5న తెలంగాణకు నైరుతి.. ఇక వానలే వానలు

Publish Date:May 31, 2022

Advertisement

నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని మూడు రోజుల ముందే తాకినా.. అవి తెలంగాణలోకి ప్రవేశించడానికి మాత్రం మరో ఐదు రోజులు పడుతుంది. ఈ నెల 5 రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్ష పాతం నమోదౌతుందని అంచనా వేసింది.

ఏప్రిల్ నెలలో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ప్రకటించిన ఐఎండి ఇప్పుడు దానిని సవరించుకుంది. ఈ ఏడాది సగటు వర్షపాతం 103శాతం ఉంటుందని పేర్కొంది. రుతుపవనాల విస్తరణకు అత్యంత అనుకూలమైన వాతావరణం ఉందని, అవి చురుగ్గా కదులు తున్నాయనీ వివరించింది. దేశంలో ఈశాన్య ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన అన్న ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదౌతుందని వివరించింది.

 దేశంలోని వ్యవసాయానికి నైరుతి రుతుపవనాలు  అత్యంత ముఖ్యమన్న సంగతి తెలిసిందే.   నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతపవనాలు కేరళ తీరాన్ని తాకుతుంటాయి. అయితే ఈసారి మూడు రోజుల ముందుగానే రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఈ ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

అయితే తాజాగా భారత వాతావరణ శాఖ  ఈ రుతుపవనాల సీజన్‌లో ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్న తీపి కబురును అందించింది.  నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వేసవి ప్రతాపం తగ్గడంతో జనం ఉపశమనం పొందుతున్నారు. దేశంలోని పలు ప్రాంతాలలో వర్షాలు కురిసి వాతావరణం చల్లబడింది. 

By
en-us Political News

  
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్‌ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్‌ డెత్‌ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.