Publish Date:Jun 20, 2022
ఈ రోజుల్లో చాలామంది యువతీ యువకులు చదువుకోవడానికి వీలుగా, కాలేజీలకు దగ్గరి ప్రాంతాల్లో అద్దె ఇళ్లల్లో వుండడం పరిపాటి. కుంటుంబాలు కూడా తమ పిల్లలకు రవాణా ఇబ్బందులు లేకుండా వుండేం దుకు సాధ్యమయినంతవరకూ కాలేజీలకు, స్కూళ్లకు దగ్గరి ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లలో వుంటున్నారు. ఇది ప్రతీ పట్టణంలోనూ సాధారణంగా కనిపించే సీన్. చదువు అయి వెళ్లేటపుడో, పోనీ వేరే ప్రాంతానికి వెళ్లవలసినపుడో ఆ ఇంటి యజమానికి చెల్లించవలసిన అద్దె, కరెంటు బిల్లు ఏమన్నా వుంటే పూర్తిగా చెల్లించి మరీ వెళతారు. ఆంధ్రా తెలంగాణా విడిపోయిన తర్వాత ఆంధ్రా ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె ఇళ్లలో వున్నాయి. స్వంత భవనాలు ఇంకా లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఇంకా కొన సాగుతోంది.
అలా వున్నదే నంద్యాల జిల్లా పాములపాడులోని ఎమ్మార్వో కార్యాలయం. దీన్ని గురించి ప్రత్యేక ప్రస్థా వన దేనికంటే .. ఈ కార్యాలయానికి కొత్త భవనం ఏర్పాటయింది. కానీ కార్యాలయం వస్తువులు, ఫైళ్లు ఫర్నీచర్ మాత్రం అక్కడికి మార్చే పరిస్థితి లేకుండా పోయింది. కారణం ఇప్పటి వరకూ అద్దెకున్న భవ నానికి ప్రభుత్వం అద్దె కట్టలేదట! మరి అద్దె కట్టకుంటే యజమాని కాగితం కదలనిస్తాడా? మరి ప్రభు త్వం ఈ సాధారణ నియమాన్ని నిర్లక్ష్యం చేయడమేమిటి?
పాములపాడులో ఎమ్మార్వో కార్యాలయం వున్న భవనానికి ఇంతవరకూ అద్దే చెల్లించలేదట. ప్రభుత్వం ఏర్పాటయిన సుమారు నాలుగేళ్ల నుంచి ఆ భవనానికి అద్దెగా ఒక్క పైసా ఇవ్వలేదని భవనం యజమాని ప్రశాంత్ ఆరోపిస్తున్నాడు. ఆయనకు రూ.3,65,868 రూపాయలు చెల్లించాలి. ఆ మొత్తం చెల్లిస్తేనే ఇక్కడ నుంచి వస్తువులు బయటికి వెళతాయని తెగేసి చెప్పేడు. అంతేకాదు భవనానికి ఏకంగా తాళం వేసేసేడు. ఈ రహస్యమేమీ తెలియని ప్రజలు ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి అక్కడ తాళం వేసి వుండడం చూసి ఖంగారు పడ్డారు. జగన్ పాలనలో ఇలాంటి కామెడీలు కూడా జరుగుతున్నాయన్నది వారికి తెలియడానికి చాలా సమయమే పట్టింది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mro-office-locked-for-not-paying-rent-39-138030.html
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమైంది. ఇందులో అధికార డీఎంకే కూటమి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు, వృద్ధులు వినియోగించుకున్న ఓట్లు డీఎంకేకే అనుకూలంగా పడ్డాయి. ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో పోస్టల్ బ్యాలెట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి మంచి ఆరంభాన్ని అందుకున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు మరోసారి విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేశాయి.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది.
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు.
ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.