుల వివరణ తెలియాల్సి ఉంది. పోలీసులతో మాజీ డిప్యూటీ సీఎం వాగ్వాదం.! కడప నగరంలోని నాగరాజుపేట పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడం లేదంటూ మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజాద్ బాషా పోలీసులను ప్రశ్నించారు. శాంతిభద్రతల దృష్ట్యా అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు సూచించడంతో ఆయన వారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం ఏజెంట్లను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించాలని అంజాద్ బాషా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.పోలింగ్ కేంద్రం వద్ద ఏజెంట్ల వ్యవహారంపై వివాదం నెలకొన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. దీంతో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో కొద్దిసేపు ఉత్కంఠ నెలకొంది. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడమే సవాల్.! పులివెందులలో వాహన దహనం, కర్రలు, రాళ్ల ఘటనలు.. మహిళా ఏజెంట్‌పై దాడి జరిగిందన్న ఆరోపణలు.. కడపలో మాజీ మేయర్ల అరెస్టులు, మాజీ డిప్యూటీ సీఎం వాగ్వాదం.. మేయర్ అభ్యర్థి ఆవేదన వంటి వరుస పరిణామాలు ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పులివెందులలో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం, ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవడం ఇప్పుడు అధికారులకు కీలకంగా మారింది.       [ Andhra Pradesh Municipal Elections, AP Municipal Polling, Pulivendula Elections, Kadapa Political Tensions, Municipal Election Violence, Vehicle Burning Incident, YSRCP, TDP, Kadapa Former Mayors Arrest, Anjad Basha, Bandi Deepti, Polling Agent Attack, Polling Booth Tension, Andhra Pradesh Politics ]  
సమాజంలో రోజురోజుకూ పెరిగిపోతున్న దారుణాలు, హేయమైన నేరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మానవత్వాన్ని మంటగలిపే ఘటనలు నిత్యం వెలుగుచూస్తూ సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి కిరాతకాలకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. అసలు నేటి యువతలో ఇంతటి క్రూరత్వం ఎక్కడి నుంచి వస్తోంది? హింసను సాధారణంగా భావించే పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఇటీవల అనంతపురం జిల్లా రాప్తాడు ప్రాంతంలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల ప్రాంగణంలోనే జరిగిన కిరాతక దాడి అందరినీ నివ్వెరపరిచింది. తోటి విద్యార్థుల కళ్లెదుటే రంపంతో దాడికి పాల్పడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఓ విద్యార్థినిపై ఇంతటి అమానుషంగా దాడి చేయడానికి మనసు ఎలా ఒప్పిందనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో సినిమాల్లో పెరిగిపోతున్న హింసాత్మక దృశ్యాలపై మరోసారి చర్చ మొదలైంది. ఇటీవల విడుదలైన కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాల్లో రంపంతో దాడి చేసే హింసాత్మక దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. వెండితెరపై చూపించే ఇలాంటి సన్నివేశాలు యువతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కొన్ని సినిమాల్లో కత్తులతో నరకడం, రంపాలతో దాడి చేయడం, తలలు నరికేయడం, విచక్షణారహితంగా హత్యలు చేయడం వంటి భయానక దృశ్యాలకు పెద్దపీట వేస్తున్నారు. హీరోయిజం పేరుతో హింసను గొప్పగా చూపించడం, క్రూరమైన చర్యలను స్టైలిష్‌గా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, సమాజంలో జరిగే ప్రతి నేరానికీ సినిమాలే కారణమని చెప్పలేం. వ్యక్తుల పెంపకం, మానసిక పరిస్థితులు, సామాజిక వాతావరణం, ఇతర ప్రభావాలు కూడా నేరప్రవృత్తికి కారణం కావచ్చు. కానీ తెరపై చూపించే హింసాత్మక సన్నివేశాలు కొందరు యువతపై ప్రభావం చూపే అవకాశాన్ని మాత్రం విస్మరించలేం. ముఖ్యంగా విచక్షణ పెరగాల్సిన వయసులో హింసను అనుకరించే ప్రమాదం ఉందనే ఆందోళన సహజమే. అందుకే చిత్ర పరిశ్రమ పెద్దలు, దర్శకులు, నిర్మాతలు, అగ్రహీరోలు ఈ అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వినోదం పేరుతో హింసను మహిమపరచడం కాకుండా, మానవీయ విలువలు, కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యత, యువతకు స్ఫూర్తినిచ్చే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే సినిమా అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాదు.. కోట్లాది మందిపై ప్రభావం చూపగల శక్తివంతమైన మాధ్యమం. హీరోలను అభిమానించే యువత వారి నటనతో పాటు వారి ఆలోచనలను, సందేశాలను కూడా స్వీకరిస్తుంది. అలాంటప్పుడు సమాజం పట్ల బాధ్యతతో కూడిన కథలను అందించడం సినీ ప్రముఖుల బాధ్యత. తెరపై హీరోయిజం అంటే విలన్లను చంపడం మాత్రమే కాదు.. సమాజానికి మంచి మార్గం చూపించడం కూడా! హింసను ప్రేరేపించే సన్నివేశాల కంటే మానవత్వాన్ని మేల్కొలిపే కథలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే వెండితెర వినోదంతో పాటు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.       [ Cinema Violence, Movie Impact on Youth, Toxic Movie, Yash, Violence in Films, Youth Crime, Rising Crimes, Rapthadu Incident, Student Attack, Social Responsibility, Film Industry, Violent Scenes, Youth Behaviour, Crime Prevention, Human Values, Telugu States ]
