ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారీ వర్షాలు, వరదల్లో చిక్కుకున్న నేపథ్యంలో, సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమై వున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వరద పరిస్థితుల గురించి మోడీ సీఎం చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్నివిధాలుగా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా మోడీ హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న సహాయక కార్యక్రమాలను చంద్రబాబు ఈ సందర్భంగా ప్రధాని మోడీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరదల నుంచి ఆదుకోవడానికి ఆయా కేంద్ర శాఖలకు ఆదేశాలు ఇచ్చామని ప్రధాని మోడీ ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు. రాష్ట్రానికి అవసరమైన సాయం అందించాలని, అవసరమైన సామగ్రి పంపపడానికి కూడా ఆదేశాలు ఇచ్చామని చంద్రబాబుకు మోడీ తెలిపారు. కేంద్ర సాయంపై ప్రధానికి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/modi-phone-to-chandrababu-25-184058.html
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.
అంతర్జాతీయ విమానయాన రంగంలో కలకలం సృష్టించిన ఫ్లైదుబాయ్ విమాన హైజాక్ యత్నం కేసులో విచారణ వేగవంతం కాగా, ఊహించని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ వీర జవాన్ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆశిష్ అనే యువకుడు జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కేసు.. దర్యాప్తు ముమ్మరం.!
ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది
చిన్నారి జీవితాన్ని విషాదంగా మార్చిన బిస్కెట్.!
ఆకాశంలో ఓ పక్షి.. విమానంలో వందలాది మంది ప్రయాణికులు.. క్షణాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ! శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పక్షి ఢీకొట్టినట్లు అనుమానం
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.