రాజధాని గుంటూరు వద్దే కానీ...

Publish Date:Aug 1, 2014

Advertisement

 

మొదట విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు ఇప్పుడు పునరాలోచనలో పడినట్లున్నారు. అక్కడ రాజధాని ఏర్పాటు చేయదలిస్తే అవసరమయిన భూమి సేకరించడానికే దాదాపు రూ. 20-25,000 కోట్లు అవసరం ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తేల్చిచెప్పింది. అంతేకాక ఇదివరకు కొత్తగా ఏర్పడిన ఛత్తీస్ ఘర్, ఉత్తరాఖండ్, జార్ ఖండ్ రాష్ట్రాలు రాజధాని నిర్మించుకోవడానికే కేంద్రం అరకొర నిధులు విదిలించిందని, కనుక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం కేంద్రం వేలు,లక్షల కోట్లు కుమ్మరిస్తుందని ఆశపడటం అత్యాసే అవుతుందని కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి జ్ఞానోపదేశం చేసిన తరువాత నుండి దాని ఆలోచనలో మార్పు కనబడుతోంది.

 

తెదేపా అధికారం చెప్పట్టగానే ఎవరినీ సంప్రదించకుండానే రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పుడు త్వరలోనే దీనిపై అఖిలపక్ష సమావేశం, ఇంకా అవసరమయితే శాసనసభలో చర్చకు పెట్టి అందరి అభిప్రాయలు తీసుకోవాలని భావిస్తోంది. ఇటీవల తనను కలిసిన లెఫ్ట్ పార్టీ నేతల ఒక ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం ఇస్తూ రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయం కేవలం నాయకుడు ఒక్కడే నిర్ణయించలేడు, అందరి అభిప్రాయం మేరకు తగిన నిర్ణయం తీసుకొంటామని జవాబు చెప్పడం గమనిస్తే ఆ మార్పు స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే ఆయన ఈ పని ముందే చేసి ఉండి ఉంటే విమర్శలు ఎదుర్కొనే ఇబ్బంది తప్పేది.  

అయితే రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వ వాదనతో శివరామ కృష్ణన్ కమిటీ కూడా అంగీకరించింది కనుక విజయవాడ-గుంటూరు మధ్యనే రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికీ భావిస్తోంది. అయితే దానికి ఇప్పుడు సమన్యాయం, సమదూరం అనే కొన్ని సవరణలను జోడిస్తోంది. అక్కడ రాజధాని నిర్మించినట్లయితే అన్ని జిల్లాలకు సమదూరంలో ఉంటుందని, గనులు, దేవాదాయ, చేనేత, మత్స్య తదితర ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను, సంబంధిత జిల్లాలలోనే నెలకొల్పినట్లయితే అన్ని జిల్లాలకు సమన్యాయం చేసినట్లు ఉంటుందని మంత్రి నారాయణ తెలిపారు. ప్రభుత్వంలో వివిధ శాఖలకు చెందిన దాదాపు 900 కార్యాలయాలు ఉన్నాయని, వాటిలో ముఖ్యమయినవి తప్ప మిగిలిన అన్నిటినీ వివిధ జిల్లాలలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలో గణనీయమయిన ఈ మార్పు చాలా అభినందనీయమే.

రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే ఉంచి, వివిధ ప్రభుత్వ శాఖల ప్రధాన కార్యాలయాలను వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసినట్లయితే, ప్రభుత్వంపై ఆర్ధిక భారం ఉండదు. అధికార వికేంద్రీకరణ జరిగి రాష్ట్రంలో అన్ని జిల్లాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతాయి. రాజధాని కోసం మొదలయిన ఉద్యమాలు కూడా చల్లబడుతాయి. అప్పుడు రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు సేకరించే అవసరము తప్పుతుంది. ప్రస్తుతం తక్కువ పరిధిలో రాజధాని నిర్మించే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకొనట్లయితే, కేంద్రం ఇచ్చే నిధులతోనే నిర్మాణ కార్యక్రమాలు చెప్పట్టవచ్చును. ఆ తరువాత అవసరమనుకొంటే రాజధానిని కొద్ది కొద్దిగా విస్తరించుకోవచ్చును. ముందు అనుకొన్నట్లుగా రాజధానిని 20-25,000 ఎకరాలలో నిర్మించినట్లయితే దానంతటికీ అవసరమయిన నీటి సరఫరా కూడా కష్టమే అవుతుంది. అదే రాజదానిని చిన్నదిగా నిర్మించుకొన్నట్లయితే నీటి కొరతను కూడా అధిగమించవచ్చును.