ALSO ON TELUGUONE N E W S
The much-awaited reunion of Ram Charan and Sukumar has officially begun, bringing together the team behind the cult classic Rangasthalam once again. Their second collaboration, RC17, was launched with a grand muhurtham ceremony today in the presence of several prominent personalities from the film industry. Megastar Chiranjeevi attended the ceremony as the chief guest and gave the ceremonial clap for the first shot, extending his blessings to the team. T-Series head Bhushan Kumar switched on the camera, while producers Mythri Naveen, Mythri Ravi and Tabitha Sukumar presented the script.  The grand launch has further heightened expectations surrounding this ambitious Pan-India project. Bankrolled by Mythri Movie Makers and Sukumar Writings, the film is presented by T-Series and is being mounted on a lavish scale.  Sukumar is preparing to showcase Ram Charan in a never-before-seen avatar, with the actor undergoing a significant physical transformation for the role. Carrying the intriguing tagline "You Can Imagine", the makers are setting ambitious expectations for this cinematic spectacle. More details about the project will be announced in due course.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త సినిమాకు గ్రాండ్‌గా శ్రీకారం చుట్టారు. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమం నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై.. సినిమాకు తొలి క్లాప్ ఇచ్చారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'రంగస్థలం' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. 2018లో విడుదలైన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక సుకుమార్ టేకింగ్, కథను నడిపించిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో.. ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై చాలా కాలంగా వర్క్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా కొంతకాలంగా జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు టీ-సిరీస్ ఈ సినిమాను నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నాయి. హీరోయిన్, ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్ వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముఖ్యంగా సంగీత దర్శకుడి విషయంలో అనిరుధ్ పేరు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్‌లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఏదేమైనా 'రంగస్థలం' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి ఈసారి చిట్టిబాబు కంటే భిన్నమైన పాత్రలో చరణ్‌ను సుకుమార్ ఎలా చూపించబోతున్నారో చూడాలి. https://x.com/Theteluguone/status/2116773338412663130       [RC17 Pooja Ceremony, RC17 Movie Launch, Chiranjeevi First Clap, Chiranjeevi, Ram Charan, Sukumar, RC17 Movie]  
సూర్య నుంచి మరోసారి ఓ విభిన్నమైన సినిమా రాబోతున్నట్లు ‘సీన్’ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అయితే ఇది ‘సింగం’ తరహా రెగ్యులర్ పోలీస్ యాక్షన్ సినిమా మాత్రం కాదని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. మర్డర్ మిస్టరీ, డార్క్ కామెడీ, ఊహించని మలుపులతో కథను నడిపించబోతున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ ప్రారంభంలోనే సూర్య పాత్రను పరిచయం చేశారు. ఆయన డీఎస్పీ ఇన్‌బరాజ్‌గా కనిపిస్తున్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో తనదైన శైలిలో వ్యవహరించే ఇన్‌బరాజ్.. ఓ దశలో ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ ఆయన పైఅధికారి స్టీఫెన్ (లాల్) మాత్రం ఇన్‌బరాజ్‌ను తిరిగి విధుల్లోకి రావాలని పదేపదే కోరుతుంటాడు. అతను స్పందించకపోవడంతో చివరకు పోలీసులను ఇంటికి పంపించే పరిస్థితి వస్తుంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేస్తావని లాల్ అడగగా.. "రాజకీయాల్లోకి వెళ్తా" అని సూర్య బదులివ్వడం హైలైట్ గా నిలిచింది. ఇక్కడే సూర్య పాత్రలోని కామెడీ టైమింగ్ కనిపిస్తుంది. ఉద్యోగాన్ని వదిలేయాలనుకునే వ్యక్తి.. మళ్లీ ఓ కేసు కోసం పోలీస్ వ్యవస్థలోకి రావాల్సి వస్తుంది. ఇన్‌బరాజ్ పాత్రలోని నిర్లక్ష్య ధోరణి, విచిత్రమైన ప్రవర్తన, అధికారుల ఆదేశాలను పట్టించుకోని తీరు నవ్వులు పూయించేలా ఉన్నాయి. అదే సమయంలో అతడి వెనుక ఓ బలమైన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడనే విషయం కూడా అర్థమవుతోంది.  