పార్ట్ టైమ్ పాలిటిక్స్.. తాడేపల్లి ప్యాలెస్ ప్రెస్ మీట్స్!

Publish Date:Mar 13, 2026

Advertisement

 జగన్ పై నెటిజనుల ట్రోలింగ్ మామూలుగా లేదుగా?

జగన్ ప్రెస్ మీట్ అంటే మీమర్లకు పండగే పండగ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ వంటి నేత నభూతో న భవిష్యత్ అంటారు నెటిజనులు. ఎందుకంటే.. ట్రోల్ చేయడానికి జగన్ ఇచ్చే మెటీరియల్ అలాంటిది మరి. జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంటే 2014 నుంచి 2019 వరకూ ఆయన ఒక రెబల్ లీడర్ అన్న గుర్తింపు ఉండేది. ఆయన ఓదార్పు యాత్రలనో, పరామర్శ యాత్రలనో, పాదయాత్ర అనో నిత్యం జనంలో ఉండేవారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచే జగన్ ఇమేజ్ డ్యామేజ్ కావడం ఆరంభమైంది.

 ఐదేళ్ల కాలంలో అయనంతగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న మరో నాయకుడు లేరంటే అతిశయోక్తి కాదు. అధికారం ఉన్నది ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్ష సాధింపులకే అన్నట్లుగా వ్యవహరించేవారు. తన విధానాలపై విమర్శలు చేసే వారిని ఆగర్భ శత్రువుగా పరిగణించి కేసులు, అరెస్టులు దాడులతో  అణిచివేడమే అధికారానికి పరమార్ధం అని ఆయన భావించేవారా అన్నట్లుగా ఆ ఐదేళ్ల పాలనా సాగింది. సరే అంత వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ సహజంగానే 2024 ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయారు. ప్రజా తీర్పు ఆయనకు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా ఇవ్వకుండా పక్కన పడేసింది. సరే అధికారం కోల్పోయిన తరువాత ఆయన పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆయన ఏపీకి చుట్టపు చూపుగా వచ్చి.. రాష్ట్రంలో పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారు. వారంలో ఓ సారి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు.     తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో  జరిగిన చిన్న సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా ఆయన చేసిన ఈ రొజుకునన్ను వదిలేయండి అంటూ చేసిన వ్యాఖ్యపై నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.   

ఆ మీడియా సమావేశంలో జగన్  వివిధ రాజకీయ అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ వ్యూహాల గురించి ఆయన బోలెడు విషయాలు చెప్పారు. చివరిగా ఆయనను అప్పటి వరకూ చెప్పిన అంశాలను ఇంగ్లీష్ లో బ్రీఫ్ చేయమన్న ప్రశ్నకు ఆయన చిరునవ్వు నవ్వుతూ ఈ రోజుకు నన్ను వదిలేయండి అంటూ సమావేశాన్ని ముగించేశారు. దీంతో నెటిజనులు బ్రీఫ్ చేయమంటే సమావేశాన్నే ముగించేశారంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు.   పనిలో పనిగా ఆయన గతంలో దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో  అది చాలా పెద్ద ప్రశ్న అంటూ చేసిన వ్యాక్యను ఇప్పుడు మళ్లీ ప్రస్తావిస్తూ అప్పటి వీడియోను షేర్ చేస్తూ తెగ ట్రోల్ చేస్తున్నారు.    మొత్తంగా అధికారంలో ఉండగా ఒక్కటంటే ఒక్క మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే ధైర్యం చేయలేని జగన్ ఇప్పుడు అనివార్యంగా మీడియా ముందుకు వచ్చి అభాసుపాలౌతుండటంపై నెటిజనులు తెగ  సైటైర్లు వేస్తున్నారు.

By
en-us Political News

  
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
స్మ‌గ్ల‌ర్ వీర‌ప్ప‌న్ కూతురు విద్యారాణి తండ్రి అంత సంపాదిస్తే చందాలేసుకుని మ‌రీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏంటి?
అమరావతికి, అక్కడి ప్రజలకు వైసీపీ ఎన్నడూ వ్యతిరేకం కాదంటూ మాట్లాడారు. గతంలో తాము వ్యతిరేకించినది చంద్రబాబు నాయుడు చూపించిన గ్రాఫిక్స్ రాజధానే అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అప్పట్లో చంద్రబాబు చేసిన ఊహాజనిత సృష్టినే తాము వ్యతిరేకించామనీ, గ్రాఫిక్స్ అమరావతిపైనే అప్పటి తమ అభ్యంతరాలనీ చెప్పుకొచ్చారు.
మడమ తిప్పను, మాట తప్పను, విశ్వసనీయతకు నిలువెత్తు రూపం అంటూ గతంలో పదేపదే చెప్పుకున్న జగన్ ఇప్పుడు.. నిత్యం అసత్యాలను వల్లెవేస్తూ.. విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయారంటున్నారు.
గ‌త ఎన్నిక‌ల్లో అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌వితను అరెస్టు చేయ‌కుంటే ఈ రెండు పార్టీల మ‌ధ్య లోపాయికారీ ఒప్పందం ఉన్న‌ట్టేనని జ‌నం అనుకుంటారని అన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర‌రెడ్డి. ఈ కామెంట్ ఎంత‌గా ప‌ని చేసిందంటే రేసులో సెకండ్ ప్లేస్ లో ఉన్న‌.. బీజేపీని థ‌ర్డ్ ప్లేస్ లో ప‌డేసింది. చావుతప్పి క‌న్ను లొట్ట‌బోయిన‌ట్టు.. బొటాబొటిగా 8 మంది ఎమ్మెల్యేల‌తో స‌రిపెట్టుకుంది బీజేపీ.
పెరిగిన జనాభాకు అనుగుణంగా అసెంబ్లీ, లోక్ సభ స్థానాలను పెంచాలన్న డిమాండ్, ప్రతిపాదనా చాలా కాలంగా ఉంది. అంతే కాకుండా నియోజ‌క‌వ‌ర్గం ఎంత చిన్న‌గా ఉంటే.. ప్ర‌జా ప్ర‌తినిధులు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను అంత వేగంగా ప‌రిష్క‌రించ‌గ‌లుగుతారు. ఇక ప్రస్తత నియోజకవర్గాల పెంపు ప్రతిపాదన దాదాపు 30శాతం ఉంది. ఇది భారీ మార్పు అనే చెప్పాలి. అలాగే ఇందు కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఆ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రధాన ప్రతిపక్షం అయ్యుండీ ఎన్నికల సన్నాహాల విషయంలో ఇంత నిర్లప్తంగా, నిరాసక్తంగా వ్యవహరించడంతో పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. ఎన్నికలంటేనే స్టార్ క్యాంపెయినర్ల పర్యటనలు, అగ్రనేతల ప్రసంగాలతో నానా హడావుడీ చేసే కాంగ్రెస్ లో ప్రస్తుతం నమ్మశక్యంకాని నిశ్శబ్ధం తాండవిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.