ఒకే వర లో రెండు కత్తులు.. విశాఖ సౌత్ లో కూటమి నేతల మధ్య విభేదాలు
Publish Date:Mar 4, 2026
Advertisement
విశాఖలో ఒకే వర లో రెండు కత్తులు అన్న రీతిన కూటమి నాయకుల వ్యవహారం కొనసాగుతోంది. ముఖ్యంగా విశాఖ సౌత్ లో తెలుగుదేశం, జనసేన నాయకులు మధ్య పొత్తు సక్రమంగా లేదన్న మాట బహిరంగంగా వినినిపిస్తున్నది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా జనసేనకు చెందిన వంశీకృష్ణ శ్రీనివాస్ కొనసాగుతున్నారు. ఈ దశలో జీవీఎంసీ కి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీ నుంచి జనసేన, తెలుగుదేశంకు మద్దతుగా నిలిచారు వీరంతా విశాఖ మేయర్ గా పీలా శ్రీనివాస్ ఎన్నిక సమయంలో ఒక రకంగా పార్టీని ఫిరాయించారు అయితే ఈ కార్పొరేటర్లు అనుకున్న రీతిన కూటమి ధర్మాన్ని పాటించడం లేదు దీనికి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న అధినాయకులు కారణం. నిజానికి ఇక్కడ టిడిపి ఇన్చార్జిగా గతంలో వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన సీతం రాజు సుధాకర్ ఉన్నారు ఈయన వెంట వైసీపీకి చెందిన కార్పొరేటర్లతో తోపాటు టిడిపి కార్పొరేటర్లు కొందరు ఉన్నారు అదే సమయంలో వైసీపీ నుంచి జనసేనకు వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన వంశీకృష్ణ శ్రీనివాస్ వెంట కూడా కొందరు కార్పొరేటర్లు ఉంటున్నారు వీరందరూ కూడా తమతమ నాయకులకు అనుకూలంగా అడుగులు వేస్తున్నారు. ఈ తరహాలో పార్టీ సభ్యత్వం నుంచి ఇతర వ్యవహారాల్లో కూడా తలో దిక్కు అడుగులు వేయడంతో కూటమి మధ్య సయోధ్య కరవైంది. సంక్రాంతి సంబరాలు నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఈ రెండు వర్గాల మధ్యా పోటీ కొనసాగుతున్నది. సీతం రాజు సుధాకర్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద ముగ్గుల పోటీ నిర్వహిస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కనకమాలక్ష్మి ఆలయం వద్ద ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇది ఒక్కటే కాదు, కార్పొరేషన్ పదవుల విషయంలో కూడా తలో దిక్కు అడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య కార్పొరేటర్ల పదవీకాలం మరొక రెండు వారాల్లో ముగుస్తోంది. వీరిలో కొందరు నేరుగా తెలుగుదేశం నుంచి పోటీ చేసి కూటమిలో కొనసాగుతుంటే... మరి కొందరు ఇండిపెండెంట్ లు వైసీపీ నుంచి వచ్చి కూటమికి మద్దతుగా నిలిచారు. అయితే తమ పదవీకాలం ముగిసిన తర్వాత వార్డుల్లో ఏ తీరున వ్యవహరిస్తారన్న విషయం అర్థం కావడం లేదు ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఓడిపోయిన కార్పొరేటర్ అభ్యర్థులు తిరిగి పార్టీ సింబల్ పై తమకు సీట్లు కావాలని గట్టిగా పట్టు పడుతున్నారు అయితే మేయర్ సీటు కోసం పార్టీ వీడి వచ్చిన తమకు కార్పొరేటర్ అభ్యర్థిగా సీటు కావాలని ఇతరులు అడుగుతున్నారు ఈ పరిస్థితుల్లో నాయకుల మధ్య సయోధ్య లేకపోవడంతో తమ భవిష్యత్ ఏ రకంగా ఉంటుందో అని త్వరలో మాజీలు కాబోతున్న కార్పొరేటర్లు కలవర పడుతున్నారు. ముఖ్యంగా సీతం రాజు సుధాకర్, సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మధ్య సయోధ్య లేకపోవడం వల్ల తమ రాజకీయ భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కూటమి కార్పొరేటర్లు కలవర పడుతున్నారు మరోవైపు దేవాదాయ శాఖ ఆలయ పాలకమండలి విషయంలో కూడా నాయకులకు అన్యాయం జరిగినట్టు లో లోపల మధనపడుతున్నారు. కూటమి ధర్మానికి భిన్నంగా ఈ నాయకుల వ్యవహారం ఉండటం కొందరికి లాభం, మరికొందరికి నష్టం జరుగుతోంది. ఈ పరిస్థితుల మధ్య ఇప్పటికే తమకు అన్యాయం జరిగిందని బిజెపి నాయకులు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితి ఒక రకంగా ఒక ఒరలో రెండు కత్తుల సమెతలా తయారైంది. నిజానికి వైసీపీ నుంచి సీటు ఆశించిన సీతారామరాజు సుధాకర్, వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ను ఓడించడంలో కీలకంగా వ్యవహ రించారు. అంతమాత్రాన అతనికి ప్రాధాన్యత ఇస్తూ కూటమి కార్పొరేటర్లకు అన్యాయం చేయలేమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తన అనుచరుల వద్ద చెబుతున్నారు. అదే సమయంలో సుధాకర్ కూడా అసలు తన ప్రమేయం లేకపోతే జనసేనకు ఇక్కడ అవకాశం ఉండదని అంటున్నారు. నాయకులు వాదన ఏ రకంగా ఉన్నా తమ భవిష్యత్తుకు ఇబ్బందికరంగా ఉందని కూటమి ద్వితీయ శ్రేణి నాయకులు మదన పడుతున్నారు.
http://www.teluguone.com/news/content/differences-between-alliance-leaders-39-215031.html