ఈ సినిమాలో మరో ప్రధాన ఆకర్షణ మలయాళ నటుడు నస్లెన్. ఆయన ఈశ్వరన్ అనే సైకో కిల్లర్ తరహా పాత్రలో కనిపిస్తున్నారు. తెలివైన వ్యక్తిగా, ఏ మాత్రం కనికరం లేని క్రిమినల్‌గా ఈ పాత్రను పరిచయం చేశారు. ఇన్‌బరాజ్‌కు ఈశ్వరన్ పెద్ద సవాల్‌గా మారడంతో వీరిద్దరి మధ్య ఎలాంటి పోరు జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ‘రోమాంచం’, ‘ఆవేశం’ సినిమాలతో మలయాళంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్.. ఇప్పుడు సూర్యతో తన తొలి తమిళ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన గత సినిమాల్లో కనిపించిన విభిన్నమైన పాత్రలు, డార్క్ హ్యూమర్, సహజమైన కామెడీ ఈ సినిమాలోనూ కనిపించేలా ఉన్నాయి. ట్రైలర్ చివర్లో వచ్చే ‘సింగం’ ప్రస్తావన కూడా అభిమానులకు నవ్వులు పంచేలా ఉంది. మొత్తానికి ‘సీన్’ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా.. ‘ఆవేశం’ తరహాలో ప్రేక్షకులను అలరిస్తుందా? అనేది చూడాలి. ఇది కూడా చదవండి: ‘ఇరుముడి’కి కొత్త చిక్కులు.. నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు   Click Here To Watch Scene Movie Trailer        [Suriya Scene Trailer Analysis, Suriya Scene Trailer Review, Suriya Scene Movie, Suriya New Movie, Scene Movie Story, Jithu Madhavan, Naslen, Nazriya Nazim]  
Scene starring Suriya, Nazriya Nazim and Naslen has become talk of the town after Naslen is confirmed to play an antagonist. The young actor has built a huge reputation across Telugu movie lovers at least on social media with his films. Mainly, Mollywood Times has helped him create such good impression and fan following. Now, Scene seems to increase it to next level. The trailer of the film has been released now and interestingly, Naslen's portions excite more than Suriya. As ACP Inbaraj, he has very casual character and director Jithu Mathavan, has cracked many jokes on his famous characters and scenes from before, keeping them as meta references but with a difference. But the major highlight remains to be Naslen and his antagonist role. His scenes, frames and interaction with Suriya rise anticipation to watch them go head-to-head in this cat and mouse game of between an egoistic police officer and a cold-blooded serial killer.  Nazriya Nazim scenes do not really excite much but the film looks like a dark comedy with all thriller troupes. Movie is releasing on 6th November for Diwali and many are expecting it to be hat-trick hit for Suriya this year. Let's see how Jithu's magic will work at the box office.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
The sensational combination of Ram Charan and Sukumar is back! Eight years after delivering the cult blockbuster Rangasthalam, the actor-director duo is reuniting for RC17, bringing back the successful trio with producers Mythri Movie Makers. The film will have a grand launch with a pooja ceremony tomorrow. Following the pan-India success of Pushpa 2, the director is taking considerable time to shape this ambitious project. The makers have also established a dedicated office and are currently working on the final stages of pre-production. Ram Charan will undergo massive transformation for this film.  The makers are keeping the genre, cast and technical crew details under wraps for now. With Rangasthalam remaining a landmark collaboration in both their careers, expectations are naturally high for their reunion. Sukumar Writings will co-produce the film with Mythri.