ప్రభుత్వ టీచర్ కి రూ. 20 వేలు ఫైన్ ఎందుకో తెలుసా..?
Publish Date:May 25, 2021
Advertisement
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. చెట్లు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవి అని చెప్పుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం చెట్లను పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం అందరికి తెలిసిందే.. ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖులు కూడా చెట్లు నాటండి అని తోటి నటీనటులకు ఛాలెంజ్ చేస్తున్నారు.. ఆ ఛాలెంజ్ తీసుకున్న వాళ్ళు కూడా చెట్లను నాటుతున్నారు. ఇంతకీ ఈ చెట్ల గోల ఏంటని అనుకుంటున్నారా.. మీరే చూడండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం పథకం క్రింద మహాశక్తి నగర్, వీధి నెం. 2 లో 4 ఏళ్ల క్రితం నాటిన గుల్ మొహర్ చెట్టును దొంతి నర్సింహా రెడ్డి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎలాంటి అనుమతి లేకుండా నరికివేశారు. దీనిపై హరితాహారం పర్యవేక్షకుడు ఐలయ్య ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఉపాధ్యాయుడిపై కమిషనర్ జరిమానా విధించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రమణాచారి మాట్లడుతూ.. సదరు ఉపాధ్యాయుడు బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నా ఇలా చేయడం తగదని వ్యాఖ్యానించారు. చెట్ల ప్రాముఖ్యతను విద్యార్థులకు బోధించి వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సింది పోయి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ఏంటని ప్రశ్నించారు. ఈ చర్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అని కమిషనర్ మండిపడ్డారు. దీనికి బదులుగా ఆయనకు ఏకంగా రూ.20 వేల జరిమానా విధించారు. చెట్టును అనుమతి లేకుండా కొట్టేసినందుకు గానూ మున్సిపల్ కమిషనర్ ఈ జరిమానా విధించారు. పర్యావరణ అనుమతి లేకుండా ఈ పని చేసినందుకు గానూ టీచర్ మరో 50 చెట్లు నాటాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
కొత్త మంది చెట్లను నాటకపోగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు. ఆ నరికేసిన వాళ్ళు ఏ అక్షరం రానివాళ్లు అయితే పరవాలేదు.. బడిలో పిల్లలు పాఠాలు చెప్పాల్సిన టీచర్ చెట్లను నరికాడు.. తెలియనివాడు తప్పు చేస్తే క్షమించొచ్చు.. మరి తప్పు చెయ్యొద్దని బుద్దులు చెప్పే బడి పంతులు ఇలాంటి పనిచేస్తే ఎలా చెప్పండి.
http://www.teluguone.com/news/content/municipal-commissioner-fines-a-governament-teacher-39-116242.html





