'అనంత' చరిత్ర మార్చటం సాధ్యమేనా?

Publish Date:May 19, 2012

Advertisement

రాయసీమ జిల్లా కేంద్రమైన అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెసు, తెలుగుదేశం, కమ్యూనిస్టు పార్టీలతో ముడిపడిన చరిత్ర ఉంది. ఇప్పటివరకూ ఈ మూడు పార్టీల అభ్యర్థులనే ఓటర్లు గెలిపించారు. అయితే వచ్చే ఉప ఎన్నికల్లో ఈ రికార్డును తిరగరాయాలని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి భావిస్తున్నారు. తన పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డికి టిక్కెట్టు ఇచ్చారు. ఈయనపై అసలే భూ కుంభకోణం వంటి పలు కేసులున్నాయి. ఈ నేరచరిత్ర వల్ల ఆయనకు విజయావకాశాలు తక్కువని స్థానిక ఓటర్లు కొందరు 'తెలుగువన్.కామ్'కు చెప్పారు.

 

 

ఒకవేళ ఆయన గెలిస్తే మాత్రం చరిత్రను తిరగరాసినట్లే అని స్పష్టమవుతోంది. ఈ నియోజకవర్గం ఏర్పడిన తరువాత ఇప్పటివరకూ 14సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో 9సార్లు కాంగ్రెస్, 2సార్లు తెలుగుదేశం, ఒక్కసారి (ప్రారంభ ఎన్నికల్లో మాత్రమే) కమ్యూనిస్టులు గెలుపొందారు. 1952లో ఈ నియోజకవర్గం ఏర్పాటు అయింది. లక్షా 85వేలమంది ఓటర్లలో బిసిలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇదే. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత రెండుసార్లు గెలుపొందింది. ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఈ ఎన్నికల్లో తప్పదంటున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గుర్నాథరెడ్డి పోటీ చేశారు. ఈ సారి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ తరపున రంగంలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ముషిరాబేగం, తెలుగుదేశం పార్టీ తరపున మహాలక్ష్మీశ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఈయన దప్పుల మ్రోతతోనూ, మేళాలతోనూ వినూత్న తరహాలో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిపిఎం అభ్యర్థిగా రాంభూపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈయనకు లోక్ సత్తా మద్దతు ప్రకటించింది.

By
en-us Political News

  

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

ఖరారైన రాష్ట్రపతి పాలన ...

రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...

విఫలమైన 'టి' కాంగ్రెస్

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.

వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.

చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.

రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను

నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.

తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.

 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.