Publish Date:Jun 30, 2022
బీజేపీ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ హైదరాబాద్ లో రెండు రోజులు బస చేయనున్న సంగతి తెలసిందే. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మోడీ రెండు రోజులూ నోవాటెల్ లోనే బస చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు అది మారింది.
జాతీయ కార్యవర్గ సమావేశాలు తొలి రోజు ఆయన నోవాటెల్ లో బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూన్ 3న ఆయన బస రాజ్ భవన్ కు మారనుంది. మూడో తేదీన సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు మోడీ రాజ్ భవన్ నుంచే నేరుగా చేరుకుంటారు. సభ తరువాత ఆయన తిరిగి రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే బస చేసి మరుసటి రోజు అంటే జూలై 4న ఏపీ బయలు దేరి వెళతారు. భద్రతకు సంబంధించి ఇబ్బందుల కారణంగానే ముందుగా నిర్ణయించిన విధంగా కాకుండా మోడీ బసను 3వ తేదీన రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు.
తొలి రోజు అంటే జూలై 2న నోవాటెల్ లోనే కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటం వల్ల మోడీ ఆ రోజు అక్కడే బస చేస్తారు. ఆ మరుసటి రోజు అంటే జూలై3 పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. నోవాటెల్ నుంచి రోడ్డు మార్గాన పరేడ్ గ్రౌండ్స్ కు వెళ్లడం వల్ల ట్రాఫిక్ సమా పలు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో ఆయన బసను రాజ్ బవన్ కు మార్చారు. రాజ్ భవన్ నుంచి పరేడ్ గ్రౌండ్స్ కు దూరం తక్కువ కావడంతో పెద్ద గా ఇబ్బందులు ఉండవని భావిస్తున్నారు. అదీ టీఆర్ఎస్ బీజేపీ ఫ్లెక్సీ వార్, టీఆర్ఎస్, బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది.
ఈ నేపథ్యంలో రోడ్డు మార్గంలో మోడీ ఎక్కువ దూరం లేదా ఎక్కువ సేపు ప్రయాణించాల్సిన పరిస్థితి లేకుండా ఉంటే మంచిదని భద్రతాధికారులు సూచించడంతో ఆయన బసను రాజ్ భవన్ కు మార్చినట్లు చెబుతున్నారు. రోడ్డు మార్గంలో ప్రయాణించే సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నాలు, రోడ్ రోకో వంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్న సమాచారం కూడా మోడీ బసను నోవాటెల్ నుంచి రాజ్ భవన్ కు మార్చడానికి కారణమని చెబుతున్నారు. మోడీ మినహా మిగిలిన బీజేపీ అగ్రనేతలంతా రెండు రోజులూ నోవాటెల్ లోనే బస చేస్తారు. 3వ తేదీ సాయంత్రం బహిరంగ సభ అనంతరం మోడీ రాజ్ భవన్ కు చేరుకుని అక్కడే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయమే ఆయన అక్కడ నుంచి నేరుగా ఏపీ పర్యటనకు వెళతారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-stay-in-novatel-for-one-day-and-the-other-day-he-will-stay-in-rajbhawan-39-138790.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.