పరాజయం నుంచే అద్భుతాలు మొదలవుతాయి

Publish Date:May 28, 2019

Advertisement

మన దృష్టి సాధారణంగా మనలో ఉన్న బలాల మీద కాకుండా బలహీనతల మీదే ఉంటుంది. ఆ బలహీనతల వల్ల ఏర్పడిన పరాజయాల మీదే ఉంటుంది. కానీ ఫెయిల్యూర్ ఎదుర్కొన్న ప్రతిసారీ... దాని నుంచి ఏదన్నా నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తే... అదే మన విజయానికి దారితీస్తుంది. అందులో మన బలం కూడా ఎక్కడో దాగి ఉందని తెలుస్తుంది. నమ్మడం లేదు కదూ! కావాలంటే ముక్తామణి కథ వినండి...

 

ఈ కథ 1989లో మొదలవుతుంది. అప్పట్లో మణిపూర్‌లో ముక్తామణి అనే ఆవిడ ఉండేది. ముక్తామణి కుటుంబం తీవ్రమైన పేదరికంలో ఉండేది. ఆ కుటుంబానికి పూట గడవడమే కష్టంగా ఉండేది. పేదవాడి కష్టాలకి కొదవ ఉండదు కదా! అలా ఓ రోజు ఆమె రెండో కూతురు చిరిగిపోయిన షూస్‌తో ఇంటికి వచ్చింది. ఆ షూస్ అప్పటికే చిన్న చిన్న రిపేర్లతో బాగుపడే పరిస్థితిని దాటిపోయాయి.

కూతురు షూస్ చూసిన ముక్తామణికి ఏం చేయాలో పాలుపోలేదు. ఒకపక్క తినడానికే డబ్బు లేదు. ఇక కొత్త షూస్ ఎక్కడి నుంచి తీసుకువస్తుంది. ఇక చేసేదేమీ లేక... చివరికి ఆ షూస్ చుట్టూ వులెన్ దారంతో అల్లింది. కానీ ఆ తల్లీకూతుళ్ల మనసులో ఒకటే అనుమానం. మర్నాడు టీచర్ ఏం తిడతారో అని! యూనిఫాంతో సరిపోని షూస్‌ని చూసి టీచర్ తప్పకుండా తిట్టిపోస్తుందని వాళ్ల భయం. ఆ భయంతోనే ముక్తామణి కూతురు మర్నాడు స్కూళ్లో అడుగుపెట్టింది. కానీ విచిత్రం! టీచర్ ఆ అమ్మాయిని తిట్టలేదు సరికదా... వాటిని ఎవరు అల్లారో కనుక్కొంది. అంతేకాదు- ‘మా పాపకి కూడా ఇలాంటి షూస్ అల్లిస్తుందేమో మీ అమ్మని కనుక్కో!’అంది.

తిట్టు వినపడతాయనుకునే చోట ప్రశంసలు కనిపించడంతో ముక్తామణి సంతోషానికి హద్దు లేకపోయింది. దాంతోపాటే ఆమెలో ఆ ఆలోచన కూడా మొదలైంది- ‘తను వులెన్ దారంతో షూస్ అల్లగలదు కదా! దాన్నే ఓ వృత్తిగా చేసుకుంటే ఎలా ఉంటుంది?’. ఆ ఆలోచన ప్రస్తుతం ‘ముక్తా షూ ఇండస్ట్రీ’కి దారి తీసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఈ ముప్ఫై ఏళ్లలో ముక్తామణి వెయ్యిమందికి పైగా ఉపాధి కల్పించింది. ఆవిడ కంపెనీలో తయారయ్యే షూస్‌ ఇప్పుడు ఆస్ట్రేలియా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ లాంటి దేశాలకు ఎగుమతి కూడా అవుతున్నాయి. ముక్తా సాధించిన విజయాలకి లెక్కలేనన్ని అవార్డులు కూడా దక్కాయి. ఈమధ్యే ‘ద టెలిగ్రాఫ్‌’ పత్రిక ఆవిడను ‘True Legends Awards 2018’తో సత్కరించింది. ఇంత ఎదిగినా కూడా ముక్తామణిలో కొంచెం కూడా గర్వం కనిపించదు- ‘నాతో పాటు అలుపెరగకుండా పనిచేసేవాళ్ల సాయం ఉండబట్టే, ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతారు.’

- Nirjara

By
en-us Political News

  
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి...
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు...
ప్రతి వ్యక్తి జీవితం గురించి చాలా ఆలోచిస్తారు.  తమ జీవితం ఎలా ఉండాలో,  ఎలా ఉంటే బాగుంటుందో అని చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు.  సరిగ్గా గమనిస్తే.. కొందరు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని అంటూ ఉంటారు...
తల్లిదండ్రులు పిల్లలు ఎంత పెద్దైనా వారు చిన్నవారిగానే కనిపిస్తారు అని  అంటుంటారు.  కానీ ఈ రోజుల్లో తల్లిదండ్రులు,  పిల్లల మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీనికి   అతిపెద్ద కారణం  చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు..
ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు  అన్ని ఆనందాలను పొందాలని,  జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటారు. తమ పిల్లలు తమలాగా కష్టాలను పడకూడదని అనుకుంటారు.  అందుకే నేటికాలంలో మేము కష్టాలు...
డబ్బు మనిషి జీవితానికి చాలా అవసరం.  డబ్బు లేని జీవనం దుర్బరంగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో పేద వారు మరీ అంత ఇబ్బందులలో ఉండరు...
వాలెంటైన్స్ డే ప్రతి ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరుపుకుంటారని అందకీ తెలిసిందే. అయితే ఫిబ్రవరి 14కు ముందు వారం రోజుల నుండే వాలెంటైన్  హడావిడి మొదలవుతుంది.  వారం రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేక దినంగా పరిగణిస్తూ..
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు...
రవాణా ప్రజల జీవితాలలో ఎంతో ముఖ్యమైనది. రోడ్డు రవాణా చాలా సహజంగా అందరికీ తెలిసేది,  కనిపించేది. కానీ  వాయు రవాణా, జల రవాణా ప్రజల నివాసాలకు దూరంగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా వేల సంవత్సరాల..
ఏదైనా సంబంధానికి పునాది నిజాయితీపై ఆధారపడి ఉంటుందని చాలామంది చెబుతారు.  భాగస్వామి నుండి ఏదీ దాచకుండా ఉండటం, ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి అని అనడం చూస్తుంటాం.  భాగస్వామితో ప్రతి చిన్న విషయాన్ని..
ఫిబ్రవరి అంటేనే వాలెంటైన్స్ డే గుర్తుకు వస్తుంది. మనసులోనే తమ ప్రేమను దాచుకున్న ఎందరో ప్రేమికులు తమ మనసు విప్పే సమయమిది.  అయితే చాలా మంది తమ ప్రేమను వ్యక్తం చేయడానికి ఏదో ఒక బహుమతి కొని ఆ బహుమతి...
స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటీషు పాలనలో భారతీయుల పరిస్థితి ఎంతో ధీనంగా ఉండేది. భారత పౌరులు అందరూ బ్రిటీషర్లకు బానిసలుగా మారారు.  కానీ భారతదేశంలో ఎందరో వీరులు ఈ బానిసత్వం నుండి దేశానికి విముక్తి కలిగించాలని...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.