ఎన్నికల నిబంధనలకు పాతర ... డబ్బు, మద్యం పంపిణీలో పోటీ ...
Publish Date:May 19, 2012
Advertisement
ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపకం జరుగుతోంది. పేదల అలవాట్లను ఆసరాగా చేసుకుని విజయం సాధించాలన్న అభ్యర్థుల తృష్ణకు ఈ పంపకం అద్దం పడుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో చెక్ పోస్టుల ద్వారా నాలుగుకోట్ల పైచిలుకే లెక్కల్లో చూపని డబ్బు పోలీసుల చేతికి చిక్కిందని తేలుతోంది. దీన్ని ఆదాయపుపన్నుశాఖకు అప్పగించేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. ఆదాయపన్నుశాఖ కూడా నిందితులకన్నా ఆధారాల సేకరణకే విలువ ఇచ్చింది. పోలీసులూ అదే పంథాను అనుసరించారు. అసలు ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లను ప్రలోభపెట్ట కూడదు. కానీ, ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూనే ఉన్నారు. పార్టీల అధినేతలూ ఇదే తీరులో వ్యవహరిస్తారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నిరూపించారు. ఈయన రోడ్డుషోతో పాటు మద్యం పంపిణీ కూడా సాగిపోయింది. పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడదామని ఆయన కన్నుగప్పే ప్రయత్నమూ చేశారు. రాజంపేటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలమైంది. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ కూడా ఇదే రోడ్డుషోలో పాల్గొన్నారు. ఈ రోడ్డుషో సందర్భంగా మద్యం సీసాలతో ఉన్న ట్రాక్టరు కొత్తపల్లె పాఠశాల సమీపానికి రాగానే మన్నూరు ఎస్.ఐ. ఆ ట్రాక్టర్ లోని బాటిల్స్ తో పట్టుకున్నారు. ట్రాక్టరును సరుకును ఎస్.ఐ.సీజ్ చేశారు. ఉపురపల్లెకు చెందిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత డి.గోపాలరెడ్డి కూడా పోలీసులకు సాక్షిగా దొరికి పోయారు. పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ తరహా ప్రలోభాలు ఇక్కడ మామూలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి దాకా ఎన్నికల నిబంధనలో ఓటరుకు డబ్బు ఇచ్చినా, మద్యం ఇచ్చినా పార్టీదే తప్పు. కానీ ఇప్పుడు ఓటరు కూడా తప్పు చేసినట్లు ఎన్నికల కమీషన్ గుర్తిస్తోంది. దీంతో ఓటరు అసలు ఆరోపించటానికే ఇక ముందుకు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఒప్పుకుని జైలుకు వెళ్ళటం కన్నా సర్దుకుపోవటమే మిన్న అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం వంటి తూర్పు గోదావరి జిల్లాల్లోనూ మద్యం, డబ్బు ఎన్నికను శాసిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అటు ప్రచారంలోనూ, ఇటు అన్నిస్థానాల్లోనే కాదు ఎన్నికల నిబంధనలను అతిక్రమించటంలోనూ ముందుంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై నిబంధనావళి అతిక్రమణ కేసు నమోదు అయింది. ఆయన ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఊరేగింపు కోసం పోలీసు అనుమతి కోరాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేశారు. ప్రత్యేకించి పోలీసుల ముందునుంచే ఈ ఊరేగింపు కూడా చేయటంతో ఈయనపై కేసు ఆధారాలతో సహా నమోదైంది.
http://www.teluguone.com/news/content/money-and-liquor-seized-near-checkposts-24-14146.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





