రాష్ట్రపతి ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్

Publish Date:Apr 13, 2026

Advertisement

 

కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి లోకేశ్ వివరించారు.

 

 

అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్‌తో పాటు ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆమెకు వివరించారు.

 

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోకేశ్, ఎంపీలతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనను ఇంటెలిజెంట్, విజనరీ నాయకుడిగా అభివర్ణించారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. అందుకు కృషి చేసిన చంద్రబాబు నాయుడిని అభినందించారు.

 

 

రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకోగా, సోమవారం ఆమెతో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ, అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి ప్రశంసించారని తెలిపారు.ఇక ఢిల్లీలో ఈ నెల 30 నుంచి మే 10 వరకు నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు.
 

By
en-us Political News

  
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.