నామినేషన్లతో జోరెక్కుతున్న ఎన్నికల ప్రచారం ...
Publish Date:May 19, 2012
Advertisement
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఘట్టానికి తెరలేవటంతో అన్ని రాజకీయపార్టీలూ తమ ప్రచారం వేళలను పెంచుకున్నాయి. ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు తోడురాగా అభ్యర్థులు మండుటెండలో తిరగటానికి సిద్ధపడుతున్నారు. ఈ ప్రచారంలో పాల్గొనే పార్టీలు ఢిల్లీ నేతలూ రాష్ట్రంలో తమ కార్యక్రమాలను రూపొందించుకున్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల పరిశీలకుడు వాయలార్ రవి ఇక రాష్ట్రంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అలానే సర్వేల ఆధారంగా తమ అభ్యర్థి విజయావకాశాలనుపరిశీలించే నేతలూ ప్రత్యామ్నాయంగా ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రత్యేకించి బలహీనంగా ఉన్న అభ్యర్థుల గురించి ఇప్పటికే రాజకీయ పార్టీలు అన్నీ ఒక అవగాహనకు వచ్చాయని తెలిసింది. ఆ ప్రదేశాల్లో ప్రచార బాధ్యతను సమీపంలోని నేతలతో పాటు పార్టీలో ప్రముఖవక్తలను కూడా తోడిచ్చి పంపేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నాయి. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి ఈ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో నామినేషన్ల స్వీకరణకు 25వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. 26న పరిశీలన, 28న జాబితా ప్రకటన జూన్ 12న పోలింగ్, 15న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఈ షెడ్యూల్ పై అవగాహన ఉన్న అభ్యర్థులు ముందుగానే తమ జ్యోతిష్యులను సంప్రదించి వార సూచనల మేరకు నామినేషన్ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. నిన్నటిదాకా తమకు టిక్కెట్టు వస్తుందో లేదో అని ఎదురు చూసిన అభ్యర్థులు పార్టీ ప్రకటన పూర్తయ్యాక జ్యోతిష్యులను సంప్రదిస్తున్నారు. ఈ సంప్రదింపులతో పాటు సమయం తక్కువగా ఉన్నందున ప్రచారంపై అభ్యర్థులు ద్రిష్టి సారించారు. ఇప్పటి వరకూ ప్రచారంలో పార్టీలు పోటాపోటీగా ఉన్న కర్నూలు జిల్లాలో పట్టణాలపై పట్టుకోసం నేతలు ప్రణాలికలు రూపొందిస్తున్నారు. అలానే తిరుపతిలో కాంగ్రెస్, టిడిపి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ అభ్యర్థులు ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నారు. కొత్తగా బిజెపి అభ్యర్థి మధుసూదన్ కూడా ప్రచారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మాచార్లలోనూ, ప్రత్తిపాడులోనూ మూడు ప్రధానపార్టీలు పోటాపోటీ ప్రచారం చేసుకుంటున్నాయి. ప్రత్తిపాడులో లోక్ సత్తా అభ్యర్థి కూడా ప్రచారం ప్రారంభించారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమావ్వటంతో ప్రచార సమయం తగ్గిపోయిందని అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే గుంటూరు జిల్లాకు దేశం అధినేత చంద్రబాబు వచ్చి వెళ్ళారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రానున్నారు. ప్రత్యేకించి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్సా, రాజ్యసభ్యుడు చిరంజీవి కూడా వస్తారు. అలానే తెలుగుదేశం పార్టీ తరపున సినీనటుడు బాలకృష్ణ వస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాలో మూడు పార్టీలూ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తామే గెలిచే అభ్యర్థులమని ఓటర్లకు పరిచయం చేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
http://www.teluguone.com/news/content/election-campaing-speeding-after-nominations-24-14142.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