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల తేదీ, సమయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం నవంబర్ 1, 2026న ఉదయం 10:50 గంటలకు సినిమా పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, T Films సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాయి. ‘మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్’ అంటూ పోస్టర్‌పై పేర్కొనడం, ‘You Can Imagine’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా సాత్విక వీరవల్లి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె ఎంపికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూజా కార్యక్రమం సందర్భంగా నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ‘రంగస్థలం’తో రామ్ చరణ్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన సుకుమార్.. ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈసారి సుకుమార్ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తారో చూడాలి.     [Ram Charan, Sukumar, RC17, Ram Charan Sukumar Movie, RC17 Pooja Ceremony, Mythri Movie Makers, Sukumar Writings, Ram Charan Upcoming Movie]
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు జారీ చేసింది. సినిమాలో ఓ మైనర్ బాలికతో షూటింగ్ నిర్వహించడంతో పాటు, సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొన్న అంశంపై అధికారులు వివరణ కోరారు. బాలల హక్కులు, భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటించారా లేదా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. జై లోక్‌సత్తా సోషల్ జస్టిస్ ఫోరం చేసిన ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. షూటింగ్‌లో బాలికను పాల్గొనేలా చేయడానికి ముందుగా జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నారా? ఆమె తల్లిదండ్రుల నుంచి అధికారిక సమ్మతి పత్రం పొందారా? అనే ప్రశ్నలను నిర్మాతల ముందు ఉంచారు. అలాగే బాలికకు సంబంధించిన కాల్‌షీట్లు, హాజరు రికార్డులు, షూటింగ్‌లో ఆమె పనిచేసిన గంటల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. షూటింగ్ కారణంగా బాలిక చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలేమిటి? ఆమె భద్రత, సంక్షేమం కోసం ప్రత్యేక సంరక్షకుడిని నియమించారా? అనే వివరాలను కూడా అధికారులు అడిగారు. బాలికకు చెల్లించిన పారితోషికంలో కనీసం 20 శాతాన్ని ఆమె పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారా? సినిమా ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రీ రిలీజ్ వేడుకలో ఆమె పాల్గొనే విషయంలో నిబంధనలు పాటించారా? అన్న అంశాలపైనా వివరణ కోరారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన పూర్తి ఆధారాలతో నవంబర్ 4న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నిర్మాతలను కార్మిక శాఖ ఆదేశించింది. దీంతో ‘ఇరుముడి’ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే నోటీసులు జారీ కావడం మాత్రమే నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారణ కాదు. నిర్మాతలు సమర్పించే వివరణ, విచారణ అనంతరం అధికారులు తీసుకునే నిర్ణయంతో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.     [Ravi Teja, Irmudi Movie, Irmudi Movie Controversy, Telangana Labour Department, Minor Girl Shooting, Irmudi Producers Notice, Child Artist Rules, Ravi Teja Latest News]
The Telangana Labour Minister Vivek, has issued notices to the producers of Ravi Teja's upcoming film Irumudi, Mythri Movie Makers, over the participation of a minor girl, Baby Nakshatra, in the film's shoot. The department has sought clarification on whether the production team followed the mandatory regulations governing the employment of children in film productions. The Joint Commissioner of the Telangana Labour Department has questioned Mythri on whether they obtained prior permission from the District Magistrate before involving the minor in the shoot and secured formal consent from her parents. The officials have also sought call sheets, attendance records and details of the working hours during which the girl participated in filming. The production team has been asked to explain what measures were taken to ensure that her education was not affected, whether a dedicated guardian was appointed to look after her safety and welfare, and whether 20 per cent of her remuneration was deposited in a fixed deposit account. The department has also sought clarification on the minor's proposed participation in the film's promotional activities, including its pre-release event. The producers have been directed to appear before the Labour Department on November 4 at 11 AM with all relevant documents and evidence. The notice seeks to establish whether the film's production complied with child labour regulations and safeguards applicable to minors working in the entertainment industry. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
