కలిసిపోయిన రేవంత్, కోమటిరెడ్డి! కాంగ్రెస్ కథ మారినట్టేనా.. 

Publish Date:Jun 4, 2021

Advertisement

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై రాజేందర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రగతి భవన్ టార్గెట్ గా ఈటల చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా మారాయి.

ఈటల కమలం గూటికి చేరుతుండటంతో కాంగ్రెస్ నేతలు కూడా అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. విభేదాలు పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది.  కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు టి కాంగ్రెస్ నేతలప. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఈ బృందంలో  ఉన్న ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి క్లోజ్ మూవ్అయ్యారు. ఇద్దరు నేతలు రాజ్ భవన్ దగ్గర కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకోవడం చాలామంది నేతల దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. టీపీసీసీ చీఫ్ ఎంపికపై మాట్లాడారు. త్వరలోనే కొత్త టీపీసీసీ చీప్ ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు. తమలో ఎవరికి ఆ పదవి దక్కినా.. అంతా కలిసే పని చేస్తామని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవని కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. 

టీపీసీసీ చీఫ్ పదవి కోసం కొంత కాలంగా తీవ్ర పోటీ నెలకొంది. మరో వారం రోజుల్లో టీపీసీసీ ఎంపికపై క్లారిటీ వస్తుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ పదవి ఆశిస్తున్న వారిలో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ వంటి వాళ్లు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ రెడ్డి సామాజికవర్గానికి ఈ పదవి ఇవ్వాలని భావిస్తే.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇవ్వాలని అన్నారు. ఇక కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం తాను టీపీసీసీ రేసులో ఉన్నానని చెబుతున్నారు. కాంగ్రెస్ నేతల వర్గపోరుతో ఈసారి పీసీసీ చీఫ్ ను ప్రకటిస్తారా లేద వాయిదా వేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి.

అయితే రాజ్ భవన్ లో కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి కలిసి తిరిగిన తీరు, తర్వాత వెంకట్ రెడ్డి మాట్లాడిన మాటలతో.. పీసీసీ విషయంలో ఆ ఇద్దరు ఒక అవగాహనకు వచ్చారనే చర్చ జరుగుతోంది. ఎవరికి పదవి వచ్చినా కలిసి పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బీజేపీ దూకుడు పెంచినందున అంతా కలిసి పని చేసి వాళ్లకు చెక్ పెట్టాలని హస్తం నేతలు భావిస్తున్నారట. కేసీఆర్ సర్కార్ పై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, బీజేపీ కంటే ముందుంటే.. అది తమకు లాభిస్తుందని, అధికారం ఈజీగానే వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనాలు వేసుకుంటున్నారని సమాచారం. చూడాలి మరీ.. హస్తం నేతల మధ్య ఐక్యత ఎంతకాలం ఉంటుందో..

By
en-us Political News

  
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.