ప్రధాని మోడీతో తమిళిసై భేటీ.. కారణమదేనా?

Publish Date:Jul 4, 2022

Advertisement

పెళ్లికి వ‌చ్చిన‌వారంతా స‌ర‌దాగానే గ‌డిపి వెళిపోతారు. మంచిమాట‌లు, మంచి అభిప్రాయాల‌తో మంచి జ్ఞాప‌కాల‌నూ వెంట తీసికెళ‌తారు. నిన్న మొన్న‌టి బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ‌చ్చి కేసీఆర్ ప్ర‌భుత్వానికి కేంద్రం నుంచి ఇచ్చిన ఆర్ధిక స‌హ‌కారం గురించి ఎంతో  చెప్పారు. టిఆర్ ఎస్ ప్రభుత్వానికి కేంద్రం సాయం చేయ‌డం లేద‌న్న‌ది శుద్ధ అబ‌ద్ధ‌మ‌ని  ఆయ‌న మాట‌ల్లోనే ప్ర‌ధాని తెలంగాణా ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టం చేశారు. అంతవ‌ర‌కూ బాగానే వుంది. కానీ వెళుతూ ఓ క్ష‌ణం    గ‌వర్న ర్‌తో మోడీ భేటీయే   గులాబి దండులో ఆందోళ‌న నింపింది. పోతూ పోతూఈ  పెద్దాయ‌న గవర్నర్ తో ఏం మాట్లాడి వుంటారు, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై తమ ప్రభుత్వంపై,  ముఖ్యమంత్రిపై ఏం ఫిర్యాదులు చేసి ఉంటారు అన్న  చ‌ర్చ‌లు ఆరంభ‌మ‌య్యాయి.  అస‌లే ఇటివ‌ల కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ మ‌ధ్య ఏది ప‌డినా భ‌గ్గుమ‌ంటున్న‌ది. మ‌రి ప్ర‌ధాని ఏకంగా ఆమెతో చర్చకు సమయం కేటాయించారంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యే అంశమే ఆమె నుంచి ఆయనకు చేరి ఉంటుందని గులాబి దళం ఆందోళన పడుతోంది. ప్రధాని నరేంద్రమోడీ పరేడ్ గ్రౌండ్స్ లో సభ అనంతరం రాజ్ భవన్ కు చేరుకున్నారు. అక్కడే బస చేశారు. అందులో పెద్ద విశేషమేమీ లేదు. కానీ రాజ్ భవన్ లో ఆయనతో గవర్నర్ తమిళిసై భేటీ అయ్యారు. ఇరువురూ దాదాపు 40 నిముషాల సేపు భేటీ అయ్యారు. ఇది పూర్తిగా ముఖాముఖీ భేటీ. అధికారులు కానీ, పార్టీ నేతలు కానీ లేరు. ఇక్కడే వారిరువురి మధ్యా భేటీలో చర్చకు వచ్చిన అంశాలేమిటన్నదానిపై రాజకీయ వర్గాలలో మరీ ముఖ్యంగా గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు వారిరువురి భేటీలో పూర్తిగా తెలంగాణ అంశాలే చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా కేసీఆర్ పాలన, రాష్ట్రంలో శాంతి భద్రతలు, కేసీఆర్ ముందస్తు ప్రణాళికలు తదితర అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై కొన్ని నివేదకలను మోడీకి అందించినట్లు చెబుతున్నారు. దీంతో వీరురువురి మధ్యా జరిగిన చర్చలపై తెరాసలో ఉత్కంఠ పీక్స్ కు వెళ్లింది. ఇటీవలి కాలంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య గ్యాప్ బాగా పెరిగిన నేపథ్యంలో మోడీతో భేటీలో గవర్నర్ తమిళసై కేసీఆర్  సర్కార్ పై మోడీకి ఫిర్యాదు చేయడమే కాకుండా.. కీలక అంశాలపై నివేదికలు కూడా సమర్పించి ఉంటారన్న భావన అయితే రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతున్నది.  

మామూలుగా అయితే  ప్రధాని, గవర్నర్ భేటీకి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉండదు. అయితే తెలంగాణ గవర్నర్ తమిళిసై- మోడీ భేటీ మాత్రం ఎనలేని రాజకీయ ప్రధాన్యత  సంతరించుకుంది. అందుకు కారణం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితే కాకుండా.. గవర్నర్- ప్రభుత్వం మధ్య ఉన్న రిఫ్ట్ కూడా ఒక కారణం. గతంలో తమిళిసై ఢిల్లీ వెళ్లి మరీ కేసీఆర్ ప్రభుత్వ తీరుపై ప్రధాని, హెంమంత్రికి ఫిర్యాదు చేసిన సంగతి విదితమే. గవర్నర్ పర్యటనలలో మంత్రులు, అధికారులూ ప్రొటోకాల్ పాటించకపోవడం దగ్గర నుంచి.. అడిగిన సమాచారం కూడా ప్రభుత్వం నుంచి అందడం లేదన్న వరకూ తమిళసై కేంద్రానికి నివేదించారు.

