ఉమా-వంశీ మధ్య సయోధ్య అసాధ్యమా?
Publish Date:May 9, 2012
Advertisement
కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ కార్యకర్తల్లో వల్లభనేని వంశీ పట్ల నిరసన వ్యక్తం కావడాన్ని దేవినేని ఉమ సన్నిహితులు లోలోపల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశంపార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు, మైలవరం శాసన సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, అర్బన్ తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు వల్లభనేని వంశీ మోహన్ లు ఒకే పార్టీ కార్యాలయంలో కూర్చుంటున్నప్పటికీ భార్యాభర్తలు ఒక ఇంటిలో వుండి ఇష్టంలేని కాపురం చేస్తున్న తరహాలోనే కొనసాగుతున్నారు. దుడుకు స్వభావం కలిగిన వంశీ అనేక సందర్భాలలో కృష్ణాజిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని ఉమాను టార్గెట్ చేయాలని ప్రయత్నం చేశారు. చల్లపల్లిలో ఎన్.ట్.ఆర్. విగ్రహావిష్కరణ సందర్భంగా హరికృష్ణకు అవమానం జరిగిందనే అంశంతో పాటు మద్యం దుకాణాల లైసెన్స్ ల వ్యవహారం సందర్భంగా అభిప్రాయభేదాలు బహిర్గతమయ్యాయి. ఎంతోకాలంగా జిల్లా రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తెలుగుదేశంపార్టీలో దేవినేని ఉమ తిరుగులేని పట్టుసాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన సోదరుడు, మాజీమంత్రి దేవినేని రాజశేఖర్ తో వంశీ మాటల యుద్ధానికి దిగిన సమయంలో నెహ్రూను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా దూషించడం ఉమాకు మనస్తాపం కలిగించింది. దేవినేని ఉమ, వంశీ ఇరువురూ ఒకే పార్టీ కార్యాలయంలో ఉంటూనే ఎవరి మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నారు. వీరిద్దరి మధ్యా తిరిగి సయోధ్య అసాధ్యమని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ప్రస్తుతం వంశీ జగన్ ను పలుకరించడం, ఆలింగనం చేసుకోవడంపై గందరగోళం నెలకొనడం, దీనిపై వంశీకి తెలుగుదేశంపార్టీ షోకాజ్ నోటీస్ జారీ చేయడం దేవినేని వర్గానికి ఆనందంగా మారింది.
http://www.teluguone.com/news/content/krishna-district-24-13914.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





