Publish Date:Aug 16, 2024
మార్గదర్శి లాంటి మచ్చలేని సంస్థ మీద బురద జల్లే ప్రయత్నం చేసిన లాయర్ ముష్టి శ్రీనివాసరావు ప్రస్తుతం కటకటాలు లెక్కబెడుతున్నాడు. రామోజీరావును వేధించడం కోసం జగన్ విజయవాడకు చెందిన న్యాయవాది ముష్టి శ్రీనివాసరావును ఒక పావులా వాడుకున్నాడు. రామోజీరావు మీద, మార్గదర్శి మీద ఈ ‘ముష్టి’ కేసు పెట్టినప్పుడు ఇతనికి అప్పట్లో భారీ స్థాయిలో గౌరవ మర్యాదలు లభించాయి. లేటెస్ట్.గా ఆయన తన ఇంట్లో పేకాట క్లబ్ నిర్వహిస్తూ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జగన్ రాక్షస ప్రభుత్వంలో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన కాంతి రాణా టాటా ఈ ‘అ’న్యాయవాదికి అతి మర్యాదలు చేసేవారు. ఆయన వస్తుంటే.. లేచి నిలబడి మరీ వినయాన్ని ప్రదర్శించేవారు. మార్గదర్శి చిట్స్ మీద చేసిన తీవ్ర ఆరోపణల్లో ఈ న్యాయవాది కీరోల్ ప్లే చేసేవాడు. ప్రెస్‌మీట్లు పెట్టేవాడు. అది కూడా విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్‌తో కలిసి. అలాంటి లాయర్ తన ఇంట్లోనే పేకాట క్లబ్ ఏర్పాటు చేసుకోవడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ దాడిలో ‘ముష్టి’తోపాటు జూదం ఆడుతున్న మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొదట పారిపోయిన ముష్టి శ్రీనివాసరావు ఆ తర్వాత తానే వచ్చి పోలీసులకు లొంగిపోయాడు.
ముష్టి శ్రీనివాసరావు మార్గదర్శిలో చేరి, చిట్ వాయిదాలు సక్రమంగా చెల్లించలేదు. చిట్ పాడుకున్న తర్వాత డబ్బు పొందడానికి అవసరమైన ష్యూరిటీలు సమర్పించలేదు. అందువల్ల మార్గదర్శి అతనికి డబ్బు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాను చిట్టీ పాడితే మార్గదర్శి డబ్బులు ఇవ్వలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కంప్లైంట్ కాపీని పట్టుకొని మార్గదర్శి మీద కేసు నమోదు చేయడంతో పాటు.. అతడ్ని పక్కన పెట్టుకొని విజయవాడ సీపీ ప్రెస్ మీట్ పెట్టటమే కాదు.. అతను ప్రెస్ మీట్‌కి వచ్చినప్పుడు లేచి నిలబడి.. సాదరంగా ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకున్న వైనాన్ని జనం ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. రామోజీరావు లాంటి పెద్దమనిషి చికిత్స తీసుకుంటునప్పుడు పోలీసులు వేధించడానికి కారణమైన ఈ వ్యక్తికి ఇంకా శాస్తి జరగాల్సి వుందని అనుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/musti-srinivasa-rao-arrest-39-183075.html
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు.
ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.