నెల్లూరు సిటీ తెలుగుదేశం ఇన్ చార్జిగా నారాయణ- అనీల్ యాదవ్ పనైపోయినట్లేనా?

Publish Date:Jun 30, 2023

Advertisement

నారాయణ విద్యా సంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ  తెలుగుదేశం ఇన్ చార్జిగా పార్టీ నియమించింది. ఈ మేరకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. నారాయణ విద్యా సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాలలో విద్యావ్యాప్తికి దోహదపడిన ఆయన నవ్యాంధ్ర రాజధాని అమరావతి రూపకల్పన, నిర్మాణంలో అప్పటి  మునిసిపల్  శాఖ మంత్రిగా  కీలక పాత్ర పోషించారు.  

గత తెలుగుదేశం హయాంలో  మునిసిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పొంగూరు నారాయణ, నారాయణ విద్యాసంస్థల అధిపతి అన్న సంగతి విదితమే. 2014 ఎన్నికలలో తెలుగుదేశం విజయం కోసం విశేషంగా కృషి చేసిన నారాయణ.. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం తరువాత ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాకపోయినా చంద్రబాబు కేబినెట్ లో అత్యంత కీలకమైన మునిసిపల్ శాఖను నిర్వహించారు. అంతేనా  చంద్రబాబుఅత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జన రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక బాధ్యతలను అప్పగించారు. సీఆర్డీయే బాధ్యతలూ ఆయనే నిర్వహించారు.  అమరావతి అద్భుత రాజధానిగా రూపొందేందుకు అవసరమైన పునాదులు వేయడంలో చంద్రబాబుకు కుడి భుజంగా వ్యవహరించారు. అదలా ఉంచితే 2019 ఎన్నికలలో వైసీసీ విజయం సాధించి, జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత సీన్ మారిపోయింది.

అమరావతిని నిర్వీర్యం చేయడమే కాకుండా ఆ అమరావతి నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నారాయణపై జగన్ సర్కార్ కక్ష పూరితంగా వ్యవహరించింది. వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో, పార్టీలో కీలకంగా వ్యవహరించిన నారాయణ పార్టీకీ, రాజకీయాలకూ కూడా ఒకింత దూరమయ్యారు. కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడంతో ఆయన రాజకీయ యవనికపై పెద్దగా కనిపించలేదు. అయినా వైసీపీ ప్రభుత్వం ఆయనపై కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరించింది. ఆయన విద్యాసంస్థలపై దృష్టి సారించింది. టెన్త్ పేపర్ లీకేజీ సాకుతో ఆయనపై మరిన్ని కేసులు నమోదు చేసింది. అయితే ఆ కష్ట సమయంలో ఆయనకు తెలుగుదేశం అండగా నిలిచింది. కానీ అధికారంలో ఉన్నప్పుడు అందలం ఎక్కించిన పార్టీకి అధికారం కోల్పోగానే దూరమయ్యారన్న విమర్శలను నారాయణ ఎదుర్కొన్నారు.  

ఆ విమర్శలన్నిటినీ పంటిబిగువున భరించిన నారాయణ కేసుల దాడి నుంచి ఒకింత ఊరట లభించగానే.. మళ్లీ క్రియాశీలంగా మారారు.   2014 నుంచి 2019 వ‌ర‌కు.. నవ్యాంధ్రప్రగతిలో తన వంతు బాధ్యత నిర్వహించిన నారాయణ  నెల్లూరు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చారు. జిల్లా ప్రజల అభిమానానికి పాత్రులయ్యారు.

అటువంటి నారాయణను  జగన్ సర్కార్ టార్గెట్ చేసింది. అమ‌రావ‌తి, సీఆర్‌డీఏలో అక్ర‌మాలంటూ కేసులు పెట్టింది. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల‌పై ప్ర‌భుత్వ‌ దాడులు జ‌రిగాయి.  వాటన్నిటినీ తట్టుకుని నిలబడి మళ్లీ నెల్లూరు రాజకీయాలలో క్రియాశీలం అవుతున్నారు. స్థానికంగా మంచి పేరు ఉన్న నారాయణను నెల్లూరు సిటీ తెలుగుదేశం ఇన్ చార్జిగా నారాయణను  ప్రకటించడం ద్వారా స్థానికంగా బలమైన బీసీ నేతగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ కు తెలుగుదేశం చెక్ పెట్టిందనే చెప్పాలి. 

By
en-us Political News

  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.