కాంగ్రెస్ మెడ మీద గుదిబండలు

Publish Date:Nov 14, 2015

Advertisement



పాతాళానికి పడిపోయిన కాంగ్రెస్ పార్టీ తిరిగి నిలదొక్కుకుని తలెత్తి చూడాలంటే ఎన్నెన్నో సమస్యలు. తల ఎత్తనివ్వకుండా మెడమీద ఎన్నో గుదిబండలు. వంద సంవత్సరాలకు పైగా వున్న చరిత్ర వున్న కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలకు పైగా చరిత్ర వున్న నాయకులు ఎందరో వున్నారు. తలలు పడిపోయిన నాయకులు మాత్రమే కాదు... నడవటానికి కూడా వీలు లేని వృద్ధ నాయకులు ఎంతోమంది వున్నారు. వాళ్ళు ఏ సమయంలో ఎలాగైనా మాట్లాడగలరు. తమ వ్యాఖ్యలతో ప్రజలను మాత్రమే కాదు.. పార్టీని కూడా ఇబ్బంది పెట్టగలరు.  కానీ ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ లైట్‌గా తీసుకుంటుంది... అదే కాంగ్రెస్ పార్టీలో వున్న విచిత్రమైన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు మాత్రం దీనిని అంతర్గత ప్రజాస్వామ్యం అనుకుంటూ వుంటారు. అలా అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ వున్న వేలాది మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులలో అందరూ ఎమ్మెస్ అని పిలుచుకునే ఎం.సత్యనారాయణ కూడా ఒకరు. చాలాకాలంగా రెస్టు తీసుకుంటున్న ఆయన ఇప్పుడు మళ్ళీ బయటకి వచ్చి చేసిన కామెంట్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసేలా మారాయి.

వరంగల్ ఉప ఎన్నికల పోరులో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా విజయం సాధించాలని తంటాలు పడుతోంది. పార్లమెంటు తలుపులు మూసీ, ఎంపీలను చావబాది మరీ తెలంగాణ ఇచ్చినప్పటికీ తమకు తెలంగాణలో అధికారం రాలేదన్న బాధలో టీ కాంగ్రెస్ వుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజల్లో వున్న వ్యతిరేకతను ప్రజలకు భూతద్దంలో చూపించి వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నికలలో విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతోంది. అసలే బలమైన అభ్యర్థి అనుకున్న రాజయ్య కుటుంబ సమస్యల కారణంగా జైల్లో పడ్డాడు. ఆయన స్థానంలో సర్వే సత్యనారాయణను పట్టుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పాలన బాగుందని అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎమ్మెస్ చేసిన వ్యాఖ్యలు టీ కాంగ్రెస్ నాయకుల నెత్తిన పిడుగులా మారాయి. ఓవైపు తామంతా టీఆర్ఎస్‌ని ఎండగడుతూ వుంటే, ఎమ్మెస్ చాలా ప్రశాంతంగా టీఆర్ఎస్ పాలన బాగుందని అనడం వరంగల్ ఓటర్ల మీద బాగా ప్రభావం చూపించే అవకాశం వుందని భయపడుతున్నారు. ఇలా మాట్లాడారంటూ ఎమ్మెస్ మీద అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఒరిగేదేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని సస్సెండ్ చేసిన ఆయన పెద్దగా ఫీలయ్యేది కూడా ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వరంగల్ గండం నుంచి గట్టెక్కేది ఎలా దేవుడా అని టీ కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకున్నారు.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.