నెల్లూరు కాంగ్రెస్ టిక్కెట్ కోసం సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు
Publish Date:Mar 13, 2012
Advertisement
నెల్లూరు లోక్ సభ స్థానానికి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. ఎక్కడ అవకాశం వస్తే అక్కడ డానికి అందిపుచ్చుకోవడంలో సిద్ధహస్తుడైన టి. సుబ్బిరామిరెడ్డి తాజాగా నెల్లూరులో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రెండుసార్లు టిటిపి చైర్మన్ గా, ఒకసారి కేంద్రమంత్రిగా పదవిని అలంకరించిన సుబ్బిరామిరెడ్డి వచ్చే సాధారణ ఎన్నికల్లో విశాఖనుంచి పోటీచేయాలన్న అభిమతాన్ని వ్యక్తం చేశారు. ఈలోగా నెల్లూరులో అవకాశం రావడంతో అక్కడినుంచే పోటీచేసి లోక్ సభకు వెళ్ళాలని ఆయన ఉబలాటపడుతున్నట్లు తెలిసింది. అయితే నెల్లూరు జిల్లాలో పాగా చేయాలంటే ముందుగా ఆనం సోదరులను ప్రసన్నం చేసుకోవాల్సిందే. అందుకే ఆయన ఆనం వివేకానంద రెడ్డితో ఫోన్ లో మాట్లాడేందుకు ఇటీవల పలుమార్లు ప్రయత్నించినట్లు తెలిసింది. సుబ్బిరామిరెడ్డి అభిప్రాయాన్ని ముందుగానే గమనించిన ఆనం వివేకానందరెడ్డి ఉద్దేశ్య పూర్వకంగానే ఆయనతో మాట్లాడ్డానికి ఇష్టపడటం లేదు. దీనికి మరో కారణం కూడా ఉంది. అధిష్టానం అనుగ్రహిస్తే నెల్లూరు నుంచి తానే పోటీచేయాలని ఆనం వివేకానందరెడ్డి యోచిస్తున్నారు. తాను ఒకవైపు నెల్లూరు నుంచి పోటీచేయాలనుకుంటుండగా మరో వైపు సుబ్బిరామిరెడ్డి తనకు పోటీగా వస్తే సహించేది లేదని ఆనం తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు తెలిసింది.
http://www.teluguone.com/news/content/nellore-congress-subbirami-reddy-24-12597.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





