వైసీపీలో నాని సీన్ అయిపోయిందా?.. బేలమాటలు అందుకేనా?!

Publish Date:Mar 9, 2024

Advertisement

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోడాలి నానికి భవిష్యత్తు దర్శనం బాగానే అయినట్లుంది. అందుకే.. ఇవే తన చివరి ఎన్నికలంటూ... ఆయన.. తన నియోజకవర్గ ప్రజలకు చాలా సాఫ్ట్‌గా.. కాదు కాదు బేలగా చెబుతున్నారు. ఎలాగోలా గెలిపించి పుణ్యం కట్టుకోండంటూ అన్యాపదేశంగా బతిమలాడుకుంటున్నారు.  నిన్న మొన్నటి వరకు అది అసెంబ్లీ అయినా, మీడియా సమావేశమైనా ఎక్కడైనా, ఎప్పుడైనా నాని నోరెత్తారంటే..  ఆడు చెప్పాడా?.. ఈడు చెప్పాడా? ఆ డమ్మా మొగుడు చెప్పాడా? అంటూ బండ బూతులతో చెలరేగిపోయేవారు. అలాంటి నాని నోట సాఫ్ట్ గా ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బేలగా ఇవే నా చివరి ఎన్నికలు వంటి మాటలు రావడం చూస్తుంటే ఆయనకు ఏదైనా బోధివృక్షం కనిపించిందా? దాని కింద కూర్చోవడంతో జ్ణానోదయం అయి తత్వం బోధపడి బొమ్మకనిపించిందా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నాయి.  

రానున్న ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి మండల హనుమంతరావు పేరును పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే  గుడివాడ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.  ఇటీవల గుడివాడ పట్టణంలో... రాత్రికి రాత్రే నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మండల హనుమంతరావు అంటూ భారీ ఫ్లెక్సీలు   వెలిశాయి. ఈ హాఠాత్  పరిణామంతో కొడాలి నాని వర్గం ఒక రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అంతే కాదు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.   దాంతో ఈ అంశాన్ని నాని  తాడేపల్లి ప్యాలెస్‌  పెద్దలకు తెలియజేశారు. ఇక వారి నుంచి  వచ్చే సమాధానం కోసం ఆయన, ఆయనతో పాటు ఆయన వర్గం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే    కొడాలి నాని  నిర్వేదంలో కూరుకుపోయి.. ఇవే తన చివరి ఎన్నికలంటూ మాట్లాడారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఇప్పటికే గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి.. 2014, 2019లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా  గెలుపోందారు.  2019లో  జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన కేటినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా కొడాలి నాని  ఎలా వ్యవహరించారో.. ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే. దీంతో   పౌరసరఫరాల శాఖ మంత్రి కాదు.. బూతు సరఫరాల శాఖ మంత్రి అంటూ  కొడాలి నానిపై సోషల్ మీడియాలో  నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేశారు.  
అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కొడాలి నాని ఇప్పుడు ఇలా  చాలా సాఫ్ట్‌గా.. ఇంకా చెప్పాలంటే.. తనకు వయస్సైపోయిందనీ,  53 ఏళ్లతాను ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే.. 58 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా ఉంటానని.. ఆ తర్వాత అంటే.. 2029 ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా  తన కుమార్తెలు రాజకీయాల్లోకి రారని క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. తన రాజకీయ వారసుడిగా తన తమ్ముడు కొడాలి చిన్ని కుమారుడు వచ్చే అవకాశం ఉందంటూ సంకేతం ఇచ్చారు. మొత్తం మీద కొడాలి నాని బేల మాటలు వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందన్న సంకేతాలు ఇస్తున్నాయన్న చర్చ జోరందుకుంది. 

అదీకాక కొడాలి నాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే ఓ ప్రచారం ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వెళ్తున్న దృశ్యాలు సైతం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆ క్రమంలోనే కొడాలి నాని ఇవి తనకు చివరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.   

ఏదీ ఏమైనా మిర్చిలాగా ఎప్పుడు హాట్ హాట్‌ కామెంట్స్ చేసే కొడాలి నాని.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇవే తనకు చివరి ఎన్నికలనీ.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ.. చాలా సాఫ్ట్‌గా మాట్లాడడం చూస్తుంటే.... ఎక్కడో ఏదో తేడా కొడుతుందని.. కానీ అది అంతగా అంతు బట్టకుండా ఉందనే ఓ చర్చ సైతం గుడివాడ నియోజకవర్గంలో వైరల్ అవుతోంది. అదీకాక ఇప్పటికే ఇదే డైలాగ్ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వాడారని.. కృష్ణాజిల్లా వాసులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. 

మరోవైపు తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన పాడి కౌశిక్ రెడ్డి.. కమలాపుర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ..  మీరు ఓటు వేసి దీవిస్తే.. 4వ తేదీన ఎమ్మెల్యేగా జైత్ర యాత్ర చేస్తా.. లేకుంటే శవయాత్ర చేసుకుంటాం... మా కుటుంబ సభ్యులం ముగ్గురు ఆత్మహత్య చేసుకంటామంటూ ఓ సెంట్‌మెంట్ ఆయుధాన్ని ఉపయోగించి.. ఎమ్మెల్యేగా ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారని... ఈ తరహా ట్రిక్స్‌ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఉపయోగించే అవకావం ఉందనే ఓ చర్చ సైతం వైరల్ అవుతోంది. అదీకాక కొడాలి నాని.. తన రాజకీయ వారసుడిని సైతం ఈ సందర్బంగా చెప్పకనే చెప్పారనే ఓ చర్చ సైతం నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తోంది.

By
en-us Political News

  
మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన ఒక్క పెద్ద పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న ఉపాధి వనరులను పొరుగు రాష్ట్రాలకు తరిమేశారని సువేరా మండిపడ్డారు. అమరరాజా, లూలూ గ్రూప్, జాకీ వంటి దిగ్గజ సంస్థలను కక్షపూరిత రాజకీయాలు, ఆర్థిక వేధింపులతో రాష్ట్రం సరిహద్దులు దాటించారని విమర్శించారు.
రమణమూర్తి గతంలో తిరుమలలో అన్నమయ్య నివాసాన్ని తొలగించినప్పుడు జరిగిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారనీ, చినజీయర్ స్వామి వంటి ప్రముఖులతో కలిసి హిందూ ధర్మ ప్రచారంలో నడిచిన చరిత్ర రమణమూర్తిది అని భరద్వాజ చెప్పారు. అయితే, హిందూ మతం వేరు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే హిందుత్వ వేరు అంటూ రమణమార్తి ఇటీవల పలు సందర్భాలలో తన అభిప్రాయాలు వ్యక్తం చేశారన్న భరద్వాజ.. ఈ నేపథ్యంలోనే ఆయన గొంతు నొక్కడానికి పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగిందని చెప్పారు.
ముంబై కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ తరువాత కోలుకున్న జగన్ తొలి పర్యటనకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకోవడం రాజకీయంా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇలా ఉండగా పవన్ రాక సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు, శ్రేణులు భారీ ఏర్పాటు చేశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ప్రధాని పదవిని ఎవరికీ కేటాయించలేదు. అయితే త్వరలో జరగబోయే క్యాబినెట్ విస్తరణలో ఈ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ విజయసాయి చెప్పిన జోస్యం ఇప్పుడు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
బీఆర్ఎస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న యువ సంగ్రామ సభకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్ వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది. గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి. ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.