Publish Date:Mar 24, 2026
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పొత్తుపొడుపులు కొలిక్కి వస్తున్నాయి. ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతృత్వంలోని జాతీయ ఎన్డీయే మధ్య ఇంత కాలం కుదరని సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. సోమవారం (మార్చి 23) చెన్నైలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కూటమి.. ఏయే పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్న విషయాన్ని వెల్లడించింది. కూటమిలోని పార్టీలు పోటీ చేసే సీట్ల వివరాలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. సీట్ల సర్దుబాటుపై తాము పూర్తి సంతృప్తితో ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.
వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది. ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే టీవీకే అధినేత విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ అన్నాడీఎంకేను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నది పరిశీలకుల విశ్లేషణ.
మొత్తానికి ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుపాట్లు ముగిసి ఏకాభిప్రాయం సాధ్యమైంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో అన్నాడీఎంకే సింహభాగం సీట్లను తన వద్దే ఉంచుకుంది. ఆ పార్టీ 178 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 27 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గత ఎన్నికలలో ఇదే పొత్తులో భాగంగా బీజేపీ కేవలం 20 స్థానాలలో మాత్రమే పోటీ చేసింది. ఈ సారి మరో ఏడు స్థానాలను అదనంగా దక్కించుకుంది. ఇక కూటమిలోని ఇతర పార్టీలలో, అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని పీఎంకే 18 స్థానాల్లోనూ, టీటీవీ దినకరన్ సారథ్యంలోని ఏఎంఎంకే11 స్థానాలలోనూ పోటీ చేస్తుంది. అదలా ఉంటే పీఎంకేలో చీలిక వచ్చింది. ఆ పార్టీ అధినేత రామదాసు తన వర్గంతో కలిసి శశికళ కూటమితో చేతులు కలపడం ఆసక్తి కరంగా మారింది. ఇక పోతే.. అధికార డీఎంకే కూటమిలో సీట్ల సీట్ల సర్దు ‘పాట్లు’ ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రస్తుతం తమిళట డీఎంకే కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే, విజయ్ టీవీకే పార్టీ, శశికళ కూటముల మధ్య చతుర్ముఖ పోటీ ఉన్నప్పటికీ.. అందరి ఆస క్తీ టీవీకే ఈ ఎన్నికలలో చూపే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరుగుతాయి. మే 4న ఫలితాలు విడుదల అవుతాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nda-seat-sharing-compleated-39-216058.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.