తండ్రికి రమ్ ఇచ్చి చివరి ఆనందాన్ని పంచుకున్న ఆన్
Publish Date:Jul 4, 2022

Advertisement
పొలానికి వెళ్లే రైతుకి కూతురు ముద్దిచ్చి పంపింది. హెడ్‌మాస్టర్‌కి ఆయన మనవడు ముద్దిచ్చే బడికి పంపేడు. మరణానికి మరింత దగ్గర్లో వున్న తండ్రికి రమ్ ఇచ్చి ఆనందపరిచింది పెన్నెలోప్ ఆన్! చిన్న ప్పటి నుంచి బిస్కెట్లూ, చాక్లెట్లు ఇచ్చి బడికి పంపిన తండ్రి పెదాల మీద చివరి చిర్నవ్వు కోసం ఆన్ తనకు బొత్తిగా ఇష్టంలేని రమ్ ఇవ్వక తప్పలేదు. కొన్ని అంతే.. ఇష్టంగా అయిష్టమైన పని చేయవలసి వస్తుంది. ఆన్ తండ్రి చక్కగా రోజూ తాగేవాడు. ఆయ నకు బండ్‌బెర్గ్ రమ్ అంటే మహా పిచ్చి. ఆన్ కి తండ్రి తాగడం పెద్దగా నచ్చేది కాదు. ఆయనకు శ్వాస సంబంధ ఇబ్బందిని ఇంట్లో వారు గమనించి ఆస్పత్రికి తీసికెళ్లారు. పెన్నెలోప్ తండ్రికి క్రానిక్ అబ్స్ట్ర క్టివ్ పల్మనరీ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఈ పరిస్థితి శ్వాసను ప్రభా వితం చేస్తుంది. చాలాకాలం నుంచి ఈ జబ్బుతో ఆయన బాధపడుతున్నారు. చాలారోజులు ఆస్పత్రిలోనే వుండాల్సి వచ్చింది. జబ్బు ముదిరి ప్రాణాపాయ స్థితికి వచ్చింది. ఆన్ తండ్రిని కోల్పోయే సమయం ఆసన్నమైంది. డాక్టర్లు ఆ సంగతి ఆమెకు చెప్పక తప్పలేదు. ఆమె బాధపడింది ..లోలోపల. తండ్రితో వున్న అనుబంధంతో ఆయన పడక దగ్గర ఏడవలేదు. చుట్టూ అంతా ఆనందంగా ప్రశాంతంగానే వుండాలనుకుంది. నిత్యం జోక్స్ వేస్తూ సరదా వాతావరణాన్నే కల్పించింది. చివర్రోజు.. ఆన్ ఆస్పత్రిలో తండ్రి దగ్గరకి మందులు తీసికెళ్లింది. ఆయన నవ్వాడు. దగ్గరికి పిలిచి అబ్బే ఇవి కాదు నాకు బాగా ఇష్టమైన నా మందు కావాలని కోరాడు. ఆన్‌కి ఈసారి కోపం రాలేదు, విసుక్కోలేదు.. గట్టిగా నవ్వింది. పరుగున వెళ్లి ఆయన అమితంగా ఇష్టపడి తాగే బండ్‌బర్గ్ రమ్ చిన్న బాటిల్ తెచ్చింది. దాన్ని డాక్టర్ల అనుమతితో సిరంజ్ ద్వారా ఎక్కించింది. ఆయనకు ఎంత సరదానో.. రోజూ తిట్టే కూతురు స్వయంగా తనకు ఆ మత్తెక్కించేందుకు డాక్టర్‌కి సాయపడుతోందని. కొద్ది గంటల తర్వాత ఆన్ తండ్రి ప్రశాంతంగా వెళిపోయారు. ఆన్ మాత్రం ఆకాశంలోకి చూస్తూ ఈ లోకం లో నాతో చివరి క్షణాలు ఆనందంగా గడపడానికి ఆయన చివరి కోరిక తీర్చడంలో వుండే ఆనందం ఆమె మనసు నిండా నిండిపోయింది. ఆమెకు జీవితాంతం ఇది గొప్ప జ్ఞాపకంగా వుంటుంది ఇక!
http://www.teluguone.com/news/content/ann-let-her-father-his-last-cheer-39-139045.html












