నరవణె పుస్తకం.. ప్రభుత్వ అనుమతి లేకుండానే గ్లోబల్ మార్కెట్ లోకి!?
Publish Date:Feb 12, 2026
Advertisement
కుట్రకోణంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు భారత మాజీ సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవణె రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రభుత్వ అనుమతి లేకుండానే గ్లోబల్ మార్కెట్ లోకి విడుదల కావడం వెనుక కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నరవణే పుస్తకం విడుదల విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్‌ను ఓవర్ కమ్ చేయడానికే ప్రభుత్వ అనుమతి లేకుండానే గ్లోబల్ మార్కెట్ లో విడుదల చేశారనీ అంటున్న పోలీసు వర్గాలు ఈ విషయంలో నేరపూరిత కుట్ర అభియోగాలు మోపింది. పుస్తకం అధికారికంగా ప్రచురించలేదనీ, దాని పీడీఎఫ్ కాపీని ఆన్ లైన్ లో ఉంచారని అంటున్నారు. ముఖ్యంగా అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ పుస్తకం విస్తృతంగా ఎలా సర్క్యులేట్ అయ్యిది? దీని వెనుక ఉన్న కుట్రకోణం ఏమిటన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా కార్యాలయానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ పుస్తకంలోని కొన్ని భాగాలను ప్రస్తావించేందుకు ప్రయత్నించడంతో ఈ వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ప్రచురితం కాని పుస్తకాన్ని ఉటంకించడం నిబంధనలకు విరుద్ధమని అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. మరోవైపు, పుస్తకం ఇంకా తమ వద్ద ప్రచురణ కాలేదని, సర్క్యులేషన్‌లో ఉన్న కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని ప్రచురణ సంస్థ పుస్తక ప్రచురణ సంస్థ పెంగ్విన్ రాండమ్ హౌస్ స్పష్టం చేసింది. ఇదే ప్రకటనను నరవణె కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో, సైనిక సిబ్బంది పుస్తకాలు రాసే విషయంలో రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు నోటీసులు
http://www.teluguone.com/news/content/naravane-book-into-global-market-without-government-permission-36-213928.html





