చక్రం తిప్పుతున్న సి.ఎం. సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి
Publish Date:May 9, 2012
Advertisement
తిరుపతి ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు. ఆయన తిరుపతిలో ఒక క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజూ రాత్రి నియోజకవర్గంలోని పరిస్టితులను తన సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డికి వివరిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుడు, తాజామాజీ మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు ఎంపిక అవటంతో ఆయన రాజీనామా చేయటం వల్ల తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికలు అనివార్యమైన విషయం అందరికీ తెలిసిందే. ఈ స్తానలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు మంత్రి గల్లా అరుణకుమారి తన తనయుడు జయదేవ్ పేరును ప్రతిపాదించారు. ఢిల్లీ స్థాయిలో భారీ లాబీయింగ్ నడిపారు. అయితే మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ పేరును అధిస్థానం ఖరారు చేసింది. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఎవరూ పనిచేయకుండా అస్మదీయులను బుజ్జగించే బాధ్యతను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన భుజంపై వేసుకున్నారు. అందులో భాగంగానే తన సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని ఈ పనిలో పెట్టారు. ముందుగా కిశోర్ కుమార్ రెడ్డి టిక్కెట్టు ఆశిచిన జయదేవ్, మబ్బు చెంగారెడ్డి, ప్రజారాజ్యం పార్టీ విలీనంతో కాంగ్రెస్ లో చేరిన పసుపులేటి హరిప్రసాద్, ఎమ్మార్ పల్లి మాజీ సర్పంచి మమత, టౌన్ బ్యాంక్ అధ్యక్షుడు పులిగోరు మురళి ప్రభృతులను ఎలా బుజ్జగించాలో సమీక్షించారు. తరువాత కొందరికి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణతో ఫోను చేయించారు. తనకు మద్దతు ఇవ్వాలని వెనకతరమణ కోరిన తరువాత కిశోర్ కుమార్ రెడ్డి వారిని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇలా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి తరుపున కిశోర్ కుమార్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు.
http://www.teluguone.com/news/content/nkiran-kumar-reddy-brother-n-kishore-kumar-reddy-24-13915.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





