బాలయ్య షోకు షర్మిల.. చంద్రబాబు వ్యూహమేనా?

Publish Date:Nov 4, 2022

Advertisement

ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణతో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ సీఎం వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల.. త్వరలో భేటీ కానున్నారు. ఔను నిజమే.. షర్మిల బాలకృష్ణలు భేటీ అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇది నిజంగా సంచలన వార్తే. అయితే వారిరువురూ కలుసుకునేది రాజకీయ వేదిక మీద కాదు.  నందమూరి బాలకృష్ణ  ఓటీటీలో చేస్తున్న అన్‌స్టాపబుల్ షో కు చీఫ్ గెస్ట్ గా షర్మిల హాజరు కానున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సీజన్ 2 నడుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా 1995 అగస్టులో తెలుగుదేశం సంక్షోభానికి సంబంధించి కీలక వివరాలు, నాడు ఎన్టీఆర్ పై పార్టీ తిరుగుబాటుకు దారి తీసిన పరిస్థితుల గురించి సంచలన వివరాలను చంద్రబాబు వెల్లడించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు స్వయాన సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల హాజరు కానున్నారన్న సంగతి తెలుగు రాష్ట్రాలలో ఆ షో పట్ల విపరీతమైన ఆసక్తి పెంచేసింది.    

సీఎం జగన్ కు స్వయాన బాబాయ్, మాజీ మంత్రి  వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐకీ  షర్మిల  వాంగ్మూలం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై జగన్ ఫైర్ అయ్యారనీ వార్తలు వినవస్తున్నాయి. వివేకా హత్య కేసు విషయంలో తన సోదరుడు జగన్ కు ఇష్టం లేకపోయినా షర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన సంగతి విదితమే. వివేకా హత్య తమ కుటుంబంలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొన్న షర్మిల.. తన బాబాయ్ ని హత్య చేసిన వారూ, అందుకు కారకులు ఎవరో అందరికీ తెలియాలి, వారికి శిక్ష పడాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా కడప ఎంపీ సీటు కోసమే తన బాబాయ్ హత్య జరిగిందని, ఇది వాస్తవమని ఆమె ఢిల్లీలో మీడియాముఖంగా చెప్పారు.

ఈ నేపథ్యంలోనే షర్మిలపై ఏపీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంతో రగలిపోతున్నారని రాజకీయ వర్గాలలో ముఖ్యంగా వైసీపీ వర్గాలలో వినిపిస్తోంది. అలాగే   తెలంగాణలో షర్మిల..  సుదీర్ఘ పాదయాత్ర ఇప్పటికే 3000 కిలోమీటర్ల మైలు రాయిని దాటింది. తన యాత్ర పొడవునా అమె తెలంగాణలో  అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడమే కాకుండా... తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కోట్లాది రూపాయిల అవినీతి మేట వేసిందంటూ.. ఢిల్లీకి వెళ్లీ మరీ సీబీఐకి సైతం ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఏ విషయమైనా నిర్భయంగా మాట్లాడతారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బాలయ్య టాక్ షోలో షర్మిల మరిన్న సంచలన విషయాలు వెల్లడిస్తారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. దీంతో షర్మిల పాల్గొనబోయే ఎపిసోడ్ కోసం అంతా ఆసక్తిగా చేస్తున్నారు.

మరో వైపు తన అన్నపై వ్యతిరేకతతో షర్మిల ఏపీలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కాగా కొందరు మాత్రం బాలయ్య టాక్ షోకు షర్మిల రావడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు వ్యూహమా అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు.  మొత్తం మీద షర్మిల బాలయ్య షోకు హాజరు కావడం ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హాట్ టాపిక్ గా మారిపోయింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరుకు చేరుకోవడంతో యలహంక ప్యాలెస్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగంలో లోతైన సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
మత్తుపదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నషా ముక్త్ భారత్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని సినీ నటుడు ప్రభాస్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
ఇద్దరు ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు.
అంతర్జాతీయ దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఇటీవల గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడిదారులు, కొనుగోలుదారుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
బుల్లితెర ప్రేక్షకులను నవ్వించే జబర్దస్త్ కమెడియన్లు దొరబాబు, రైజింగ్ రాజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బంగారం ధరలు భారీగా పడిపోవడంపై ఢిల్లీకి చెందిన చాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపింది.
తాళి కట్టిన 24 గంటల్లోనే బిడ్డకు జన్మ..అసలు కథేంటి.?
సర్వదర్శనానికి 8 గంటల సమయం.!
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.