వైసీపీకి అభ్యర్థులే లేరు!
Publish Date:Feb 28, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నికలు కావడంతో.. ప్రధాన పార్టీలన్ని గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వేధింపులు, బెదిరింపులకు దిగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో నామినేషన్ వేసిన టీడీపీ అభ్యర్థులను బెదిరించి.. తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలాస మున్సిపాల్టీలో టీడీపీ నుంచి నామినేషన్ వేసిన నలుగురు అభ్యర్థులు వైసీపీలో చేరారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోనూ టీడీపీ ముఖ్య నేతలు అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. అధికార వైసీపీ తీరుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారని భావించిన టీడీపీ అభ్యర్థులను ముందుగానే పార్టీలో చేర్చుకుంటున్నారని సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. వైసీపీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరన్నారు. అందుకే టీడీపీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి అధికార పార్టీలో చేర్చుకుంటున్నారని లోకేష్ మండిపడ్డారు. పలాస, రాయదుర్గంతో పాటు రాష్ట్రమంతా పోటీకి అభ్యర్థులు లేని దిక్కులేని పార్టీ వైసీపీ అంటూ నారా లోకేష్ కామెంట్ చేశారు. అలాంటి పార్టీకి అధినేత అయిన సీఎంజగన్ తాడేపల్లి నివాసం నుంచి బయటికి వస్తే జనం తంతారని భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైసీపీ అభ్యర్థులకు జనాల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయం అన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ పీకమీద కత్తి పెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారు... నువ్వొక నాయకుడివి, నీదొక పార్టీ... అందుకే నిన్ను పిరికివాడు అనేది అంటూ జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు నారా లోకేష్.
http://www.teluguone.com/news/content/nara-lokesh-hot-comments-on-ycp-cm-jagan-39-110869.html