జీవితంలో ఎదగాలన్నా,  శత్రువులను చిత్తు చేయాలన్నా..చాణక్యుడు చెప్పినట్టు ఇలా చేయండి..! జీవితంలో ప్రశాంతంగా ముందుకు సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ సమాజంలో లేదా పని చేసే చోట కొందరు వ్యక్తులు మన ఎదుగుదలను చూసి ఓర్వలేక శత్రువులుగా మారుతుంటారు. అలాంటి వారిని ఎదుర్కొనేందుకు కేవలం శారీరక బలం లేదా కక్ష సాధింపు సరిపోవని ఆచార్య చాణక్యుడు ఎప్పుడో చెప్పాడు. శత్రువులను శాశ్వతంగా ఓడించాలంటే శారీరక శక్తి కంటే మానసిక పరిపక్వత, చాతుర్యం చాలా ముఖ్యం. జీవితంలో ఎదురయ్యే ఛాలెంజ్ లను, శత్రువులను ఎలా ఎదుర్కోవాలో ఆచార్య చాణక్యుడు తన చాణక్య  నీతిలో  అద్బుతంగా వివరించాడు. వాటిని మన దైనందిన జీవితానికి అన్వయించుకుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా సులభంగా జయించవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. ప్రవర్తన.. మనం నడుచుకునే తీరు, మాట్లాడే విధానం , పరిస్థితులను అంచనా వేసే పద్ధతే మనల్ని విజేతగా నిలబెడుతుంది. శత్రువులు మనపై ఆధిపత్యం చెలాయించాలని చూసినప్పుడు మనం కోపం చేసుకోకుండా  వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. మౌనం.. మౌనం అనేది అన్ని సమయాలలోనూ బలహీనత కాదు. ఎవరైనా మనల్ని కవ్విస్తున్నప్పుడు లేదా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారీ వెంటనే రెస్పాండ్ కావాల్సిన  అవసరం లేదు. కొన్నిసార్లు మనం మౌనంగా ఉండటమే శత్రువుకు అతిపెద్ద సమాధానం అవుతుంది. మనం వెంటనే బదులు ఇవ్వకపోతే, అవతలి వ్యక్తికి మన తర్వాత  ఆలోచన ఏమిటో,  ఏం చేస్తామో అనేది అంతుచిక్కదు. దీనివల్ల వారు గందరగోళానికి గురవుతారు. కాబట్టి అనవసరమైన వాదనలకు దిగి శక్తిని వృథా చేసుకునే బదులు నిశ్శబ్దంగా ఉండి సరైన సమయం కోసం వేచి చూడటం మంచిది. అజాగ్రత్త.. ఎవరినైనా ఎదుర్కొనేటప్పుడు లేదా పోటీ పడేటప్పుడు వారిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అవతలి వ్యక్తి ఎంత చిన్నవాడైనా, బలహీనుడైనా సరే వారిలో ఉండే ప్రత్యేక నైపుణ్యాలు లేదా వారి ప్రణాళికలు  ప్రమాదకరంగా మారవచ్చు. శత్రువును బలహీనుడిగా భావించి అజాగ్రత్తగా ఉంటే అది మనకే నష్టాన్ని తెస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. గోప్యత.. మన జీవితానికి లేదా భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకూడదు. మన ఆలోచనలు, చేసే పనులు ముందుగానే ఇతరులకు తెలిస్తే , మన మంచి ఓర్వలేని వారు వాటిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే మన విజయానికి బాటలు వేసే ప్రణాళికలు పూర్తిగా అమలయ్యే వరకు వాటిని గోప్యంగా ఉంచడమే అత్యంత సురక్షితమైన మార్గం. తొందరపాటు.. ఏదైనా రంగంలో ముందుకు వెళ్లాలంటే ముందుగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను, మనుషులను సరిగ్గా అర్థం చేసుకోవాలి. శత్రువు బలాలు ఏమిటి, వారి బలహీనతలు ఏమిటి అనే విషయాలపై స్పష్టత ఉండాలి. వారి ఆలోచనా విధానాన్ని బట్టి మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అంచనా వేయవచ్చు. ఆలోచించకుండా తొందరపాటుతో అడుగులు వేసే బదులు  ఆచి తూచి అడుగు వేయడం ఎప్పుడూ మంచిది. కోపం.. కోపం అనేది మనిషిలో ఉన్న విచక్షణా జ్ఞానాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. కోపంతో తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ మీ భావోద్వేరాల నియంత్రణ కోల్పోకూడదు. ప్రశాంతమైన మనసుతో ఆలోచించి తీసుకునే నిర్ణయాలే ఎప్పుడూ సరైన ఫలితాలను ఇస్తాయి. మెరుగవ్వాలి.. ప్రతి రోజూ ఏదో ఒక విషయం నేర్చుకుని మెరుగవుతూ ఉండాలి. మన విద్య, జ్ఞానం, నైపుణ్యాలు , అనుభవాన్ని పెంచుకోవడం ద్వారా మానసికంగా బలపడవచ్చు. మెంటల్ గా బలవతులుగా ఉన్నప్పుడు   ఎలాంటి శత్రువులైనా మనల్ని సులభంగా ఓడించలేరు. ప్రతి వ్యక్తికి  కష్టపడే తత్వమే వారి బలానికి అసలుసిసలైన ఆధారం అవుతుంది. భయాన్ని వదిలిపెట్టాలి.. అన్నింటికంటే ముఖ్యంగా మన మనసులో ఉండే భయమే మన అతిపెద్ద శత్రువు. భయం కారణంగా మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేడు. ఏ సవాల్‌నైనా ఎదుర్కొనే ముందు మనసులో ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి. భయాన్ని వీడి ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి దానంతట అదే తొలగిపోతుంది.                                                                                                                                          *రూపశ్రీ.
