Publish Date:Feb 12, 2026
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక విడుదల చేసింది. గత ఏడాది ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే హస్తం ఉందని ఆ నివేదిక కుండబద్దలు కొట్టింది. , అలాగే జేఈఎం ఉగ్రసంస్థ మహిళలతో ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించింది. ఐరాస భద్రతా మండలికి చెందిన ఆల్-ఖైదా, ఐసిస్ ఆంక్షల పర్యవేక్షణ బృందం రూపొందించిన ఈ నివేదికలో 2025 నవంబర్ 9న ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన దాడి వెనుక ఉన్నది జేఈఎం ఉగ్రసంస్థేనని పేర్కొంది.
జైషే చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజార్ 2025 అక్టోబర్ 8న జమాత్ ఉల్-ముమినత్ పేరుతో మహిళా విభాగాన్ని అధికారికంగా ప్రకటించాడనీ, ఉగ్రవాద దాడులకు మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఈ మహిళా ఉగ్ర విభాగం ఏర్పాటైందని పేర్కొంది. ఈ నివేదిక మరో సంచలన విషయాన్ని కూడా వెల్లడించింది. జేఈఎం ఉగ్ర సంస్థ నిర్వీర్యమైపోయిందని పాకిస్థాన్ (పేరు ప్రస్తావించకుండా, ఒక సభ్యదేశం అని పేర్కొంది) చేసిన ప్రకటన పూర్తి అవాస్తవం అని ఐరాస నివేదిక విస్పష్టంగా పేర్కొంది. జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ ఇప్పటికీ చురుకుగా కార్యకలాపాలు సాగిస్తోందని, అంతర్జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందని ఐరాస నివేదిక పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jem-has-a-special-terror-wing-with-women-36-213929.html
పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్ స్టేజ్‌కు చేరాయి.
మాజీ మంత్రి, వై.ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB)కి చెందిన ఇన్‌స్పెక్టర్ బి. మహేందర్‌కు సంబంధించిన ఎసీబీ (ACB) రిమాండ్ కాపీలో పలు సంచలన అంశాలు వెలుగుచూశాయి.
తెలంగాణ వ్యాప్తంగా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థను మరింత బలో పేతం చేసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లోని SMS-1 విభాగంలో భారీ పేలుడు సంభవించింది.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో అత్యంత విచిత్రమైన, సమాజాన్ని నివ్వెరపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆహార భద్రత, ప్రజారోగ్య పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్న H-FAST (Hyderabad Food Adulteration Surveillance Team) బృందం మృగశిర కార్తి రోజున భారీ ఆపరేషన్ నిర్వహించారు.
కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన బీటెక్ విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతమైంది.
క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించబడింది.
నేటి ఆధునిక కాలంలో ఐదెంకల జీతం వస్తే జీవితం ఎంతో విలాసవంతంగా ఉంటుందని చాలా మంది భావిస్తారు.
ఇద్దరు మేజర్లు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాలు కలిగి ఉండటం చట్టప్రకారం నేరం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెంగిచెర్ల ఎంఎల్ఆర్ కాలనీకి చెందిన రసూల్ జాకబ్ 2024లో అల్వాల్‌కు చెందిన మేఘనను వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులు భారీగా కట్నకానుకలు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు తలెత్తడంతో పరిస్థితి దిగజా రింది. రోజురోజుకీ గొడవలు పెరిగిపోతూ ఉండడంతో మేఘన ఈ క్రమంలో జాకబ్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.