ఏమయినప్పటికీ రాజధాని విషయంలో శివరామ కృష్ణన్ కమిటీ తుది నివేదిక ఇచ్చిన తరువాతనే దానిపై తుది నిర్ణయం తీసుకొంటామని మంత్రి నారాయణ చెప్పారు.  

By
en-us Political News

  
రాజ్యాంగబద్ధంగా రాని…ప్రజలు ఇవ్వని విపక్ష హోదా కోసం జగన్ పోరాడి ఉపయోగం లేదు. అయినా ప్రజా సమస్యలపై పోరాడడానికి ప్రతిపక్ష హోదా అవసరం ఏముందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఆ విషయాన్ని గుర్తించని, లేదా గుర్తించడానికి ఇష్టపడని జగన్.. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లుగా వ్యవహరిస్తూ.. పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తున్నారు
జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన  వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీనీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై వంశీ నోరు పారేసుకున్న తీరు  అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రశాంత్ కిశోర్ మాత్రం ఈ సారి ఇంట గెలవాలన్న కృత నిశ్చయంతో ముందుకు సాగారు. ఎందరో నేతలను అధికార పీఠంపై కూర్చోబెట్టగలిగిన తాను బీహార్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ద్వారా సత్తా చాటి.. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో... బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలోకి దిగి దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ప్రధాని మోడీ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. అంటే దాదాపు పుష్కర కాలం తరువాత.. ప్రస్తుతం బీజేపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోందనడానికి ఈ ఫలితాలు నిదర్శనం అంటున్నారు పరిశీలకులు.
సాధారణంగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు లేదా ఉప ముఖ్యమంత్రులు ప్రధానిని ప్రశంసించడం రివాజే. కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు, సహకారం కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎంతో దోహదపడతాయి. అయితే భోగాపురం వేదికగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రశంసల హద్దులు దాటిపోయాయన్నది పరిశీలకుల విశ్లేషణ.
ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయి పాలనా వ్యవహారాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతుండటంతో.. కుప్పం బాధ్యతలను ఆయన అర్థాంగి   నారా భువనేశ్వరి భుజానికెత్తుకున్నారు. తరచుగా కుప్పంలో పర్యటిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడంతో పాటు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మమేకమౌతున్నారు.  
పవన్ కల్యాణ్ కోసం గ2024 ఎన్నికలలో తన సీటును త్యాగం చేసి మరీ ఆయన విజయం కోసం పాటుపడిన వర్మకు.. పార్టీలో త్యాగానికి తగిన గుర్తింపు లభించలేదు. అయినా అదే పిఠాపురం వర్మ.. బొండా ఉమా విమర్శలపై మిగిలిన నేతలంతా మౌనంగా ఉండిపోయిన వేళ.. మీడియా సమావేశం పెట్టి మరీ బోండా ఉమాకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ కూడా జవాబుదారీ తనంగా చెప్పుకోవడం లేదు. ఇక దేశ యువత ప్రజా నిరసనలకు మోడీ సర్కార్ దిగి వచ్చిందని చెబుతున్నారు. అయతే ఒక్క వైసీపీ మాత్రమే బీజేపీ విషయంలో.. కాదు కాదు మోడీ విషయంలో రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తోంది.
బీజేపీకి ఆర్ఎస్ఎస్ మెంటార్ అన్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక విధానపరమైన నిర్ణయాల వెనుకా ఆర్ఎస్ఎస్ ఉంటుందని అందరూ అంగీకరిస్తారు. అయితే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆర్ఎస్ఎస్ ఆసంతృప్తిగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు.
ఈ ఆందోళనలకు నేరుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఐదేళ్ల పాలనలో వైసీపీ నిర్వాకాన్ని అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి సభలో ఎండగడుతుందన్న భయంతోనే జగన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లేందుకు జంకుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మావిగన్ ప్రతిపాదన పట్ల సాధారణ ప్రజల నుండి మద్దతు సంగతి అటుంచితే.. తీవ్ర వ్యతిరేకత రావడంతో జగన్ మళ్లీ మడమ తిప్పేశారు. మాట మార్చేశారు. నష్టనివారణ కోసం సీఆర్డీయేకు జై అంటూ మరోసారి నెట్టింట ట్రోలింగ్ స్టఫ్ గా మారిపోయారు.
ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాల ప్రకారం, ఏదైనా న్యాయస్థానం ప్రజాప్రతినిధులకు రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధిస్తేనే వారిపై అనర్హత వేటు పడుతుంది. అయితే ఈ నిబంధనను మరింత కఠినతరం చేస్తూ కేవలం 30 రోజుల జ్యుడీషియల్ కస్టడీ ఉన్నా పదవి కోల్పోయేలా మార్పులు చేయాలని కేంద్రం పెద్దలు భావిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.