పండుగ అనగానే మన ఇళ్లలో పిండి వంటలు, ఘుమఘుమలాడే కారపు పదార్థాలు, నోరూరించే తీపి పదార్థాల హోరు మొదలవుతుంది. అయితే ఈ పండుగ వేడుకల్లో ఆనందంగా తిన్న ఆహారమే కొన్నిసార్లు తీవ్రమైన ఎసిడిటీ, ఛాతీలో మంట, కడుపులో అసౌకర్యానికి దారితీస్తుంది. పండుగ సమయాల్లో మన చేసే కొన్ని చిన్న ఆహార పొరపాట్లు జీర్ణవ్యవస్థపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. చాలామంది ఉదయం పూట పండుగ పనుల బిజీలో లేదా విందు కోసం కడుపు ఖాళీగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ సేపు ఏమీ తినకుండా ఉంటారు. ఇలా దీర్ఘకాలం పాటు ఖాళీ కడుపుతో ఉండి, ఆ తర్వాత ఒకేసారి భారీ విందు భోజనం చేయడం వల్ల కడుపుపై తీవ్రమైన ఒత్తిడి పడి ఆమ్లాలు (Acids) అధికంగా ఉత్పత్తి అవుతాయి. ఇది కడుపును సాగదీసి యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇక పండుగ విందులలో సమోసాలు, పకోడీలు, పూరీలు మరియు క్రీమీ గ్రేవీలతో కూడిన వేయించిన పదార్థాలు ఉండాల్సిందే. అయితే రీసెర్చ్ గేట్ (ResearchGate) అధ్యయనం ప్రకారం, ఇలాంటి అధిక కొవ్వు ఉండే వేయించిన ఆహారాలు జీర్ణమಾಗడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇవి కడుపు ఖాళీ అయ్యే ప్రక్రియను మందగించి, ఛాతీలో మంట లక్షణాలను మరింత తీవ్రం చేస్తాయి. వీటితో పాటు అత్యంత కారంగా ఉండే కూరలు, పచ్చళ్లు మరియు మసాలా పదార్థాలు జీర్ణకోశ గోడలను చికాకు పెట్టి తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే అందరికీ అన్ని మసాలాలు పడాలని లేదు, కొందరిలో మిరపకాయల కారం తక్షణమే ఎసిడిటీని ట్రిగ్గర్ చేస్తుంది. కాబట్టి మీ శరీర తత్వానికి సరిపడే మోతాదులో మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది. పండుగ పూట పిండివంటలు, చాక్లెట్లు, కేకులు మరియు రిచ్ డెజర్ట్‌లను పెద్ద మొత్తంలో లాగించేయడం మరో పెద్ద పొరపాటని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చాక్లెట్లు తీసుకోవడం వల్ల కొందరిలో రిఫ్లక్స్ సమస్య తీవ్రమవుతుంది. అలాగే విందు సమయంలో లేదా ఆ వెంటనే టీ, కాఫీలు లేదా కార్బోనేటెడ్ శీతల పానీయాలు అధికంగా సేవించడం వల్ల కడుపులో గ్యాస్, ఉబ్బరం మరియు తేన్పులు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన వెంటనే కెఫిన్ పానీయాలు తీసుకోవడం యాసిడ్ ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, రాత్రి పూట ఆలస్యంగా భారీ విందు ముగించిన వెంటనే నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం వల్ల తిన్న ఆహారం తిరిగి అన్నవాహికలోకి (Oesophagus) తన్నేసే ప్రమాదం ఉంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటాలజీ జర్నల్ నివేదిక ప్రకారం, భోజనానికి మరియు నిద్రపోవడానికి మధ్య కనీసం 3 గంటల వ్యవధి ఉండాలి. రాత్రి వేళల్లో ఈ చిన్న నియమం పాటించకపోతే తీవ్రమైన ఎసిడిటీ నిద్రను భగ్నం చేస్తుంది. అందువల్ల పండుగ రుచులను ఆస్వాదిస్తూనే, మితంగా తింటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఎసిడిటీ జోలికిపోకుండా పండుగను ఆనందంగా జరుపుకోవచ్చు.     Festival Indigestion Causes, Holiday Acidity And Bloating, Prevent Acid Reflux Festivals, Festive Diet Mistakes, Heartburn Food Triggers, Digestive Health Tips, Wellness Tips In Telugu.
