సీఐ మహేందర్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
Publish Date:Jun 8, 2026
Advertisement
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి. ఒక క్రిమినల్ కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన వ్యక్తి, అలాగే అతని కుటుంబ సభ్యుల నుంచి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేసినట్లు రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక కేసులో ఒక వ్యక్తి(ఫిర్యాదుదారుడు) అరెస్టై జైలులో ఉన్న సమయంలో ఫిర్యాదుదా రుడి తండ్రిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన ఇన్స్పెక్టర్ మహేందర్, “మీ కుమారుడిని కస్టడీలో వేధించకుండా చూస్తాను.. బెయిల్ కూడా సులభంగా వచ్చేలా సహకరిస్తాను” అంటూ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కుమారుడి భద్రతపై ఆందోళనతో ఆ మొత్తాన్ని చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా మహేందర్ పలుమార్లు సంప్రదించినట్లు రిమాండ్ కాపీలో వెల్లడైంది. బెయిల్‌పై బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత తన తల్లి ఆరోగ్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లిన సమయంలో పోలీస్ స్టేషన్‌కు రావాలని మహేందర్ పదేపదే ఫోన్ చేసినట్లు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కలిసిన సమయంలో, అతని భార్య బ్యాంకు ఖాతా నుంచి మరో నిందితుడికి జరిగిన లావాదేవీలను ప్రస్తావిస్తూ ఆమెను కూడా కేసులో అరెస్టు చేస్తానని బెదిరించినట్లు ఆరోపించారు. ఈ ఒప్పందంలో భాగంగా 2026 ఏప్రిల్ 28న జూబ్లీహిల్స్‌లోని దస్పల్లా హోటల్ వద్ద రూ.2 లక్షలు, అనంతరం మరో సమావేశంలో అదనపు మొత్తాన్ని చెల్లించినట్లు ఫిర్యాదుదారుడు ఎసీబీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మిగిలిన మొత్తాల కోసం కింది స్థాయి సిబ్బందితో పదేపదే ఫోన్ కాల్స్ చేయించి వేధింపులకు గురిచేసినట్లు కూడా ఆరోపించాడు. వేధింపులు అధికమవడంతో ఫిర్యాదుదారుడు ఎసీబీని ఆశ్రయించాడు. అనంతరం ఎసిబి అధికారులు ప్రత్యేక పరికరాల సహాయంతో ఫిర్యాదుదారుడు, ఇన్స్పెక్టర్ మహేందర్ మధ్య జరిగిన సంభాషణలను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేసినట్లు రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. అలాగే నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు వాస్తవ మేనని సీఐయూ ఇన్స్పెక్టర్ సమర్పించిన వెరిఫికేషన్ నివేదికలో నమోదు చేసినట్లు వెల్లడైంది. ఫిర్యాదుదారుడు అందజేసిన ఆడియో, వీడియో రికార్డింగ్స్, వాటి ట్రాన్స్క్రిప్ట్లు, ఇతర ఆధారాలను పరిశీలించిన ఎసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఇన్స్పెక్టర్ మహేందర్‌ను అరెస్టు చేసినట్లు రిమాండ్ కాపీలో పేర్కొన్నారు. అయితే, రిమాండ్ కాపీలో పేర్కొన్న వివరాలు దర్యాప్తు సంస్థ కోర్టుకు సమర్పించిన ఆరోపణలు మాత్రమే. ఈ కేసులోని ఆరోపణలపై తుది నిర్ణయం కోర్టు విచారణ అనంతరం వెలువడాల్సి ఉంది.
అప్పటికే ఆమె ప్రసవించి ఐదు నెలల పసికందుతో ఉన్నప్పటికీ, లావాదేవీ గురించి ఆమెకు ఎలాంటి అవగాహన లేదని ఫిర్యాదుదారుడు వివరించినట్లు రిమాండ్ కాపీలో ఉంది. అయినప్పటికీ, ఆమెపై చర్యలు తీసుకుంటానంటూ ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం తనను కార్యాలయ గది నుంచి పోలీస్ స్టేషన్ బాల్కనీలోకి పిలిచి, భార్యను అరెస్టు చేయకుండా ఉండాలంటే భారీ మొత్తం చెల్లించాలని మహేందర్ డిమాండ్ చేసినట్లు ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. అంతేకాకుండా, తన పైఅధికారి అయిన ఏసీపీ రూ.30 లక్షలు అడుగుతు న్నారని చెబుతూ పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ఫిర్యాదుదారుడు నిరాకరించడంతో, మరో ఇన్స్పెక్టర్ వద్ద ఉన్న వేరే కేసులో కూడా నిందితుడిగా చేర్పిస్తానని బెదిరించినట్లు వాంగ్మూలంలో వివరించాడు. చివరకు రూ.7 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు రిమాండ్ కాపీలో నమోదు చేశారు.
http://www.teluguone.com/news/content/ci-mahender-remand-report-36-222279.html