ఇక ప్రస్తుతం కేంద్రం, తెరాస సర్కార్ మధ్య రాజకీయం వేడెక్కిన తరుణంలో తమిళిసైతో మోడీ భేటీకి ప్రాధాన్యత పెరిగింది.  జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేయాలనే ఆలోచన కేసీఆర్ ఇటీవలి  ప్రయత్నాలు విఫలమైనా   జాతీయ ప్రత్యామ్నాయ ప్రణాళిక ఆలోచనలతో మోడీపై విమర్శల దాడి పెంచిన నేపథ్యంలో.. మోడీ ప్రత్యేకంగా గవర్నర్ తమిళపైతో  40 నిముషాల పాటు ముఖాముఖి చర్చలు జరపడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నది.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమిళసై చెప్పిన అంశాలు, అందించిన నివేదికలను ఆయన కూలంకషంగా పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటారన్న భావన రాజకీయ వర్గాలలో వ్యక్తమౌతోంది. ఏది ఏమైనా తమిళిసైతో మోడీ భేటీలో ఆమె కేసీఆర్ ను ఇరుకున పెట్టడానికి అవసరమై సమాచారాన్ని అందించి ఉంటారని రాజకీయవర్గాలలో చర్చ సాగుతోంది.

By
en-us Political News

  
రష్దీపై దాడి చేసిన వ్యక్తి న్యూజెర్సీకి చెందిన 24 ఏళ్ల హదీ మటర్‌గా గుర్తించారు. న్యూయార్క్ పోలీసులు దాడి చేసిన వ్యక్తి పై ఇంకా అభియోగాలు మోపలేదని, రుష్దీ పరిస్థితిని బట్టి అభియోగాలు ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇటీవలే పోస్ట్ కోవిడ్ సమస్యలతో సోనియా గాంధీ చికిత్స తీసుకున్న సంగతి విదితమే. కాగా సోనియాగాంధీ కరోనా బారిన పడిన విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఎన్ని డ్రామాలాడినా, ఏకంగా ఎస్పీ చేతే ఆ వీడియోను ఫొరెన్సీక్ పరీక్ష కూడా ఒరిజనలో కాదో తేల్చలేదని చెప్పించినా, ఆ ఎస్పీ చెప్పిన దానిని పట్టుకుని గోరంట్ల మాధవ్ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చేసుకున్నా.. దానిని పట్టుకుని మంత్రి రోజా వంటి వారు ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించేసినా నిజం మాత్రం నిప్పులా బయటపడింది.
దక్షిణ భారతదేశం బీజేపీకి అంతు చిక్కని ప్రాంతం. క‌ర్ణాట‌క‌ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఇంత వరకూ ఆ పార్టీకి గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది. అయితే బీజేపీ మాత్రం అందని ద్రాక్ష పుల్లన అని వదిలేయకుండా.. దక్షిణాది రాష్ట్రాలలో పాగాకు విశ్వ యత్నం చేస్తోంది. బీజేపీ మిషన్‌ సౌత్‌కు తెలంగాణ ఇప్పుడు సారవంతమైన ప్రాంతంగా భావిస్తోంది.
నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎప్పటికప్పుడు ట్రెండీగా ఉంటారు. ఎక్కడ ఏ చిన్న ఛాన్స్ దొరికినా, వైసీపీ అధినేతను, ఆ పార్టీ నేతలను తూర్పారపడుతూనే ఉంటారు. తాజాగా హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం, జరుగుతున్న పరిణామాలు, వైఎస్ విజయమ్మ కారు ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ తన దైన స్టైల్ లో స్పందించారు.
మూడేళ్ల వ‌య‌సులో క్రిస్టినా తన అస‌లు కుటుంబానికీ దూర‌మ‌యింది. అన్నా.. నువ్వులేని నా బ‌తుకు భారం.. అంటూ వీధుల ప‌డి సినిమాటిక్‌గా ఏడ‌వ‌లేదు. ఎలాగైనా క‌లివాల‌ని, ఎందుకు విడిపోయిందీ తెలుసుకోవాల న్న‌ది ఆమె ప‌ట్టుద‌ల‌. 
ఎన్డీయే ఖాళీ అవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఉందా? ఉద్దేశ పూర్వకంగానే మిత్రపక్షాలను కూటమి వీడేలా బీజేపీ వ్యవహరిస్తోందా? 2024 ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగడమే రాజకీయంగా తమకు లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఆ పార్టీ చెబుతున్న డబుల్ ఇంజిన్ అర్ధం ఇదేనా? దేశ వ్యాప్తంగా అన్నిరాష్ట్రాలలోనూ అధికారం చేజిక్కించుకోవాలంటే ముందుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలను బలహీనం చేయాలన్నదే ఆ పార్టీ లక్ష్యమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఈ క్లాష్ నుండి విజేతలుగా నిలిచేందుకు తాను భారత్‌తో కట్టుబడి ఉంటా నని చెప్పాడు.
ఆర్ఎస్ఎస్ తన ప్రొఫైల్ పిక్ ను మార్చేసింది. సామాజిక మాధ్యమంలో ఆర్ఎస్ఎస్ ప్రొఫైల్ పిక్ ఇంత కాలం కాషాయ జెండా ఉండేది. కానీ శుక్రవారం( ఆగస్టు 15) ఆ ప్రొఫైల్ పిక్ మారిపోయింది. కాషాయ జెండా స్థానంలో జాతీయ జెండా కనిపించింది.
అమిత్ షా మునుగోడు సభ వాయిదా పడిందన్న వార్తల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 21న అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని స్పష్టం చేశారు. మునుగోడులో భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారని బండి సంజయ్ స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ కు సంబంధించిన వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి పరీక్ష చేయించాలని కోరుతూ ఏపీ న్యాయవాది ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కులేఖ రాశారు. ఏపీలో మహిళల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయనా లేఖలో పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో యాదాద్రి జిల్లాలో పెద్ద సంఖ్యలో పోస్టర్లు వెలిశాయి. కాంగ్రెస్ ద్రోహిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభివర్ణిస్తూ ఈ పోస్టర్లు వెలిశాయి,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.