ప్రస్తుతం మన దైనందిన జీవితంలో స్మార్ట్‌వాచ్‌లు ఒక అత్యవసర ఆరోగ్య భాగస్వామిగా మారిపోయాయి. మణికట్టుపై ధరించే ఈ చిన్న పరికరం గుండె వేగం ఎంత ఉంది, ఎన్ని అడుగులు నడిచాం, ఎంతసేపు గాఢంగా నిద్రపోయాం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి ఎంత ఉందనే వివరాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మనకు తెలపడంలో కీలకపాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 29న ప్రపంచ స్ట్రోక్ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా పక్షవాతంపై ప్రజల్లో అవగాహన పెంచాలని, సకాలంలో ప్రాణాలను కాపాడుకునేలా ప్రోత్సహించాలని వైద్య నిపుణులు ఎల్లప్పుడూ హెచ్చరిస్తుంటారు. అయితే చాలామంది తమ స్మార్ట్‌వాచ్‌లో హార్ట్‌బీట్ నిమిషానికి 72 సార్లు సాధారణంగా కనిపిస్తుంటే చాలు, తమకు ఎటువంటి ప్రాణాపాయం లేదని, స్ట్రోక్ వచ్చే ప్రమాదం లేదని చాలా పొరపడుతుంటారు. గురుగ్రామ్‌లోని ప్రముఖ సీకే బిర్లా ఆసుపత్రి న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ మోహిత్ ఆనంద్ ప్రకారం.. స్మార్ట్‌వాచ్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ పూర్తి స్థాయి వైద్య పరీక్షా పరికరాలుగా భావించకూడదు. ఇవి కేవలం గుండె వేగం, గుండె లయ వంటి కొన్ని ప్రాథమిక అంశాలను మాత్రమే గమనిస్తాయి. కొన్ని అత్యాధునిక పరికరాలు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AFib) వంటి అసాధారణ గుండె లయలను గుర్తించే సూచనలు ఇవ్వగలవు, ఇది భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదాన్ని తీవ్రంగా పెంచుతుంది. అయితే, అసలు విషయం ఏమిటంటే, స్ట్రోక్ అనేది కేవలం గుండె వేగానికి మాత్రమే సంబంధించిన సమస్య కాదు. మెదడుకు ఆక్సిజన్‌ను, రక్తాన్ని సక్రమంగా సరఫరా చేసే రక్తనాళంలో రక్తం గడ్డకట్టడం, లేదా రక్తనాళం చిట్లిపోయి తీవ్రమైన రక్తస్రావం జరగడం వల్ల అకస్మాత్తుగా స్ట్రోక్ సంభవిస్తుంది. కాబట్టి మీ స్మార్ట్‌వాచ్ స్క్రీన్‌పై గుండె నిమిషానికి సరిగ్గా సాధారణ రీడింగ్‌లో కొట్టుకుంటున్నట్లు కనిపించినా, మెదడులో జరిగే అంతర్గత రక్తనాళాల సమస్యల వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. స్ట్రోక్ ముప్పు ముంచుకొస్తున్నప్పుడు శరీరం కొన్ని కీలకమైన హెచ్చరిక సంకేతాలను అకస్మాత్తుగా ఇస్తుంది. ముఖం ఒకవైపు అకస్మాత్తుగా వాలిపోవడం, చేతులు లేదా కాళ్లలో ఒకవైపు తీవ్రమైన బలహీనత లేదా తిమ్మిరి ఆవరించడం, మాట్లాడటంలో ఇబ్బంది తడబడటం లేదా ఎదుటివారు చెప్పేది అసలు అర్థం చేసుకోలేకపోవడం, అకస్మాత్తుగా చూపు మందగించడం లేదా దృష్టి పూర్తిగా కోల్పోవడం, నడవడంలో ఇబ్బంది కలగడం, సమతుల్యత దెబ్బతినడం, ఎటువంటి స్పష్టమైన కారణం తెలియకుండా విపరీతమైన తలనొప్పి రావడం వంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి తప్ప, స్మార్ట్‌వాచ్ సాధారణ రీడింగ్ చూపిస్తోందన్న ధీమాతో ఆసుపత్రికి వెళ్లడం ఆలస్యం చేయకూడదు. లక్షణాలు ప్రారంభమైన సమయాన్ని కచ్చితంగా గుర్తుంచుకోవడం వైద్య చికిత్సలో అత్యంత కీలకం. కొన్ని నిమిషాల్లో ఆ లక్షణాలు అంతగా అనిపించకపోయినా వాటిని తేలికగా తీసుకోకూడదు. అది తాత్కాలిక ఇస్కీమిక్ దాడి (TIA) లేదా మినీ స్ట్రోక్ కావడానికి పూర్తి అవకాశం ఉంది. సెన్సార్లు కదలికల వల్ల, పరికరాన్ని సరిగ్గా ధరించకపోవడం వల్ల కొన్నిసార్లు తప్పు రీడింగ్స్ ఇచ్చే సాంకేతిక పరిమితులు స్మార్ట్‌వాచ్‌లకు ఉంటాయి. కాబట్టి రక్తంలో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా ఉన్నా, మెదడుకు రక్త సరఫరా సక్రమంగా జరుగుతోందని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు. క్రమమైన వ్యాయామం, సమతుల్య ఆహారం, రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహాన్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం ద్వారా స్ట్రోక్ ముప్పును గణనీయంగా తగ్గించుకోవచ్చు.     Stroke With Normal Heart Rate, Hidden Stroke Risks, Doctors Warnings On Stroke, Cardiovascular Health Facts, Silent Stroke Causes, Medical Advice In Telugu, Heart And Brain Health
