జగన్ పాలనపై జనసేన గరంగరం

Publish Date:Jul 4, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనపై జనసేన పార్టీ మరోసారి నిప్పులు చెరిగింది. ఈ జగన్ పాలనలో ఏ వర్గం సురక్షితంగా ఉందో చెప్పాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ నాదెండ్ల మనోహర్ సవాల్ విసిరారు. సోమవారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వ పాలనపై మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న.. స్పందన కార్యక్రమానికి స్పందనే లేదని వ్యంగ్యంగా అన్నారు. అలాగే జగనన్నకు చెబుదామనే కార్యక్రమాన్ని చేపట్టారని.. చెబితే వినేవారు లేరని.. ఇప్పుడు తాజాగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారని.. పాలకుల్లో స్పందించే గుణం లేనప్పుడు ఏ కార్యక్రమం అయితే ఏముందని ఆయన జగన్ అండ్ కోని సూటిగా ప్రశ్నించారు. అలాగే అర్హత ఉన్న లబ్దిదారులకు సైతం పథకాలు అందడం లేదని ఈ జగన్ ప్రభుత్వమే స్పష్టం చేస్తుందని.. ఇది దేనికి సంకేతమని ఆయన ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. వైయస్ జగన్   ఈ నాలుగేళ్ల పాలన అద్బుతమని అంటారని.. అలాంటప్పుడు ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ఎందుకు పెట్టారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జగనన్న సురక్ష కార్యక్రమంలో చోటు చేసుకొంటున్న వ్యవహారాలపై ఈ సందర్భంగా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మీరు ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఎక్కడ ఉంది? ఏం చేస్తుందంటూ జగన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పుకొంటున్నట్లు.. మీ పాలన అద్బుతంగా ఉంటే.. వారాహి యాత్ర చేపట్టిన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో సమస్యలు చెప్పుకొనేందుకు అంత మంది ఎందుకు వచ్చారని నిలదీశారు.  అమ్మఓడి బటన్ నొక్కినా.. నేటికి కొంత మంది ఖాతాల్లో ఆ పథకం తాలుకు నగదు జమ కాలేదని.. దీనికి సమాధానం ఏం చెబుతారంటూ.. జగన్ పార్టీ నేతలను ఆయన నిలదీశారు. అలాగే మీరు హాజరయ్యే సభలకు కోట్లాది రూపాయిల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారని.. హెలికాప్టర్లు వినియోగిస్తారని.. అంతేకానీ... క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలను మాత్రం పట్టించుకోకుండా గాలికొదిలేశారంటూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో రహదారుల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆ క్రమంలో మలికిపురంలో పవన్ కల్యాణ్ హెచ్చరికతోనే రాజోలులోని రహదారి పనులు ప్రాంభించారని ఆయన వివరించారు. 151 మంది ఎమ్మెల్యేలు, ఇంత మంది యంత్రాగాన్ని పెట్టుకొని.. ఎందుకు సరైన పాలన అందించ లేకపోతున్నారని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ని సూటిగా  ప్రశ్నించారు. 

జనసేన చేపట్టిన జనవాణి కార్యక్రమంలో ఫించన్లు, రహదారుల సమస్యలపైన ఫిర్యాదులు అధికంగా వచ్చాయని చెప్పారు. అలాగే మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో దివ్యాంగుడికి 75 రూపాయిల ఫెన్షన్ వచ్చేదని.. ప్రస్తుతం అతడు విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటాయని పెన్షన్ నిలుపు చేశారని పేర్కొన్నారు. ఇలా పదుల సంఖ్యలో దివ్యాంగులు పవన్ వద్ద తమ సమస్యలు చెప్పుకొన్నారన్నారు.. తహశీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల వరకు స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారని.. మరి స్పందించే గుణం లేనప్పుడు స్పందన కార్యక్రమం ఎందుకు అని ప్రశ్నించారు. అయినా ఇప్పటి వరకు ఎన్ని సమస్యలపై స్పందించారంటూ జగన్ ప్రభుత్వానికి నాదేండ్ల మనోహర్ సూటిగా ప్రశ్నించారు. 

వైసీపీ మ్యానిపెస్టోలో 99 శాతం పూర్తి చేశామని చెబుతున్నారని.. మరి స్పందన సరిపోదని జగనన్నకు చెబుదామని వ్యంగ్యంగా అన్నారు. ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని.. జగనన్న వినడు, ఎమ్మెల్యేలు వినరు... అధికారులు అంతకంటే వినరన్నారు. మరి ప్రజలు.. తమ బాధలను ఎవరికి చెప్పుకోవాలంటూ సందేహం వ్యక్తం చేశారు. గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో   ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పించన్ల ఇచ్చే క్రమంలోనే కాదు.. రైతుల వద్ద సైతం లంచాలు తీసుకొంటున్నారని విమర్శించారు. ఈ ముఖ్యమంత్రి పాలనలో ఎవరూ సురక్షితంగా లేరని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
 
పవన్ కల్యాణ్.. ఇటీవల చేపట్టిన వారాహీ యాత్ర అద్భుతంగా సాగిందన్నారు. 10 కిలోమీటర్ల మేర.. ఇంత పెద్ద బహిరంగ సభలు ఇంత వరకు ఎవరు పెట్టలేదన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఆశీర్వదిస్తుంటే.. తట్టుకోలేక ఆయనపై విమర్శలకు దిగుతున్నారని.. వ్యవస్థలోని లోపాలపై పవన్ కల్యణ్ విమర్శలు చేస్తే.. ఆయనపై వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ విమర్శించే అంశాలపై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇవ్వరని.. ముగ్గురు, నలుగురు మంత్రుల చేత పవన్‌ని తిట్టిస్తారని ఆయన చెప్పారు. 

రాబోయే రోజుల్లో పవన్ కల్యాణ్... అన్ని జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి... ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తారని స్పష్టం చేశారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ బాధ్యతను ఆయన ప్రజలకు గుర్తు చేస్తారన్నారు. ఈ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసిందని.. జనసేన తిరిగి వెలుగులు నింపుతోందన్నారు.  వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం .. అందరూ కలిసి కట్టుగా ముందుకు వచ్చి నిలబడాలని ప్రజలకు నాదెండ్ల మనోహర్ పిలుపు నిచ్చారు.

By
en-us Political News

  
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.