వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకన్నా ఘోరం!
Publish Date:Dec 24, 2020
Advertisement
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రంగా స్పందించారు. మరోవైపు తాడిపత్రిలో హై టెన్షన్ కొనసాగుతోంది. తన ఇంటిపై జరిగిన దాడిపై స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దాడులకు భయపడేది లేదని చెప్పారు. రండిరా చూసుకుందాం అంటూ ఆయన వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. జేసీ ఇంటిపై స్వయంగా ఎమ్మెల్యేనే తన అనచురులతో వచ్చి దాడి చేయడం దుమారం రేపుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని తెలియడంతో టీడీపీ కార్యకర్తలు, ఆయన అనుచురులు అక్కడికి భారీగా చేరుకుంటున్నారు. పోలీసులు కూడా అదనపు బలగాలను మోహరించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన తాడిపత్రిలో నెలకొంది.
వైసీపీ ఎమ్మెల్యేలు వీధి రౌడీలకంటే ఘోరంగా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో ఆయన ఇంటిపైనా, కార్యకర్తలపైనా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విట్టర్ ద్వారా చెప్పారు నారా లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన రౌడీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే, వైసీపీ రౌడీలకు కచ్చితంగా తామే బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. నాయకుల ఇళ్లపై దాడి చేసి, కార్యకర్తలను కొట్టి హీరోలమంటూ విర్రవీగుతున్నారని, వారి తల పొగరు అణచివేస్తామని లోకేశ్ ఘాటు హెచ్చరికలు చేశారు. టీడీపీ అధికారంలోకి రావడం, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లించడం ఖాయమని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/nara-lokesh-fire-on-jagan-jc-house-attack-39-108109.html





