Publish Date:Nov 15, 2025
తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసి .. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ అనే సీఐ హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు. దీంతో సతీశ్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. మృతుడు సతీష్ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సిట్ ఎదుట హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శుక్రవారం (నవంబర్ 14)న మరణించి రైలు పట్టాలపై పడి ఉన్నారు. దీంతో ఆయనది అనుమానాస్పద మృతిగా అందరూ భావించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపీయులు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. రైలు ఢీకొనడం వల్ల చనిపోయారన్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఉండటంతో పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో సతీష్ ది హత్యే అని తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.
అయితే వైసీపీ మాత్రం దర్యాప్తు అధికారులు, తెలుగుదేశం నేతల వేధింపుల కారణంగానే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నది. అలాగే సతీష్ ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది.
టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకరరెడ్డి అయితే.. ఈ ఆరోపణలు, డిమాండ్ లతో చేసిన అతి వికటించింది. అత్యంత కీలకమైన కేసులో ఫిర్యాదుదారు, సాక్షి అయిన ఓ పోలీసు అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మామూలుగా అయితే ఆయన హత్యకు గురయ్యారు అని వైసీపీయులు ఆరోపణలు చేయాలి. కానీ.. అసలు ఆయన ఎలా చనిపోయారు అన్నది ఇంకా తేలక ముందే ఆత్మహత్య అంటూ నిర్ధారించేసి ఆరోపణలు గుప్పించడం చూస్తుంటూ.. గతంలో అంటే వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు తొలుత గుండెపోటు అంటూ ప్రచార చేసిన విధానం గుర్తుకు వస్తున్నది. ఇక భూమన అయితే.. ఓ దర్యాప్తు అధికారిని కూడా టార్గెట్ చేసి బెదిరించేలా ఆరోపణలు గుప్పించడం పలు సందేహాలకు తావిస్తున్నది. గతంలో వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కూడా వైసీపీయులు ఇలాగే టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించడం, కేసులు పెట్టడం తెలిసిందే.
ఇప్పుడు విషయానికి వస్తే అప్పట్లో టీటీడీ విజిలెన్స్ లో పని చేస్తున్న సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకే పరకామణి చోరీ కేసు నమోదు అయింది. తర్వాత ఆయనపై ఒత్తిడి తెచ్చి కేసు రాజీ చేయించారు. ఎవరు అలా చేశారన్నది సిట్ కు ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. ఆ వాంగ్మూలం ఇచ్చేందుకు వెడుతున్న సమయంలోనే సతీష్ మరణించారు. ఇక్కడే సతీష్ మృతి వెనుక ఈ కేసులో నిందితులుగా ఉన్న వారి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/murder-case-registerd-in-satish-death-36-209563.html
గోదావరి జలాల పంపిణీ అంశాన్ని పునఃసమీక్షించేందుకు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్‌ను నియమించాలని చంద్రబాబు ఈ భేటీలో కేంద్ర మంత్రిని కోరనున్నారు. అలాగే గోదావరి నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న సమ్మక్క సారలమ్మ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని ఆయన విజ్ఞప్తి చేయనున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. నెలరోజులలోనే రెండు లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం నిజంగా చారిత్రాత్మకమని చెప్పవచ్చు.
సత్యవేడులో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన యూనిట్‌ను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చంద్రబాబు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది.
మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ముసాయిదా నివేదికను (డీపీఆర్) ఈ సందర్భంగా అధికారులు మంత్రుల ముందు ఉంచారు.
మనుషులు, స్తంభాలు, ఇతర నిటారుగా ఉన్న వస్తువుల నీడలు వాటి పాదాల కిందకే పరిమితమై.. బయటకు కనిపించవు. ఈ పరిస్థితి ఒకటి రెండు నిముషాల పాటు ఉంటుంది.
ఈ కాల్పుల విరమణ ఒప్పందం విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సామాజిక మాధ్యవ మేదిక ట్రూత్ ద్వారా ప్రకటించారు. ఈ ఓప్పందం యుద్ధం ముగింపు దిశగా కీలక పురోగతి అని ఆయన పేర్కొన్నారు.
Fin Allen Sixers Fest in Delhi, easy, win, over, dc, ipl2026, 4th, concicutive
ఘటన సమయంలో ఇంటి పై అంతస్తులో ఇద్దరు పిల్లలు ఉండగా, తనూజ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారు.
ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికాలో నివసించే ఎన్ఆర్ఐ ధర్మేంద్ర అనే వ్యక్తిని ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి సుమారు రూ.కోట్లు తీసుకున్నారంటూ.. బాధితుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఈ కేసు సినీ, సోషల్ మీడియా వర్గాల్లో చర్చనీ యాంశంగా మారింది.
హైకోర్టులో ఒక పిటిషన్ విచారణ సందర్భంగా జూనియర్ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఆ సమయంలో జడ్జి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన కొంత అసహనానికి గురయ్యారు. ఆ క్రమంలో న్యాయవాది తన గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించారంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూ.. అక్కడే ఉన్న పోలీసులను పిలిచి ఆ జూనియర్ అడ్వకేట్ ను 24 గంటల పాటు కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు.
ఏపీలో పెట్టుబడుల వాతావరణం పండుగలా సాగుతోందన్న ఆయన రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనీ, తద్వారా రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను లభించే అవకాశాలు దండిగా ఉంటాయన్నారు.
తనపై నమోదైన మోసం కేసులో దర్యాప్తును నిలిపివేయాలని, స్టే మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికీ, కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులను ఆదేశించడానికీ తిరస్కరించింది.
అమెరికాకు చెందిన యుఎస్ఎస్ బాక్సర్ అనే యుద్ధనౌక హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తుండగా.. ఇరాన్‌కు చెందిన ఒక డ్రోన్ ప్రమాదకర రీతిలో నౌకకు అత్యంత సమీపంలోకి వచ్చింది. సుమారు వెయ్యి గజాల దూరంలోకి వచ్చిన ఆ డ్రోన్.. నౌకలోని సిబ్బందికి, నౌక భద్రతకు ముప్పుగా మారుతుందని గుర్తించిన అమెరికా దళాలు వెంటనే అప్రమత్తమయ్యాయి.