ఉపవాసం అనగానే మనలో చాలామందికి ముందుగా గుర్తువచ్చేది ఏదో ఒక పూట భోజనం మానివేయడం లేదా దేవుడి పేరుతో చేసే పూజా కార్యక్రమాలు. అయితే ఆధునిక వైద్య శాస్త్రం , మన పురాతన కాలం నాటి ఆచారాలు కూడా ఉపవాసం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఎటువంటి ఖర్చు లేకుండా, మనం పాటించే చిన్న ఉపవాస పద్ధతి శరీరం లోపల ఎన్నో అద్బుతమైన మార్పులకు కారణమవుతుంది. ఉపవాసం గురించి మూర్ఖంగా వాదించే వారు కూడా ఉంటారు.  అలాంటి వారు ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తీగా అర్థం చేసుకోవాలి.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థకు విశ్రాంతి.. శరీరానికి ఎప్పుడూ ఆహారాన్ని అందిస్తూనే ఉంటే జీర్ణవ్యవస్థ విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల కాలక్రమేణా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం, కణాల పనితీరు మందగించడం జరుగుతుంది. అదే మనం ఉపవాసం ఉన్నప్పుడు జీర్ణక్రియకు కాస్త విరామం దొరుకుతుంది. ఈ సమయంలో శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ప్రక్రియపై పూర్తిగా దృష్టి పెడుతుంది. ఉపవాసం వల్ల శరీరానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు.. బరువు నియంత్రణ.. మనం తినడం ఆపినప్పుడు శరీరం శక్తి కోసం మొదట గ్లూకోజ్ ను, ఆ తర్వాత నిల్వ ఉన్న కొవ్వును కరిగించడం మొదలుపెడుతుంది. దీనివల్ల అనవసరమైన కొవ్వు సులభంగా కరిగిపోయి బరువు అదుపులోకి వస్తుంది.   రోగనిరోధక శక్తి పెరుగుదల.. ఉపవాస సమయాల్లో శరీరం పాత , దెబ్బతిన్న కణాలను తొలగించి కొత్త కణాల ఉత్పత్తికి పెద్దపీట వేస్తుంది. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ మరింత బలంగా తయారవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ.. కొద్దిసేపు ఆహారానికి దూరంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గి, మధుమేహం అదుపులో ఉండేందుకు చక్కటి అవకాశం లభిస్తుంది. మెదడు చురుకుదనం.. ఉపవాసం ఉన్న సమయంలో మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరగడానికి , ఏకాగ్రత మెరుగుపడటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ నిజం తెలుసుకోవాలి.. అయితే ఉపవాసం అంటే రోజంతా పస్తులు ఉండమని కాదు. మన శరీర తత్వానికి తగినట్లుగా, నీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతూ తేలికపాటి పద్ధతిలో ఉపవాసం ఉండటం మంచిది. ఒకసారి ఈ చిన్న అలవాటును మన దినచర్యలో భాగం చేసుకుంటే, అనారోగ్యాలొచ్చే అవకాశాలు చాలావరకు తగ్గిపోయి నిత్యం ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి  ఉపవాసాన్ని కేవలం ఆచారంలా కాకుండా ఆరోగ్య రహస్యంగా భావించి పాటించడం వల్ల మరింత స్పష్టత వస్తుంది.                                                                                                                                        *రూపశ్రీ.
రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నాయా? రక్త ప్రసరణ సరిగా జరగడం లేదా? రక్తనాళాల్లో బ్లాకులు ఎందుకు ఏర్పడతాయి? వాటి వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుందా? మన వంటింట్లోనే దొరికే నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవచ్చు? ఈ చూర్ణంలో ఉపయోగించే దినుసులు ఏమిటి? వాటిని ఎంత మోతాదులో తీసుకోవాలి? ఎలా ఉపయోగించాలి? అనే విషయాలను ఆయుర్వేద, వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వివరించారు. రక్తనాళాల్లో బ్లాకులు ఏర్పడటానికి గల కారణాలు, కొలెస్ట్రాల్ సమస్యలు, రక్త ప్రసరణకు సంబంధించిన విషయాలు, నాలుగు దినుసులతో ఆయుర్వేద చూర్ణం తయారీ విధానం గురించి డాక్టర్ మధుసూదన శర్మ గారి వివరణను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. రక్తనాళాల ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారు, కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు, రక్త ప్రసరణ గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ వీడియోను చూడండి. ముఖ్య గమనిక: రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవాలి. ఆయుర్వేద చూర్ణం లేదా ఇతర ఇంటి వైద్యాలను ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించాలి. డాక్టర్ సూచించిన మందులను స్వయంగా ఆపకూడదు. రక్తనాళాల్లోని బ్లాకులకు మందులు లేదా స్టెంట్ అవసరమా అనే విషయాన్ని వైద్యులే నిర్ణయించాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)