శ్రీలంక ఆరోపణకు మౌనమేల మోదీజీ!
Publish Date:Jun 16, 2022
Advertisement
విమర్శించడం, విపక్షాల మీద వాగ్ధాటితో మీదపడటం ఈ మధ్య బిజెపీవారికి మాత్రమే చెల్లుతోంది. నాయకులు, వీరాభిమానులకు కూడా స్వరం గట్టిగా వినిపించడం చాలా యిష్టం. కానీ తమవారిని కాపాడుకోవడానికి చేసే పొరపాట్లను, తప్పిదాలను కూడా సరిచేసుకోవాలన్న జ్ఞానం కూడా కలిగి ఉంటే మంచిదేమో! తనవారికి తగినంత సాయం చేయడంలో ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి వర్గీయులు ఎప్ప డూ వెనుకాడ రు. పాలన సవ్యంగా సాగాలంటే మరి అస్మదీయుల మద్దతు ఎంతో అవసరం. మరి బిజెపీ వారి అస్మదీయులు అదానీ, అంబానీలేనని అందరికీ తెలుసు. పాపం గౌతమ్ అదానీ చాలా ఆర్ధిక ఇబ్బం దుల్లో వున్నాడని అనుకున్నారో ఏమోగాని ఈ మధ్యనే శ్రీలంక ప్రభుత్వం వారితో సంప్రదించి మోదీ అదానీకి విండ్ పవర్ ప్రాజెక్టు వచ్చే ట్టు చేశారు. అదేదో అనుకున్నంత సులభంగా కాలేదు. వూహించని విధంగా పెద్ద దుమా రమే రేగింది. ఎందుకంటే అసలే సంక్షోభపరిస్థితుల్లో వున్నశ్రీలంక ప్రభుత్వం భారత్ నుంచే సాయం పొందేందుకు ఎదురు చూస్తోంది. ఈ సమయంలో అదానీకి సాయం చేయడానికి ఆయనకు ఒక ప్రాజెక్టు ఇప్పించాలని మోదీ ప్రయత్నించారు. శ్రీలంక అధ్యక్షుడు గటబాయ రాజపాక్సె పై ప్రధాని మోదీ వొత్తిడి తేవడంవల్లనే రాజ పాక్సె అంగీకరించవలసి వచ్చిందని స్వయంగా శ్రీలంక విద్యుత్ సంస్థ అధ్యక్షునిగా పనిచేసిన ఫెర్నాండో బయటపెట్టారు. భారత ప్రధాని ఇంతగా అదానీకి సహాయం చేయడంలో అర్ధమే మిటన్నది గొప్ప రహస్య మేమీ కాదు. ప్రభుత్వం, అదానీ మధ్య సత్సం బంధాలు కలకాలం సాగాలి ఇచ్చిపుచ్చుకోవడాలు కొనసాగాలి. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఈడీ పిలుపు రావడం, విచారణ గురించి రోజూ ఆరోపణలు చేస్తూ కామెంట్లు చేస్తున్న కేంద్రంగాని, బిజెపీవర్గీయులు గానీ మరి శ్రీలంక ప్రభుత్వం చేసిన ఆరోపణల పట్ల ప్రధాని, అదానీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వుండడం విడ్డూరంగా వుందని తెలంగాణా ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో ఘాటుగా విమర్శించారు. విపక్షాలవారు ప్రశ్నించిన వాటికి, సాక్ష్యాలు వున్నప్పటికీ కేంద్రం ఇలా మౌనం వహించడం వారి తప్పిదాన్ని వారే బయట పెట్టు కున్నట్టు అవుతుంది. అందులోనూ ఒక అంతర్జాతీయ స్థాయి ఆరోపణకు ప్రధాని మోదీ తగిన వివరణ లేదా సమాధానం ఇవ్వవలసిన అవసరం ఎంతయినా వుంది.
కానీ, శ్రీలంక ప్రభుత్వం భారత ప్రధాని మోదీ పై చేసిన ఆరోపణకు మరి కేంద్రప్రభుత్వంగానీ, బిజెపీ సీనియర్లూ ఎవ్వరూ నోరుమెదపకపోవడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. చీటికీ మాటికీ విపక్షాల మీద ఒంటి కాలి మీద లేచే బీజెపీ నాయకులు మరి దేశాన్ని అవమానించిన ఈ సంఘటనకు మౌనం వహించ డంలో ఆంతర్యమేమిటి? శ్రీలంక అధ్యక్షుడికి గట్టిగా సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారని దేశం లో అన్ని వర్గాల్లోనూ చర్చ వుంది. దీనికి కనీసం దేశ ప్రజలకయినా కేంద్రం సమాధానం చెప్పాలి. అదానీ తనకు పెద్ద ప్రాజెక్టు లభించిందన్న ఆనందంలో వుండవచ్చుగానీ ప్రధాని తనకు సాయం చేసినందుకు తనవంతుగా సమాధానం చెప్పాలి.
http://www.teluguone.com/news/content/modiji-why-silent-on-srilanka--25-137762.html





