Publish Date:Aug 19, 2025
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత …. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలకు ఎదురవుతోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే తరపున సి.పి. రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి తెలంగాణా కు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వైసీపీ, బీఆర్ఎస్ ఏ కూటమిలోనూ లేవు. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ కూటమికి మద్ధతు ఇవ్వాలనే విషయంలో ఈ రెండు పార్టీలకు సంకట స్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ కు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటోంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేని పరిస్థితి. ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటుందా? ఎవరికైనా అండగా నిలుస్తుందా వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ పార్టీది కూడా సరిగ్గా ఇదే పరిస్థితి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ కేంద్రంలో ఎన్డీయే కూటమికి అండగా నిలిచింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి జగన్ రాష్ట్ర వ్యవహారాల్లో కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ పట్ల ఎటువంటి వ్యతిరేకతా వ్యక్తం చేయకుండా జాగ్రత్త వహిస్తున్నారు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇస్తే రాష్ట్రంలో కయ్యం… కేంద్రంలో వియ్యం అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తే తనపై ఉన్న కేసుల విషయంలో బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయంతో ఉన్నారు. మొత్తం మీద ఉపరాష్ట్రపతి ఎన్నికలు వైసీపీ, బీఆర్ఎస్ లకు తలనొప్పిగా మారుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/new-headache-to-brs-and-ycp-39-204553.html
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.