Publish Date:Feb 27, 2026
ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవితకు డిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం నిస్సందేహంగా ఆమెకు నైతిక విజయం అని చెప్పవచ్చు. ఈ కేసులో తాను నిరపరాధినని తొలి నుంచీ కవిత చెబుతూనే వస్తున్నారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆమె మాటలే వాస్తవమని నిరూపించింది. మద్యం కుంభకోణం కేసులో తనకు క్లీన్ చిట్ ఇస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించినందుకు కవిత కృతజ్ణతలు తెలిపారు.
కోర్టు తీర్పుపై మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో తాను టార్గెట్ అయ్యానన్నారు. తాను రాజకీయ బాధితురాలినని, ఎవరిమీదో ఉన్న అక్కసుతో తనపై ఈ కేసు అన్యాయంగా బనాయించి జైలుకు పంపారని కవిత అన్నారు. ఆమె వ్యాఖ్యలు పరోక్షంగా బీఆర్ఎస్ అగ్రనాయకత్వంపై విమర్శలుగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఢిల్లీ మద్యం కేసులో తాను రాజకీయ పావుగా మారానని చెప్పిన ఆమె.. అప్పుడే ఈ కేసు నుంచి తాను పులు కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
తాను కొత్త పార్టీ పెట్టడానికి సరిగ్గా నెలల ముందు వచ్చిన ఈ తీర్పు దేవుడి ఆశీర్వాదమని చెప్పారు. ఈ తీర్పుతో మరింత ఉత్సాహంగా ప్రజలలోకి వెడతానని చెప్పారు. ఈ కేసు విషయంలో తనకు ముందు నుంచి మద్దతు తెలిపి వారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో అప్పట్లో ఈ కేసు విషయంలో తనకు బీఆర్ఎస్ నుంచి ఎటువంటి మద్దతూ అందలేదని విమర్శించారు. త్వరలోనే బీఆర్ఎస్ కు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడిస్తానన్న కవిత.. ఇప్పటి వరకు తనపై అభాండాలు మోపి.. తనను ప్రజల మధ్య చులకన చేసిన రాష్ట్ర బీజపీ నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.
ఇక కేటీఆర్ పై కూడా కవిత ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మద్యంకేసు కారణంగానే గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ తీర్పు వెలువడిన తరువాత కేటీఆర్ చేసిన ట్వీట్ పై కవిత అసలు తనపై కేసు పెట్టిందే పార్టీ కోసమన్నారు. ఓటమికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. ఉద్యోగాలు, ఇళ్లు ఇవ్వకపోవటం, దోపిడీ దారులకు టికెట్లు ఇవ్వటం, అహంకారం కారణంగానే బీఆర్ఎస్ ఓడిపోయిందన్న కవిత, బీఆర్ఎస్ ను ప్రజలే తిరస్కరించారనీ, ఆ విషయాన్ని ఇప్పటికైనా నిజాయితీగా అంగీకరించండని హితవు పలికారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/moral-victory-for-kalvakuntla-kavitha-39-214759.html
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయాన్నికేంద్ర హోంమంత్రికి వివరించిన సీఎం రేవంత్.. వేగంగా పెరుగుతున్న జనాభా, పట్టణ విస్తరణ, పరిశ్రమల వృద్ధి దృష్ట్యా రాష్ట్రానికి మరిన్ని ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని, తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కోరారు.
సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు.
కొద్దికాలం కిందట శరద్ పవార్ తాను రాజ్యసభకు పోటీ చేసే ప్రశక్తే లేదని ప్రకటించారు. అయితే ఇటీవల ఆయన అన్న కొడుకు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంతో మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలు ఉండగా, ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 37 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం.
తెలంగాణలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ప్రపంచ రాజకీయ పరిణామాలపై ఆసక్తికర చర్చ జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాలస్వామి వారి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం (మార్చి 2) దేవుడికి సమర్పించే పట్టువస్త్రాలను సమర్పించే విషయంలో కొలికపూడి దురుసుగా వ్యవహరించారు.
నెమలి వేణుగోపాలస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన కల్యాణోత్సవానికి ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావులు కుటుంబాలతో కలిసి హాజరయ్యారు. ఆలయ మర్యాదల ప్రకారం, ప్రోటోకాల్ అనుసరించి అధికారులు స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఎంపీ కేశినేని చిన్ని చేతికి అందించారు.
వాస్తవానికి మల్లు భట్టి విక్రమార్క్ జగన్ ను తన కుమారుడి వివాహానికి జనగ్ ను బెంగళూరు వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. అయితే జగన్ స్వయంగా తాను మంగళవారం తాడేపల్లి వస్తాననీ, అప్పుడు ఆహ్వానిస్తే సరిపోతుందనీ కబురు పంపారు.
ఐదుగురు వైసీపీ ఎమ్మెల్సీలు తమ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే మండలి సభ్యత్వానికి వారు చేసిన రాజీనామాలను చైర్మన్ ఇప్పటి వరకూ ఆమోదించలేదు.
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.